AP 6 Maths

AP 6th Class Maths Bits 8th Lesson జ్యామితీయ భావనలు

AP 6th Class Maths Bits 8th Lesson జ్యామితీయ భావనలు

AP Board 6th Class Maths Bits 8th Lesson జ్యామితీయ భావనలు

క్రింది ప్రశ్నలకు ఒక పదం లేదా ఒక వాక్యంలో సమాధానాలు రాయండి.

ప్రశ్న1.
“AB రేఖ, CD రేఖకు లంబము” ఈ సమాచారాన్ని గుర్తునుపయోగించి రాయండి.

ప్రశ్న2.
అల్పకోణమును నిర్వచించండి.
జవాబు :
90° కన్నా తక్కువ విలువ గల కోణాన్ని అల్పకోణము అంటారు.

ప్రశ్న3.
రేఖాఖండము పొడవును కొలుచుటకు జ్యామితి పెట్టెలోని ఏ పరికరాన్ని నీవు ఎన్నుకొంటావు ?
జవాబు :
స్కేలు

 

ప్రశ్న4.
A కోణ శీర్షంగా గల ఒక కోణం చిత్తుపటాన్ని గీయండి.
జవాబు :
AP 6th Class Maths Bits 8th Lesson జ్యామితీయ భావనలు 18

ప్రశ్న5.

పై త్రిభుజంలోని కోణాల పేర్లు రాయండి.
జవాబు :
∠PQR, ∠QPR, ∠PRQ

ప్రశ్న6.
ఖండనరేఖలు, మిళితరేఖలను వేరువేరుగా చిత్తుపటాలలో చూపండి.
జవాబు :
AP 6th Class Maths Bits 8th Lesson జ్యామితీయ భావనలు 19

ప్రశ్న7.
రెండు బిందువుల గుండా గీయగల సరళరేఖల సంఖ్య ఎంత ?
జవాబు :
1

ప్రశ్న8.
రెండు రేఖాఖండాలను కలిగిన ఆంగ్ల అక్షరాలను రాయండి.
జవాబు :
L, T, V, X, Y

ప్రశ్న9.
క్రింది కోణాలను అల్ప, అధిక, అధికతర కోణాలుగా వర్గీకరించుము.
75°, 175°, 2759, 164°, 324°, 45°
జవాబు :
అల్పకోణాలు : 759, 45%; అధికకోణాలు :1759, 164; అధికతరకోణాలు : 275°; 324°

ప్రశ్న10.
“l, m రేఖలు సమాంతరాలు” ఈ సమాచారాన్ని గుర్తునుపయోగించి రాయండి.
జవాబు :
l ∥ m

ఈ క్రింది వానికి సరియైన సమాధానాన్ని గుర్తించి రాయండి.

ప్రశ్న3.
క్రింది వానిలో ఏది అసత్యం ?
A) సరళరేఖకు రెండు అంత్య బిందువులు ఉండును.
B) కిరణానికి ఒకే అంత్యబిందువు ఉంటుంది.
C) రెండు కన్నా ఎక్కువ సరళరేఖలు ఒకే బిందువు వద్ద ఖండించుకొంటే వాటిని మిళిత రేఖలు అంటారు.
D) పైవి అన్ని
జవాబు :
A) సరళరేఖకు రెండు అంత్య బిందువులు ఉండును.

 

ప్రశ్న4.
క్రింది ఏ ఆంగ్ల అక్షరాలు మూడు రేఖాఖండాలతో ఏర్పడినవి ?
A) A
B) H
C) Na
D) పైవిఅన్ని
జవాబు :
D) పైవిఅన్ని

ప్రశ్న5.
l, m రేఖలు సమాంతరాలు” ఈ సమాచారాన్ని గుర్తునుపయోగించి రాయడంలో క్రింది ఏది సత్యం ?
A) l ⊥ m
B) l ∥ m
C) lm−→
D) పైవి అన్ని
జవాబు :
B) l ∥ m

ప్రశ్న6.
వాక్యం – I : ఒకే తొలి బిందువు కలిగిన రెండు విభిన్న కిరణాల సమ్మేళనాన్ని “కోణం” అంటారు.
వాక్యం – II : 90° కన్నా ఎక్కువ 180° కన్నా తక్కువ అయిన కోణాన్ని అధికకోణం అంటారు.
A) I సత్యం, II అసత్యం
B) I అసత్యం, II సత్యం
C) I సత్యం, II సత్యం
D) I అసత్యం, II అసత్యం
జవాబు :
C) I సత్యం, II సత్యం

ప్రశ్న7.
క్రింది వానిలో అల్పకోణము
A) 30
B) 450
C) 60°
D) పైవి అన్ని
జవాబు :
D) పైవి అన్ని

ప్రశ్న8.
క్రింది వానిని జతపరుచుము.

i) అల్పకోణం a) 90° కన్నా ఎక్కువ 180° కన్నా తక్కువ
ii) అధిక కోణం b) 180° కన్నా ఎక్కువ 360° కన్నా తక్కువ
iii) సరళకోణం c) 180°
iv) పరావర్తనకోణం d) 90° కన్నా తక్కువ

పై వానిని జతపరచడంలో క్రింది ఏది సరైనది ?
A) i → a, ii → c, iii → b, iv → d
B) i = c, ii → b, iii → a, iv → d
C) i → d, ii → a, iii → c, iv → b
D) i → b, ii → c, iii → d, iv → a
జవాబు :
C) i → d, ii → a, iii → c, iv → b

ప్రశ్న9.
క్రింది వానిలో ఏది ఒక పరావర్తన కోణము ?
A) 180°
B) 270°
C) 90°
D) 120°
జవాబు :
B) 270°

ప్రశ్న18.
జ్యా మితి పెట్టెలోని కింది ఏ పరికరాన్ని నీవు కోణాలను కొలుచుటకు ఉపయోగిస్తావు ?
A) విభాగిని
B) స్కేలు
C) A మరియు B
D) కోణమానిని
జవాబు :
D) కోణమానిని

ప్రశ్న19.
క్రింది ఏ ఆంగ్ల అక్షరం లంబకోణాన్ని కలిగి లేదు ?
A) E
B) H
C) T
D) W
జవాబు :
D) W

క్రింది ఖాళీలను పూరించండి.

ప్రశ్న1.
రేఖాఖండానికి గల అంత్య బిందువుల సంఖ్య _____________
జవాబు :
2

 

ప్రశ్న2.
ఒకే సమతలంలోని రెండు రేఖలకు ఒకే ఒక ఉమ్మడి బిందువు ఉంటే వాటిని _____________ అంటారు.
జవాబు :
ఖండనరేఖలు

ప్రశ్న3.
లంబకోణము విలువ _____________
జవాబు :
90°

ప్రశ్న4.
180° గల కోణాన్ని _____________ కోణం అంటారు.
జవాబు :
సరళ

ప్రశ్న5.
రెండు కన్నా ఎక్కువ రేఖలు ఒకే బిందువు వద్ద ఖండించు కొంటే ఆ రేఖలను _____________ అంటారు.
జవాబు :
మిళితరేఖలు

ప్రశ్న6.
పరిపూర్ణ (సంపూర్ణ) విలువ _____________
జవాబు :
360°

ప్రశ్న7.
180° కన్నా ఎక్కువ 360° కన్నా తక్కువ గల కోణాన్ని _____________ కోణం అంటారు.
జవాబు :
అధికతర లేదా పరావర్తన

ప్రశ్న8.
లంబరేఖలను సూచించు గుర్తు _____________
జవాబు :

క్రింది వానిని జతపరుచుము.

ప్రశ్న1.

జవాబు :
i – c;
ii – d;
iii – a;
iv – e

 

ప్రశ్న2.

i) అల్పకోణము a) 210°
ii) లంబకోణము b) 60°
iii) సరళకోణము c) 90°
iv) పరావర్తనకోణము d) 180°
e) 360°

జవాబు :

i) అల్పకోణము b) 60°
ii) లంబకోణము c) 90°
iii) సరళకోణము d) 180°
iv) పరావర్తనకోణము a) 210°

ప్రశ్న3.
క్రింది గుర్తులను వాని పటాలకు జతపరచుము.

జవాబు :
i → a; ii → d; iii → b; iv → c

The Complete Educational Website

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *