AP 6th Class Science Bits Chapter 3 జంతువులు – ఆహారం with Answers
AP 6th Class Science Bits Chapter 3 జంతువులు – ఆహారం with Answers
AP 6th Class Science Bits Chapter 3 జంతువులు – ఆహారం with Answers
I. బహుళైచ్ఛిక ప్రశ్నలు
కింది వాటికి సరియైన జవాబులు గుర్తించండి.
1. క్రిందివానిలో ఉత్పత్తిదారును గుర్తించండి.
A) నక్క
B) జింక
C) ఆకుపచ్చని మొక్క
D) పులి
జవాబు:
C) ఆకుపచ్చని మొక్క
2. క్రిందివానిలో ద్వితీయ వినియోగదారుని గుర్తించండి.
A) గేదె
B) జింక
C) కుందేలు
D) తోడేలు
జవాబు:
D) తోడేలు
3. క్రిందివానిలో ప్రాథమిక వినియోగదారుని గుర్తించండి.
A) సింహం
B) ఆవు
C) చేప
D) కొంగ
జవాబు:
B) ఆవు
4. క్రిందివానిలో తృతీయ వినియోగదారుని గుర్తించండి.
A) గొర్రెలు
B) మేక
C) ఉడుత
D) సింహం
జవాబు:
D) సింహం
5. క్రిందివానిలో విచ్ఛిన్నకారిని గుర్తించండి.
A) ఎద్దు
B) కుందేలు
C) ఎలుక
D) బాక్టీరియా
జవాబు:
D) బాక్టీరియా
6. కింది వాటిలో ఏది నెమరువేయు జీవి?
A) ఎలుక
B) ఆవు
C) పిల్లి
D) కుక్క
జవాబు:
B) ఆవు
7. సహజ పారిశుద్ధ్య కార్మికులను కనుగొనండి.
A) జింక
B) పాము
C) కాకి
D) కుక్క
జవాబు:
C) కాకి
8. పదునైన పంజాలు దేనిలో ఉన్నాయి?
A) కాకి
B) కొంగ
C) కోడి
D) రాబందులు
జవాబు:
D) రాబందులు
9. రాత్రిపూట చరించే జంతువును ఎంచుకోండి.
A) గొర్రె
B) గబ్బిలము
C) మేక
D) ఆవు
జవాబు:
B) గబ్బిలము
10. కింది వాటిలో పెంపుడు జంతువు ఏది?
A) కుక్క
B) పులి
C) సింహం
D) నక్క
జవాబు:
A) కుక్క
11. కింది వాటిలో ఏది ఫలాహార జంతువు?
A) పిల్లి
B) తోడేలు
C) కుక్క
D) ఏనుగు
జవాబు:
D) ఏనుగు
12. ఆహారాన్ని గ్రహించడానికి దృష్టిని ఉపయోగించే జంతువుకు ఉదాహరణ ఇవ్వండి.
A) గబ్బిలం
B) కుక్క
C) గ్రద్ద
D) ఏనుగు
జవాబు:
C) గ్రద్ద
13. రుచి ద్వారా ఆహారాన్ని గ్రహించే జంతువులు ఏమిటి?
A) కీటకాలు
B) చేపలు
C) పక్షులు
D) సరీసృపాలు
జవాబు:
D) సరీసృపాలు
14. ఏ జీవి కీటకాల ద్వారా- నీటిలో ఉత్పత్తి అయ్యే అలలను గుర్తించగలదు?
A) కప్పలు
B) తిమింగలాలు
C) పాండ్ స్కేటర్లు
D) చేపలు
జవాబు:
C) పాండ్ స్కేటర్లు
15. తేనెను తినే పక్షి
A) హమ్మింగ్ పక్షి
B) రాబందు
C) చిలుక
D) గ్రద్ద
జవాబు:
A) హమ్మింగ్ పక్షి
16. ఆహారం కోసం మొక్కలపై మాత్రమే ఆధారపడే జంతువులను ఏమంటారు?
A) మాంసాహారులు
B) శాకాహారులు
C) ఉభయాహారులు
D) ఉత్పత్తిదారులు
జవాబు:
B) శాకాహారులు
17. ఏ జీవులు పశువుల రక్తాన్ని పీలుస్తాయి?
A) సాలె పురుగు
B) బల్లులు
C) జలగ
D) వానపాములు
జవాబు:
C) జలగ
18. ఏ పక్షికి పొడవైన మరియు బలమైన ముక్కు ఉంది?
A) వడ్రంగి పిట్ట
B) చిలుక
C) గ్రద్ద
D) కాకి
జవాబు:
A) వడ్రంగి పిట్ట
19. బాతులు ఆహారం కోసం దంతాలను ఎలా ఉపయోగిస్తాయి?
A) పీల్చటం
B) రుబ్బటం
C) వడపోయటం
D) చూర్ణం చేయటం
జవాబు:
C) వడపోయటం
20. ఏ పక్షి మాంసాన్ని చీల్చడానికి పదునైన గోర్లు మరియు బలమైన ముక్కును ఉపయోగిస్తుంది?
A) వడ్రంగి పిట్ట
B) చిలుక
C) రాబందు
D) బాతు
జవాబు:
C) రాబందు
21. కింది వాటిలో భిన్నమైన దానిని గుర్తించండి.
A) ఆవు
B) పులి
C) గేదె
D) ఒంటె
జవాబు:
B) పులి
22. ఇతర జంతువులను ఆహారం కోసం వేటాడే జంతువును గుర్తించండి.
A) ఆవు
B) గేదె
C) ఒంటె
D) తోడేలు
జవాబు:
D) తోడేలు
23. పర్యావరణ వ్యవస్థలో ఆహార గొలుసు ఎల్లప్పుడూ దేవితో మొదలవుతుంది ?
A) ఉత్పత్తిదారులు
B) ప్రాథమిక వినియోగదారులు
C) ద్వితీయ వినియోగదారులు
D) విచ్ఛిన్నకారులు
జవాబు:
A) ఉత్పత్తిదారులు
24. విచ్చిన్న కారుల యొక్క ఇతర పేర్లు
A) ఉత్పత్తిదారులు
B) రీసైక్లర్లు
C) వినియోగదారులు
D) శాకాహారులు
జవాబు:
B) రీసైక్లర్లు
25. తేనె కోసం చీమలు దేనిని పెంచుతాయి?
A) దోమలు
B) పురుగులు
C) అఫిడ్స్
D) సాలెపురుగులు
జవాబు:
C) అఫిడ్స్
26. ఇచ్చిన ఆహార గొలుసులో X ని పూరించండి.
మొక్కలు→ కుందేలు→ X→ సింహం
A) ఎలుక
B) పాము
C) మేక
D) అడవి పిల్లి
జవాబు:
D) అడవి పిల్లి
27. కింది ఆహార గొలుసును పూర్తి చేయండి.
ధాన్యాలు→ ఎలుక→ పిల్లి ……→ సింహం
A) జింక
B) నక్క
C) కుందేలు
D) ఆవు
జవాబు:
B) నక్క
II. ఖాళీలను పూరించుట కింది ఖాళీలను పూరింపుము.
1. ఆహారం కోసం మొక్కలు మరియు జంతువులపై ఆధారపడే జంతువులను …………. అంటారు.
2. ఆహారం కోసం మొక్కలపై మాత్రమే ఆధారపడే జంతువులను ………….అంటారు.
3. ఆహారం కోసం జంతువులపై మాత్రమే ఆధారపడే జంతువులను …………. అంటారు.
4. పండ్లు, కూరగాయల వేర్లు వంటి రసమైన పండ్లను ఎక్కువగా తినే జంతువులను …….. అంటారు.
5. కుక్కలు ఆహారం పొందడానికి …………. లక్షణాన్ని ఉపయోగిస్తాయి.
6. కప్ప దాని ………….. తో ఆహారాన్ని బంధించి మింగేస్తుంది.
7. కోడి …………కొరకు నేలను పాదాలతో గోకడంచేస్తుంది.
8. …………. కు నీటిలో చేపలను పట్టుకోవడానికి పొడవైన ముక్కు ఉంది.
9. చిలుక పండ్లను తింటుంది మరియు గింజలను ……………వంటి ముక్కుతో తింటుంది.
10. ఒంటె, ఆవు, గేదె మొదలైన వాటిని …………. అంటారు.
11. ……………… తమ సొంత ఆహారాన్ని తయారు చేసుకుంటాయి.
12. మొక్కలను లేదా జంతువులను తినే జీవిని ఆహార గొలుసులో …………. అంటాము.
13. ………ఆధారంగా వివిధ రకాల వినియోగదారులు ఉన్నారు.
14. ఉత్పత్తిదారులు ఆహారం ఇచ్చే జీవులను ………… అంటారు.
15. ప్రాథమిక వినియోగదారులు ఆహారం ఇచ్చే జీవులను …………… అంటారు.
16. …………………. ఆహారం ఇచ్చే జీవులను తృతీయ వినియోగదారులు అంటారు.
17. …………..లో నివసించే జీవుల మధ్య గొలుసు సంబంధం వంటిది ఉంది.
18. ………….. ఉత్పత్తిదారులు మరియు వినియోగదారుల మధ్య సంబంధాన్ని చూపిస్తుంది.
19. జలగ దాని ఆహారాన్ని ……….. ద్వారా గ్రహిస్తుంది.
20. …………. లో దంతాలు నీటి నుండి ఆహారాన్ని పొందడానికి వడపోత సాధనముగా పనిచేస్తాయి.
21. …………. పదునైన దంతాలు కల్గి మాంసాన్ని చీల్చే జంతువులు.
22. కొక్కెము వంటి ముక్కు గల ఫలాహార పక్షి ……………
23. ఒక కప్ప దాని జిగట కలిగిన …………. క్రిమి వైపు విసురుతుంది.
24. ………….. పక్షికి పొడవైన మరియు బలమైన ముక్కు ఉంటుంది.
25. …………. జంతువు తన , నాలుకతో ఆహారాన్ని లాక్కుంటుంది.
26. కొంగ ……. ద్వారా నీటిలో చేపలను పట్టుకొనును.
27. రాబందులు జంతువుల మాంసాన్ని చీల్చటానికి ………….. ముక్కులను కలిగి ఉంటాయి.
28. బాక్టీరియా మరియు శిలీంధ్రాలు లు …………..
29. ఉత్పత్తిదారులు, వినియోగదారులు మరియు నేల మధ్య పదార్థాల చక్రీయానికి …………. సహాయపడతాయి.
30. ఒకదానితో ఒకటి అనుసంధానించబడిన అనేక ఆహార గొలుసులతో చేయబడింది ………..
31. చీమల సమూహములో ……… చీమలు ఇతరులకు ఆహారం సేకరించి నిల్వ చేస్తాయి.
32. సహజ పారిశుద్ధ్య కార్మికులకు ఉదాహరణ ………..
జవాబు:
- సర్వ ఆహారులు
- శాకాహారులు
- మాంసాహారులు
- ఫలాహార జంతువులు
- వాసన చూడటం అనే
- నాలుక
- పురుగులు
- కొంగ
- కొక్కెము
- నెమరు వేయు జంతువులు
- ఉత్పత్తిదారులు
- వినియోగదారులు
- ఆహారపు అలవాట్లు
- ప్రాథమిక వినియోగదారులు
- ద్వితీయ వినియోగదారులు
- ద్వితీయ వినియోగదారులు
- పర్యావరణ వ్యవస్థ
- ఆహారపు గొలుసు
- సక్కర్స్
- బాతు
- పులి / సింహం
- చిలుక
- నాలుక
- వడ్రంగి పిట్ట
- కుక్క
- పొడవైన ముక్కు
- బలమైన కొక్కెము వంటి
- విచ్ఛిన్నకారులు
- విచ్ఛిన్నకారులు
- ఆహార జాలకము
- వర్కర్
- కాకి
III. జతపరుచుట
కింది వానిని జతపరుచుము.
1.
Group – A | Group – B |
ఎ) రుచి | 1. రాబందు |
బి) వినికిడి | 2. కుక్క |
సి) వాసన | 3. పాండ్ స్కేటర్ |
డి) దృష్టి | 4. గబ్బిలము |
ఇ) స్పర్శ | 5. కొన్ని సరీసృపాలు |
జవాబు:
Group – A | Group – B |
ఎ) రుచి | 5. కొన్ని సరీసృపాలు |
బి) వినికిడి | 4. గబ్బిలము |
సి) వాసన | 2. కుక్క |
డి) దృష్టి | 1. రాబందు |
ఇ) స్పర్శ | 3. పాండ్ స్కేటర్ |
2.
Group – A | Group – B |
ఎ) వడ్రంగి పిట్ట | 1. బలమైన కొక్కెము వంటి ముక్కు. |
బి) కొంగ | 2. కొక్కెము ముక్కు |
సి) రాబందు | 3. పొడవైన ముక్కు |
డి) చిలుక | 4. పొడవైన సన్నని ముక్కు |
ఇ) హమ్మింగ్ పక్షి | 5. పొడవైన మరియు బలమైన ముక్కు |
జవాబు:
Group – A | Group – B |
ఎ) వడ్రంగి పిట్ట | 5. పొడవైన మరియు బలమైన ముక్కు |
బి) కొంగ | 3. పొడవైన ముక్కు |
సి) రాబందు | 1. బలమైన కొక్కెము వంటి ముక్కు. |
డి) చిలుక | 2. కొక్కెము ముక్కు |
ఇ) హమ్మింగ్ పక్షి | 4. పొడవైన సన్నని ముక్కు |
3.
Group – A | Group – B |
ఎ) చీమలు మరియు చెదలు | 1. హమ్మింగ్ పక్షి |
బి) పండ్లు మరియు కాయలు | 2. రాబందు |
సి) జంతువుల మాంసం | 3. కొంగ |
డి) చేప | 4. వడ్రంగి పిట్ట |
ఇ) తేనె | 5. చిలుక |
జవాబు:
Group – A | Group – B |
ఎ) చీమలు మరియు చెదలు | 4. వడ్రంగి పిట్ట |
బి) పండ్లు మరియు కాయలు | 5. చిలుక |
సి) జంతువుల మాంసం | 2. రాబందు |
డి) చేప | 3. కొంగ |
ఇ) తేనె | 1. హమ్మింగ్ పక్షి |
4.
Group – A | Group – B |
ఎ) కప్ప | 1. సహజ పారిశుద్ధ్య కార్మికులు |
బి) ఆవు | 2. సక్కర్స్ |
సి) కాకి | 3. అంటుకునే నాలుక |
డి) జలగ | 4. వేట జంతువు |
ఇ) సింహం | 5. నెమరు |
జవాబు:
Group – A | Group – B |
ఎ) కప్ప | 3. అంటుకునే నాలుక |
బి) ఆవు | 5. నెమరు |
సి) కాకి | 1. సహజ పారిశుద్ధ్య కార్మికులు |
డి) జలగ | 2. సక్కర్స్ |
ఇ) సింహం | 4. వేట జంతువు |
5.
Group – A | Group – B |
ఎ) ఉత్పత్తిదారులు | 1. కప్ప |
బి) ప్రాథమిక వినియోగదారులు | 2. మొక్కలు |
సి) ద్వితీయ వినియోగదారులు | 3. కాకి |
డి) తృతీయ వినియోగదారులు | 4. బాక్టీరియా |
ఇ) విచ్ఛిన్నకారులు | 5. మిడత |
జవాబు:
Group – A | Group – B |
ఎ) ఉత్పత్తిదారులు | 2. మొక్కలు |
బి) ప్రాథమిక వినియోగదారులు | 5. మిడత |
సి) ద్వితీయ వినియోగదారులు | 1. కప్ప |
డి) తృతీయ వినియోగదారులు | 3. కాకి |
ఇ) విచ్ఛిన్నకారులు | 4. బాక్టీరియా |