AP 6th Class Science Bits Chapter 4 నీరు with Answers
AP 6th Class Science Bits Chapter 4 నీరు with Answers
AP 6th Class Science Bits Chapter 4 నీరు with Answers
I. బహుళైచ్ఛిక ప్రశ్నలు
కింది వాటికి సరియైన జవాబులు గుర్తించండి.
1. మానవ శరీరానికి …. నీరు అవసరం.
A) 1-2 లీటర్లు
B) 2-3 లీటర్లు
C) 4-5 లీటర్లు
D) 5-6 లీటర్లు
జవాబు:
B) 2-3 లీటర్లు
2. నీటి ఘన పరిమాణం ప్రమాణం
A) మీటర్లు
B) సెంటీమీటర్లు
C) లీటర్లు
D) చదరపు మీటర్లు
జవాబు:
C) లీటర్లు
3. కింది వాటిలో ఏది వ్యవసాయ నీటి వినియోగం కింద వస్తుంది?
A) విత్తనాలు మొలకెత్తటం
B) స్నానం
C) ఇల్లు శుభ్రపరచడం
D) పాత్రలు కడగటం
జవాబు:
A) విత్తనాలు మొలకెత్తటం
4. కింది వాటిలో ఏది స్థిరమైన నీటి వనరు కాదు?
A) చెరువు
B) నది
C) ట్యాంక్
D) బావి
జవాబు:
B) నది
5. మన శరీరంలో నీటి బరువు ……….
A) 50%
B) 60%
C) 70%
D) 80%
జవాబు:
C) 70%
6. కింది వాటిలో జ్యూసి పండ్లను గుర్తించండి.
A) దోసకాయ
B) పొట్లకాయ
C) టొమాటో
D) పుచ్చకాయ
జవాబు:
D) పుచ్చకాయ
7. భూమి యొక్క ఉపరితలం ఎంత నీటితో ఆక్రమించబడింది?
A) 3/4
B) 1/2
C) 5/6
D) 4/5
జవాబు:
A) 3/4
8. నీరు దేని వలన లభిస్తుంది?
A) భూగర్భ జలాలు
B) వర్షాలు
C) నదులు
D) సముద్రాలు
జవాబు:
B) వర్షాలు
9. నీటి ఘన స్థితి
A) మహాసముద్రాలు
B) నదులు
C) మంచు
D) పర్వతాలు
జవాబు:
C) మంచు
10. కింది వాటిలో ఏది నీటిని మంచుగా మారుస్తుంది?
A) ఘనీభవనం
B) అవపాతం
C) బాష్పీభవనం
D) బాష్పోత్సేకము
జవాబు:
A) ఘనీభవనం
11. నీటి ద్రవ రూపం ………..
A) హిమానీనదాలు
B) ధ్రువ ప్రాంతాలు
C) మంచుతో కప్పబడిన పర్వతాలు
D) నదులు
జవాబు:
D) నదులు
12. ఏ కూరగాయలో చాలా నీరు ఉంటుంది?
A) బెండకాయ
B) దోసకాయ
C) వంకాయ
D) గుమ్మడికాయ
జవాబు:
B) దోసకాయ
13. ఆకాశంలో మేఘాలు ఏర్పడే ప్రక్రియ
A) స్వేదనం
B) అవపాతం
C) బాష్పీభవనం
D) ఘనీభవనం
జవాబు:
C) బాష్పీభవనం
14. ఉదయం వేళలో గడ్డి ఆకులపై నీటి చుక్కలకు కారణం
A) సాంద్రీకరణం
B) బాష్పీభవనం
C) వర్షపాతం
D) గ్లోబల్ వార్మింగ్
జవాబు:
A) సాంద్రీకరణం
15. వర్షం, మంచు, స్ట్రీట్ లేదా ఆకాశం నుండి వడగళ్ళు పడే వాతావరణ పరిస్థితిని …. అంటారు.
A) సాంద్రీకరణం
B) బాష్పీభవనం
C) బాష్పోత్సేకము
D) అవపాతం
జవాబు:
D) అవపాతం
16. నీటి చక్రం కింది వేని మధ్య తిరుగుతుంది?
A) భూమి
B) మహాసముద్రాలు
C) వాతావరణం
D) పైవన్నీ
జవాబు:
D) పైవన్నీ
17. కిందివాటిలో ఏది నీటి చక్రానికి భంగం కలిగిస్తుంది?
A) అటవీ నిర్మూలన
B) కాలుష్యం
C) గ్లోబల్ వార్మింగ్
D) పైవన్నీ
జవాబు:
D) పైవన్నీ
18. అటవీ నిర్మూలన వలన ఏమి తగ్గుతుంది?
A) నేల కోత
B) కరవు
C) బాష్పోత్సేకము
D) అవపాతం
జవాబు:
C) బాష్పోత్సేకము
19. కింది వాటిలో ఏది నీటి సంబంధిత విపత్తు కాదు?
A) వరదలు
B) భూకంపం
C) సునామి
D) కరవు
జవాబు:
B) భూకంపం
20. నదులలో నీటి మట్టం పెరుగుదలకు కారణం
A) వరద
B) కరవు
C) నీటి కొరత
D) ఎండిన భూమి
జవాబు:
A) వరద
21. కింది వాటిలో కరవు పీడిత జిల్లా
A) గుంటూరు
B) కృష్ణ
C) ప్రకాశం
D) చిత్తూరు
జవాబు:
C) ప్రకాశం
22. కింది వాటిలో నీటి నిర్వహణ పద్దతులు ఏవి?
A) బిందు సేద్యం మరియు స్ప్రింక్లర్
B) నీటి కాలుష్యం
C) రసాయన ఎరువులు వాడటం
D) బోర్ బావులను తవ్వడం
జవాబు:
A) బిందు సేద్యం మరియు స్ప్రింక్లర్
II. ఖాళీలను పూరించుట
కింది ఖాళీలను పూరింపుము.
1. ఆహారం జీర్ణం కావడానికి మరియు శరీరం నుండి ……………………. తొలగించడానికి నీరు సహాయపడుతుంది. అంటారు.
2. నీరు మరియు ఇతర ద్రవాలను …………….. లో కొలుస్తారు.
3. ఎక్కువ నీరు ఉన్న పండ్లను …………… అంటారు.
4. …………… జ్యూసి కూరగాయలకు ఉదాహరణ.
5. భూమిపై లభించే నీటిలో, మంచినీరు ….. మాత్రమే.
6. మన దైనందిన ప్రయోజనాలకు ఉపయోగించే నీటిని …………… అంటారు.
7. నీటిని ఆవిరిగా మార్చే ప్రక్రియను …………….. అంటారు.
8. నీటి చక్రాన్ని ………… అని కూడా అంటారు.
9. ఎక్కువకాలం పాటు వర్షం లేకపోవటం ఆ ప్రాంతంలో ………. కు దారితీస్తుంది.
10. అధిక వర్షాలు …………… ను కలిగిస్తాయి.
11. …………… నీరు, నీటి ఆవిరిగా మారుతుంది.
12. నీరు ………… శోషించి బాష్పీభవనం ద్వారా వాతావరణాన్ని ప్రభావితం చేస్తుంది.
13. నీటి ఆవిరిని నీటిగా మార్చే ప్రక్రియను ………………. అంటారు.
14. ………….. వాతావరణం పైపొరలలో మేఘాలను చల్లబరుస్తుంది.
15. వర్షంతో పాటు పడే మంచు ముక్కలు ………….
16. నైరుతి రుతుపవనాల కాలం ……………..
17. ఈశాన్య రుతుపవనాల కాలం ……………
18. భూమి ఉపరితలం మరియు గాలి మధ్య నీటి
ప్రసరణను ……….. అంటారు.
19. NDRF ని విస్తరించండి …………..
20. SDRF ని విస్తరించండి …………..
21. వర్షపు నీటిని ప్రత్యక్షంగా సేకరించడం మరియు వాడటాన్ని …………… అంటారు.
22. ఇళ్ళు మరియు భవనాల పైకప్పు భాగాల నుండి నీటిని సేకరించడం ……………
23. వ్యవసాయంలో ఉపయోగించే ఉత్తమ నీటిపారుదల పద్దతి ……………..
24. నీటి కొరతను నివారించే ఏకైక పద్ధతి ……………
25. ఎక్కువ కాలం పాటు తక్కువ వర్షపాతం వలన …………… వస్తుంది.
జవాబు:
- విష పదార్థాలు (వ్యర్థ పదార్థాలు ).
- లీటర్లలో
- జ్యూసి పండ్లు
- దోసకాయ
- 3%
- మంచి నీరు
- బాష్పీభవనం
- హైడ్రోలాజికల్ చక్రం (జల చక్రం)
- కరవు
- వరదలు
- వేడి
- వేడిని
- సాంద్రీకరణ
- చల్లని గాలి
- వడగళ్ళు
- జూన్-సెప్టెంబర్
- నవంబర్ – డిసెంబర్
- నీటి చక్రం
- జాతీయ విపత్తు సహాయక దళం
- రాష్ట్ర విపత్తు సహాయక’ దళం
- వర్షపు నీటి సేకరణ
- పైకప్పు నీటి సేకరణ
- బిందు సేద్యం / స్ప్రింక్లర్ ఇరిగేషన్
- నీటి సంరక్షణ
- కరవు
III. జతపరుచుట
కింది వానిని జతపరుచుము.
1.
Group – A | Group – B |
ఎ) భూమిపై నీరు | 1. 70% |
బి) మంచినీరు | 2. రుతుపవనాలు |
సి) మన శరీరంలో నీరు | 3. 75% |
డి) వడగళ్ళు రాళ్ళు | 4.3% |
ఇ) వర్షాలు | 5. అవపాతం |
జవాబు:
Group – A | Group – B |
ఎ) భూమిపై నీరు | 3. 75% |
బి) మంచినీరు | 4.3% |
సి) మన శరీరంలో నీరు | 1. 70% |
డి) వడగళ్ళు రాళ్ళు | 5. అవపాతం |
ఇ) వర్షాలు | 2. రుతుపవనాలు |
2.
Group – A | Group – B |
ఎ) ఘన రూపం | 1. నైరుతి ఋతుపవనాలు |
బి) ద్రవ రూపం | 2. మంచు |
సి) వాయు రూపం | 3. ఈశాన్య రుతుపవనాలు |
డి) జూన్-సెప్టెంబర్ | 4. నీరు |
ఇ) నవంబర్-డిసెంబర్ | 5. నీటి ఆవిరి |
జవాబు:
Group – A | Group – B |
ఎ) ఘన రూపం | 2. మంచు |
బి) ద్రవ రూపం | 4. నీరు |
సి) వాయు రూపం | 5. నీటి ఆవిరి |
డి) జూన్-సెప్టెంబర్ | 1. నైరుతి ఋతుపవనాలు |
ఇ) నవంబర్-డిసెంబర్ | 3. ఈశాన్య రుతుపవనాలు |
3.
Group – A | Group – B |
ఎ) సాంద్రీకరణ | 1. మొక్కల నుండి నీరు ఆవిరి కావటం |
బి) బాష్పీభవనం | 2. వాయువు ద్రవంగా మారుతుంది |
సి) బాష్పోత్సేకం | 3. ద్రవము వాయువుగా మారటం |
డి) వర్షం | 4. నీరు భూమిలోకి ఇంకటం |
ఇ) భూగర్భజలం | 5. నీరు భూమిపై పడటం |
జవాబు:
Group – A | Group – B |
ఎ) సాంద్రీకరణ | 2. వాయువు ద్రవంగా మారుతుంది |
బి) బాష్పీభవనం | 3. ద్రవము వాయువుగా మారటం |
సి) బాష్పోత్సేకం | 1. మొక్కల నుండి నీరు ఆవిరి కావటం |
డి) వర్షం | 5. నీరు భూమిపై పడటం |
ఇ) భూగర్భజలం | 4. నీరు భూమిలోకి ఇంకటం |