AP 6 Science

AP 6th Class Science Important Questions Chapter 4 నీరు

AP 6th Class Science Important Questions Chapter 4 నీరు

AP Board 6th Class Science 4th Lesson Important Questions and Answers నీరు

6th Class Science 4th Lesson 2 Marks Important Questions and Answers

ప్రశ్న 1.
మనకు ఎక్కడ నుండి నీరు వస్తుంది?
జవాబు:
మనకు నది, చెరువు, సరస్సు, కాలువ మరియు బోర్ బావుల నుండి నీరు లభిస్తుంది.

ప్రశ్న 2.
మనకు నీరు ఎందుకు అవసరం?
జవాబు:
ఆహారం వండటం, బట్టలు ఉతకడం, పాత్రలు శుభ్రపరచడం, స్నానం చేయడం వంటి రోజువారీ కార్యకలాపాలను నిర్వహించడానికి మనకు నీరు అవసరం. దీనితో పాటు వ్యవసాయానికి పరిశ్రమకు కూడా నీరు అవసరం.

ప్రశ్న 3.
మేఘాలు ఏర్పడటానికి కారణమైన రెండు ప్రక్రియలకు పేరు పెట్టండి.
జవాబు:
మేఘాలు ఏర్పడటానికి రెండు ప్రక్రియలు కారణమవుతాయి.

  1. బాష్పీభవనం
  2. సాంద్రీకరణ.

ప్రశ్న 4.
నీటికి సంబంధించిన ఏవైనా ప్రకృతి వైపరీత్యాలను రాయండి.
జవాబు:
1. వరదలు 2. సునామి 3. కరవు 4.తుఫాన్.

ప్రశ్న 5.
ఎక్కువ నీరు ఉండే పండ్లు, కూరగాయలకు కొన్ని ఉదాహరణలు ఇవ్వండి.
జవాబు:
కూరగాయలు :
దోసకాయ, టమోటా, పొట్లకాయ, సొరకాయ. పండ్లు : పుచ్చకాయ, నిమ్మ, నారింజ, కస్తూరి పుచ్చకాయ, మామిడి.

 

ప్రశ్న 6.
గ్రామాల్లోని ప్రధాన నీటి వనరులు ఏమిటి?
జవాబు:
గ్రామాల్లో బావులు, కాలువలు, కొలను, చెరువులు, నదులు మొదలైనవి ప్రధాన నీటి వనరులు.

ప్రశ్న 7.
జ్యూసి పండ్లు అంటే ఏమిటి? ఉదాహరణలు ఇవ్వండి.
జవాబు:
ఎక్కువ నీరు ఉన్న పండ్లను జ్యూసి పండ్లు అంటారు.
ఉదా : పుచ్చకాయ, ద్రాక్ష, నారింజ.

ప్రశ్న 8.
నీటి రూపాలు ఏమిటి?
జవాబు:
ప్రకృతిలో నీరు మూడు రూపాలలో లభిస్తుంది. అవి మంచు (ఘన రూపం), నీరు (ద్రవ రూపం) మరియు నీటి ఆవిరి (వాయు రూపం).

ప్రశ్న 9.
బాష్పీభవనం అంటే ఏమిటి?
జవాబు:
నీరు, నీటి ఆవిరిగా మారే ప్రక్రియను బాష్పీభవనం అంటారు.

ప్రశ్న 10.
మేఘం అంటే ఏమిటి?
జవాబు:
బాష్పీభవన ప్రక్రియ ద్వారా గాలిలోకి ప్రవేశించే నీటి ఆవిరి ఆకాశంలో మేఘాలను ఏర్పరుస్తుంది.

ప్రశ్న 11.
సాంద్రీకరణను నిర్వచించండి.
జవాబు:
నీటి ఆవిరిని నీటిగా మార్చే ప్రక్రియను సాంద్రీకరణ అంటారు.

ప్రశ్న 12.
కరవు ఎప్పుడు వస్తుంది?
జవాబు:
ఎక్కువ కాలం వర్షం లేకపోతే, అది కరవుకు కారణం కావచ్చు.

 

ప్రశ్న 13.
వడగళ్ళు అంటే ఏమిటి?
జవాబు:
వాతావరణం బాగా చల్లబడినప్పుడు నీరు మంచుగా మారి గట్టి రాళ్ళ వలె భూమిపై పడతాయి. వీటినే వడగళ్ళు అని పిలుస్తారు.

ప్రశ్న 14.
‘అవపాతం’ అనే పదం ద్వారా మీరు ఏమి అర్థం చేసుకుంటారు?
జవాబు:
ఆకాశం నుండి వర్షం, మంచు లేదా వడగళ్ళు పడే వాతావరణ పరిస్థితిని అవపాతం అంటారు.

ప్రశ్న 15.
జల చక్రాన్ని నిర్వచించండి.
జవాబు:
భూమి ఉపరితలం మరియు గాలి మధ్య నీటి ప్రసరణను హైడ్రోలాజికల్ సైకిల్ లేదా నీటి చక్రం లేదా జలచక్రం అంటారు.

ప్రశ్న 16.
నీటి చక్రానికి భంగం కలిగించే ప్రధాన కారణాలు ఏమిటి?
జవాబు:
అటవీ నిర్మూలన మరియు కాలుష్యం నీటి చక్రానికి భంగం కలిగించే ప్రధాన కారణాలు.

ప్రశ్న 17.
తక్కువ వర్షపాతం లేదా ఎక్కువ వర్షపాతం ఉంటే ఏమి జరుగుతుంది?
జవాబు:
తక్కువ వర్షపాతం ఉంటే దాని ఫలితాలు కరవు లేదా నీటి కొరత మరియు ఎక్కువ వర్షపాతం వల్ల వరదలు వస్తాయి.

ప్రశ్న 18.
ఆంధ్రప్రదేశ్ లో కరవు పీడిత జిల్లాలను పేర్కొనండి.
జవాబు:
అనంతపూర్, కడప మరియు ప్రకాశం ఆంధ్రప్రదేశ్ లో కరవు పీడిత జిల్లాలు.

ప్రశ్న 19.
నీరు సాంద్రీకరణ చెంది దేనిని ఏర్పరుస్తుంది?
జవాబు:
మంచు.

 

ప్రశ్న 20.
ద్రవాల ఘన పరిమాణం యొక్క నిర్దిష్ట కొలత ఏమిటి?
జవాబు:
నీరు మరియు ఇతర ద్రవాలను లీటర్లలో కొలుస్తారు.

6th Class Science 4th Lesson 4 Marks Important Questions and Answers

ప్రశ్న 1.
బాష్పీభవనం అంటే ఏమిటి? మన జీవితంలో దాని ప్రాముఖ్యత ఏమిటి?
జవాబు:
బాష్పీభవనం అంటే ఉష్ణం వలన నీరు నీటి ఆవిరిగా మారటం. నీటి బాష్పీభవనం వలన వాతావరణములోకి తేమ చేరుతుంది. బాష్పీభవనం మేఘాల ఏర్పాటుకు సహాయపడుతుంది. బాష్పీభవనం చెమట ద్వారా మన శరీరాన్ని చల్లబరుస్తుంది.

ప్రశ్న 2.
మన దైనందిన జీవితంలో చూసే బాష్పీభవన సందర్బాలు రాయండి.
జవాబు:
మన దైనందిన జీవితంలో ఈ క్రింది సందర్భాలలో బాష్పీభవనాన్ని గమనించాము.

బట్టలు ఆరబెట్టినపుడు, టీ మరిగించినపుడు, తుడిచిన నేల ఆరినపుడు, సరస్సులు మరియు నదులు ఎండినపుడు, సముద్రం నుండి ఉప్పు తయారీలో, ధాన్యాలు మరియు చేపలను ఎండబెట్టినపుడు, మేఘాలు ఏర్పడినపుడు.

ప్రశ్న 3.
మన దైనందిన జీవితంలో నీటి ప్రాముఖ్యత ఏమిటి?
జవాబు:
ఉష్ణోగ్రత మరియు శారీరక పనితీరులను నిర్వహించడానికి మన శరీరానికి నీరు అవసరం. ఆహారం జీర్ణం కావడానికి నీరు సహాయపడుతుంది. శరీరం నుండి విషపదార్థాలు తొలగించడానికి నీరు సహాయపడుతుంది. ఇది చర్మ తేమను మెరుగుపరుస్తుంది.

ప్రశ్న 4.
మన శరీరంలో నీటి ప్రాధాన్యత ఏమిటి?
జవాబు:
మన శరీరం, శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడానికి, ఇతర శారీరక విధులు నిర్వహించడానికి నీటిని ఉపయోగించుకుంటుంది. సరైన శారీరక పనితీరు కోసం (ఆరోగ్యంగా ఉండటం కోసం) మానవ శరీరానికి రోజుకు 2-3 లీటర్ల నీరు అవసరం. ఆహారం జీర్ణం కావటానికి, శరీరం నుండి విష పదార్థాలను (వ్యర్థాలను) తొలగించడానికి నీరు ఎంతో సహాయపడుతుంది. మన పాఠశాలల్లో నీటి గంటలు (Water bell) ప్రవేశపెట్టడానికి ఇదే కారణం.

ప్రశ్న 5.
మూడు రూపాలలోకి నీరు పరస్పరం మారుతుందని మీరు ఎలా చెప్పగలరు?
జవాబు:
మంచు, నీరు మరియు నీటి ఆవిరి వంటి మూడు రూపాల్లో నీరు సహజంగా లభిస్తుంది. మంచును. వేడి చేసినప్పుడు అది నీరుగా మారుతుంది మరియు నీటిని వేడి చేస్తే అది నీటి ఆవిరిగా మారుతుంది. నీటి ఆవిరి చల్లబడితే అది నీరుగా మారుతుంది. నీరు మరింత చల్లబడితే, మనకు మంచు వస్తుంది. కాబట్టి, మూడు రకాలైన రూపాల్లో నీరు పరస్పరం మారుతుందని మనం చెప్పగలం.
AP 6th Class Science Important Questions Chapter 4 నీరు 1

ప్రశ్న 6.
బాష్పీభవనం ఎలా జరుగుతుందో వివరించండి.
జవాబు:
నీటిని నిదానంగా వేడి చేస్తే, దాని ఉష్ణోగ్రత పెరుగుతుంది. బాగా వేడెక్కిన నీరు మరుగుతుంది. మరిగిన నీరు నీటి ఆవిరిగా మారుతుంది. నీరు నీటి ఆవిరిగా మారే ఈ ప్రక్రియను బాష్పీభవనం అంటారు.

 

ప్రశ్న 7.
వర్షాలు మరియు మేఘాల మధ్య సంబంధం ఏమిటి?
జవాబు:
నీటి బాష్పీభవనం ద్వారా మేఘాలు ఏర్పడతాయి. ఆకాశంలో నీటి ఆవిరి పెరిగినప్పుడు అది మేఘాలను ఏర్పరుస్తుంది. చల్లటి గాలితో మేఘాలు చల్లబడతాయి. అప్పుడు మేఘాలలో ఉన్న నీరు ఘనీభవించి వర్షం వలె భూమిపై పడుతుంది.

ప్రశ్న 8.
అన్ని మేఘాలు ఎందుకు వర్షించలేవు?
జవాబు:
గాలిలో కదులుతూ మనకు అనేక మేఘాలు కనిపిస్తుంటాయి. అయినప్పటికి అన్నీ మేఘాలు వర్షించలేవు. మేఘం వర్షించాలంటే మేఘంలోని తేమ శాతం, వాతావరణ ఉష్ణోగ్రత, భౌగోళిక పరిస్థితులు వంటి కారకాలు ప్రభావం చూపుతాయి.

ప్రశ్న 9.
గడ్డి మరియు మొక్కల ఆకులపై చిన్న మంచు బిందువులు కనిపించడాన్ని మీరు గమనించి ఉండవచ్చు. ఆకులు మరియు గడ్డి మీద ఈ నీటి చుక్కలు ఎక్కడ నుండి వచ్చాయి?
జవాబు:
శీతాకాలంలో మొక్కల ఆకుల అంచుల వెంట నీటి బిందువులు కనిపిస్తాయి. బిందు స్రావం అనే ప్రక్రియ ద్వారా ఈ బిందువులు ఏర్పడతాయి. శీతల వాతావరణంలో మొక్కలోని అధిక నీరు ఇలా బయటకు పంపబడుతుంది.

ప్రశ్న 10.
మీ రోజువారీ జీవితంలో నీటి ఆవిరి నీరుగా మారడాన్ని మీరు గమనించారా? వాటిని జాబితా చేయండి.
జవాబు:
అవును. నీటి ఆవిరి నీరుగా క్రింది సందర్భంలో మారుతుంది.

శీతాకాలంలో ఉదయం వేళ మంచు పడటం. చల్లని శీతాకాలపు రోజులో కంటి అద్దాలు మంచుతో తడుస్తాయి. కూల్ డ్రింక్ లేదా ఐస్ క్రీం గాజు పాత్రల వెలుపలి వైపు నీటి చుక్కలు ఏర్పడటం. వండుతున్న ఆహార పాత్ర మూత నుండి నీటి చుక్కలు కారటం.

ప్రశ్న 11.
వర్షం పడే ముందే ఆకాశంలో మరియు వాతావరణంలో మీరు ఏ మార్పులను గమనిస్తారు?
జవాబు:
మేఘాలు ఏర్పడటం వల్ల వర్షానికి ముందు ఆకాశం నల్లగా మారుతుంది. వాతావరణం చాలా తేమగా మారుతుంది. తద్వారా మనకు ఉక్కపోసినట్లు అనిపిస్తుంది. ఆకాశం వర్షపు మేఘాలతో నిండిపోతుంది. పరిసరాలలో చల్లని గాలులు వీస్తాయి. కొన్ని సార్లు ఉరుములు, మెరుపులు సంభవించవచ్చు.

 

ప్రశ్న 12.
రుతుపవనాల రకాలు ఏమిటి?
జవాబు:
భారతదేశంలో రెండు రకాల రుతుపవనాలు ఉన్నాయి.

  1. నైరుతి రుతుపవనాలు
  2. ఈశాన్య రుతుపవనాలు.

1. నైరుతి రుతుపవనాలు :
జూన్ నుండి సెప్టెంబర్ వరకు మేఘాలు పశ్చిమ దిశ నుండి వీచే గాలులతో పాటు వస్తాయి. ఈ గాలులను నైరుతి రుతుపవనాలు అంటారు.

2. ఈశాన్య రుతుపవనాలు :
తూర్పు వైపు నుండి గాలులు వీచే దిశలో, మేఘాల కదలిక కారణంగా నవంబర్ మరియు డిసెంబర్ నెలల్లో వర్షాలు కురుస్తాయి. ఈ గాలులను ఈశాన్య రుతుపవనాలు అంటారు.

ప్రశ్న 13.
నీటి వనరులలో వర్షపు నీరు ఎలా పునరుద్ధరించబడుతుంది?
జవాబు:
వర్షం నుండి వచ్చే నీరు చిన్న ప్రవాహాలుగా మారుతుంది. ఈ చిన్న ప్రవాహాలు అన్నీ కలిసి పెద్ద ప్రవాహాలను ఏర్పర్చుతాయి. ఈ పెద్ద ప్రవాహాలు నదులలో కలుస్తాయి. నదులు, సముద్రాలు మరియు మహాసముద్రాలలోకి ప్రవహిస్తాయి. కొంత వర్షపు నీరు భూమిలోకి ప్రవేశించి భూగర్భ జలంగా మారుతుంది.

ప్రశ్న 14.
నీటి సంరక్షణపై నినాదాలు సిద్ధం చేయండి.
జవాబు:
నీరు సృష్టికర్త ఇచ్చిన బహుమతి. దాన్ని రక్షించండి!
భూమిని కాపాడండి – భవిష్యత్ ను బ్రతికించండి.
నీటిని కాపాడండి మరియు భూమిపై ప్రాణాన్ని రక్షించండి.
నీరు జీవితానికి ఆధారం – వర్షమే దానికి ఆధారం.

ప్రశ్న 15.
నీటి కొరతను నివారించడానికి మీరు ఏ జాగ్రత్తలు పాటిస్తున్నారు?
జవాబు:
నీటి వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పించటం. వారి జీవన విధానాలను మార్చడం. వ్యర్థ జలాన్ని రీసైకిల్ చేయటం. నీటి నిర్వహణ పద్ధతులను అనుసరించడం. నీటి పారుదల మరియు వ్యవసాయ పద్ధతులను మెరుగుపరచటం. వర్షపు నీటిని సేకరించటం. నీటి సంరక్షణ పద్ధతులను అనుసరించడం ద్వారా నీటి కొరతను నివారించవచ్చు.

ప్రశ్న 16.
ప్రకృతి విపత్తు పరిస్థితులలో ఏ విభాగాలు పనిచేస్తాయి?
జవాబు:
ప్రకృతి వైపరీత్య బాధితులకు జాతీయ విపత్తు సహాయక దళం, రాష్ట్ర విపత్తు సహాయక దళం, స్థానిక అగ్నిమాపక, ఆరోగ్యం, పోలీసు మరియు రెవెన్యూ విభాగాలు సహాయపడతాయి. ప్రకృతి విపత్తు యొక్క సహాయక చర్యలలో మిలటరీ కూడా పాల్గొంటుంది.

 

ప్రశ్న 17.
నీటి కొరతకు కారణాలు ఏమిటి?
జవాబు:
నీటి కొరతకు కారణాలు :
జనాభా పెరుగుదల, వర్షపాతం యొక్క అసమాన పంపిణీ, భూగర్భజల క్షీణత, నీటి కాలుష్యం, నీటిని అజాగ్రత్తగా వాడుట, అడవుల నరికివేత, పారిశ్రామిక కాలుష్యం.

6th Class Science 4th Lesson 8 Marks Important Questions and Answers

ప్రశ్న 1.
వర్షాకాలం మనకు ఎందుకు ముఖ్యమైనది?
జవాబు:
భారతదేశంలో వర్షాకాలాన్ని రుతుపవన కాలం అంటారు. ఈ కాలం భారతదేశంలో సుమారు 3-4 నెలలు ఉంటుంది. భారతీయ జనాభా ప్రధానంగా వ్యవసాయం మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి, పంట ఎక్కువగా వర్షం నాణ్యతను బట్టి ఉంటుంది. భూగర్భ జలాల పెరుగుదలకు వర్షాకాలం ముఖ్యమైనది. అన్ని జీవులు మరియు ప్రాణులు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా వర్షాకాలంపై ఆధారపడి ఉంటాయి. వివిధ పద్ధతుల ద్వారా ప్రవహించే వర్షపు నీటిని సేకరించడానికి రుతుపవనాలు మనకు ఆధారం. భూమి మీద జీవించడానికి అవసరమైన మంచినీటిని వర్షాలే మనకు అందిస్తున్నాయి.

ప్రశ్న 2.
అవపాతం యొక్క ప్రధాన రకాలు ఏమిటి? వివరించండి.
జవాబు:
అవపాతంలో నాలుగు ప్రధాన రకాలు ఉంటాయి. అవి వర్షం, మంచు, మంచు వర్షం, వడగళ్ళు. ప్రతి రకం మేఘాలలో నీటి బిందువులు లేదా మంచు స్ఫటికాలుగా ప్రారంభం అవుతుంది. వాతావరణం యొక్క దిగువ భాగంలోని ఉష్ణోగ్రత, అవపాతం ఏ రూపాన్ని తీసుకుంటుందో నిర్ణయిస్తుంది.

వర్షం :
గాలి యొక్క ఉష్ణోగ్రత నీటి ఘనీభవన స్థానం కంటే ఎక్కువగా ఉన్నప్పుడు వర్షం కురుస్తుంది.

మంచు :
నీటి ఆవిరి ఘనీభవించేంత చల్లగా ఉన్న గాలి గుండా వెళుతున్నప్పుడు నీటి ఆవిరి స్ఫటికీకరింపబడి, మంచుగా మారుతుంది.

మంచు వర్షం :
భూమి యొక్క ఉపరితలం దగ్గరగా ఉన్న ఘనీభవించే గాలి ద్వారా వర్షపు చినుకులు పడిపోయినపుడు మంచువర్షం సంభవిస్తుంది.

వడగళ్ళు :
ఉరుములతో కూడిన గాలులు. నీటిని తిరిగి వాతావరణంలోకి నెట్టినప్పుడు వడగళ్ళు ఏర్పడతాయి. మంచుగా మారిన నీరు, ఎక్కువ నీటితో పూత పూయబడి, పడగలిగేంత భారీగా మారే వరకు ఈ ప్రక్రియ పునరావృతమవుతుంది. భారీగా మారిన తరువాత వడగళ్ళుగా పడతాయి.

ప్రశ్న 3.
నీటి ఉపయోగాలను ఇంటి కోసం, వ్యవసాయం కోసం మరియు ఇతర ప్రయోజనాలు కోసం అను మూడు గ్రూపులుగా వర్గీకరించండి.
జవాబు:
నీటి ఉపయోగాలు :
ఇంటికోసం :
త్రాగడం, స్నానం చేయడం, కడగడం, నాళాలు శుభ్రపరచడం, మరుగుదొడ్లు మొదలైన వాటి కోసం.

వ్యవసాయం కోసం :
విత్తనాల అంకురోత్పత్తి, పంటల నీటిపారుదల.

ఇతరాలు :
పరిశ్రమలకు, విద్యుత్తును ఉత్పత్తి చేయడానికి నీటిని ఉపయోగిస్తారు.

 

ప్రశ్న 4.
నీటి వనరుల గురించి క్లుప్తంగా రాయండి.
జవాబు:
నీరు ప్రధానంగా మూడు రూపాల్లో లభిస్తుంది. 1. మంచు 2. నీరు 3. నీటి ఆవిరి.

మంచు :
ఇది నీటి యొక్క ఘన రూపం. మంచు సహజంగా సంభవిస్తుంది. ఇది మంచుతో కప్పబడిన పర్వతాలు, హిమానీనదాలు మరియు ధ్రువ ప్రాంతాలలో ఉంటుంది. 10% భూభాగం హిమానీనదాలతో నిండి ఉంది.

నీరు :
ఇది నీటి ద్రవ రూపం. భూమి ఉపరితలంలో మూడవ వంతు నీటితో కప్పబడి ఉంటుంది. ఇది మహాసముద్రాలు, సముద్రాలు, సరస్సులు, నదులు మరియు భూగర్భంలో కూడా ఉంది. సముద్రపు నీరు ఉప్పగా ఉంటుంది. కానీ మన రోజువారీ ప్రయోజనంలో మనం ఉపయోగించే నీరు ఉప్పగా ఉండదు. దీనిని మంచినీరు అంటారు. 3% మంచినీరు భూమిపై లభిస్తుంది.

నీటి ఆవిరి :
నీటి వాయువు రూపం. ఇది వాతావరణంలో 0.01% ఉంది. వర్షం ఏర్పడటంలోనూ, వాతావరణ ఉష్ణోగ్రతను నిర్ధారిస్తుంది.

ప్రశ్న 5.
వరదలు మానవ జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తాయి?
జవాబు:
ఎక్కువ వర్షపాతం వరదలకు కారణమవుతుంది. వరదల యొక్క తక్షణ ప్రభావాలు :

  • మానవులు ప్రాణాలు కోల్పోవడం, ఆస్తి నష్టం.
  • పంటల నాశనం, పశువుల ప్రాణ నష్టం.
  • నీటి వలన కలిగే వ్యాధుల కారణంగా ఆరోగ్య పరిస్థితుల క్షీణత.
  • విద్యుత్ ప్లాంట్లు, రోడ్లు మరియు వంతెనల నాశనం.
  • ప్రజలు తమ సొంత ఇళ్లను కోల్పోవటం.
  • స్వచ్ఛమైన నీరు, రవాణా, విద్యుత్, కమ్యూనికేషన్ మొదలైన వాటి సరఫరాకు అంతరాయం మొ||నవి ప్రభావితమవుతాయి.

ప్రశ్న 6.
కరవుకు కారణాలు ఏమిటి? ఇది మానవ జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది?
జవాబు:
ఒక నిర్దిష్ట ప్రాంతానికి సుదీర్ఘకాలం పాటు వర్షపాతం సాధారణం కంటే తక్కువగా ఉన్నప్పుడు కరువు వస్తుంది. కర్మాగారాలు, అటవీ నిర్మూలన మరియు కాలుష్యం, గ్లోబల్ వార్మింగ్ కు దారితీస్తుంది. గ్లోబల్ వార్మింగ్ వాతావరణ పరిస్థితులను మారుస్తుంది, ఇవి మేఘాలు చల్లబడటానికి అనుకూలంగా ఉండవు. పర్యవసానంగా, వర్షపాతం తగ్గుతుంది.

మానవ జీవితంపై కరువు ప్రభావాలు :

  • ఆహారం మరియు పశుగ్రాసం కొరత, త్రాగునీరు కొరత.
  • నీటి కొరకు ప్రజలు చాలా దూరం ప్రయాణించాలి.
  • నేల ఎండిపోతుంది, వ్యవసాయం మరియు సాగు కష్టమవుతుంది.
  • జీవనోపాధి కోసం వ్యవసాయం మీద ఆధారపడే చాలా మంది, ఉద్యోగాల కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళతారు.
  • అధిక ఎండలు, వడదెబ్బలు ఉంటాయి. తగ్గిన ఆదాయం వలన ఆర్థిక నష్టం జరుగుతుంది.

ప్రశ్న 7.
నీటి సంరక్షణ పద్ధతులు ఏమిటి?
జవాబు:
నీటి సంరక్షణ పద్ధతులు :

  • వ్యర్థాలను నీటి వనరుల్లోకి విసరటం వలన కలిగే చెడు ప్రభావాల గురించి అవగాహన తీసుకురావటం.
  • కాలుష్య కారకాలను వేరు చేయటం ద్వారా నీటిని పునఃచక్రీయం చేయడం.
  • వ్యవసాయంలో రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించటం ద్వారా భూగర్భ జలాల కాలుష్యాన్ని తగ్గించడం.
  • అటవీ నిర్మూలనను తగ్గించటం.
  • వ్యవసాయంలో బిందు సేద్యం, తుంపరల సేద్యం ఉపయోగించటం ద్వారా నీటిపారుదలకు అవసరమయ్యే నీటిని తగ్గించటం.

ప్రశ్న 8.
వర్షపు నీటి నిర్వహణ గురించి క్లుప్తంగా రాయండి.
జవాబు:
వర్షపు నీటి నిర్వహణ (Rainwater harvesting) :
వర్షపు నీటిని ప్రత్యక్షంగా సేకరించటం మరియు వాడటాన్ని వర్షపు నీటి నిర్వహణ అంటారు. వర్షపు నీటి నిర్వహణలో రెండు రకాలు ఉన్నాయి.

• వర్షపు నీరు పడ్డ చోటనుండే సేకరించడం. ఉదా : ఇళ్ళు లేదా భవనాల పై కప్పుల నుండి నీటిని సేకరించడం (Roof water harvesting).

• ప్రవహించే వర్షపు నీటిని సేకరించడం. ఉదా : చెరువులు, కట్టలు నిర్మించటం ద్వారా వర్షపు నీటిని సేకరించడం. నీరు లేకుండా మనం ఒక్కరోజు కూడా జీవించలేం. నీరు చాలా విలువైనది. ఒక్క చుక్క నీటిని కూడా వృథా చేయకూడదు. మనకోసమే కాకుండా భవిష్యత్తు తరాల కోసం నీటిని కాపాడుకోవడం మన బాధ్యత.

AP Board 6th Class Science 4th Lesson 1 Mark Bits Questions and Answers నీరు

I. బహుళైచ్ఛిక ప్రశ్నలు

కింది వాటికి సరియైన జవాబులు గుర్తించండి.

1. మానవ శరీరానికి …. నీరు అవసరం.
A) 1-2 లీటర్లు
B) 2-3 లీటర్లు
C) 4-5 లీటర్లు
D) 5-6 లీటర్లు
జవాబు:
B) 2-3 లీటర్లు

2. నీటి ఘన పరిమాణం ప్రమాణం
A) మీటర్లు
B) సెంటీమీటర్లు
C) లీటర్లు
D) చదరపు మీటర్లు
జవాబు:
C) లీటర్లు

3. కింది వాటిలో ఏది వ్యవసాయ నీటి వినియోగం కింద వస్తుంది?
A) విత్తనాలు మొలకెత్తటం
B) స్నానం
C) ఇల్లు శుభ్రపరచడం
D) పాత్రలు కడగటం
జవాబు:
A) విత్తనాలు మొలకెత్తటం

4. కింది వాటిలో ఏది స్థిరమైన నీటి వనరు కాదు?
A) చెరువు
B) నది
C) ట్యాంక్
D) బావి
జవాబు:
B) నది

5. మన శరీరంలో నీటి బరువు ……….
A) 50%
B) 60%
C) 70%
D) 80%
జవాబు:
C) 70%

 

6. కింది వాటిలో జ్యూసి పండ్లను గుర్తించండి.
A) దోసకాయ
B) పొట్లకాయ
C) టొమాటో
D) పుచ్చకాయ
జవాబు:
D) పుచ్చకాయ

7. భూమి యొక్క ఉపరితలం ఎంత నీటితో ఆక్రమించబడింది?
A) 3/4
B) 1/2
C) 5/6
D) 4/5
జవాబు:
A) 3/4

8. నీరు దేని వలన లభిస్తుంది?
A) భూగర్భ జలాలు
B) వర్షాలు
C) నదులు
D) సముద్రాలు
జవాబు:
B) వర్షాలు

9. నీటి ఘన స్థితి
A) మహాసముద్రాలు
B) నదులు
C) మంచు
D) పర్వతాలు
జవాబు:
C) మంచు

10. కింది వాటిలో ఏది నీటిని మంచుగా మారుస్తుంది?
A) ఘనీభవనం
B) అవపాతం
C) బాష్పీభవనం
D) బాష్పోత్సేకము
జవాబు:
A) ఘనీభవనం

11. నీటి ద్రవ రూపం ………..
A) హిమానీనదాలు
B) ధ్రువ ప్రాంతాలు
C) మంచుతో కప్పబడిన పర్వతాలు
D) నదులు
జవాబు:
D) నదులు

12. ఏ కూరగాయలో చాలా నీరు ఉంటుంది?
A) బెండకాయ
B) దోసకాయ
C) వంకాయ
D) గుమ్మడికాయ
జవాబు:
B) దోసకాయ

 

13. ఆకాశంలో మేఘాలు ఏర్పడే ప్రక్రియ
A) స్వేదనం
B) అవపాతం
C) బాష్పీభవనం
D) ఘనీభవనం
జవాబు:
C) బాష్పీభవనం

14. ఉదయం వేళలో గడ్డి ఆకులపై నీటి చుక్కలకు కారణం
A) సాంద్రీకరణం
B) బాష్పీభవనం
C) వర్షపాతం
D) గ్లోబల్ వార్మింగ్
జవాబు:
A) సాంద్రీకరణం

15. వర్షం, మంచు, స్ట్రీట్ లేదా ఆకాశం నుండి వడగళ్ళు పడే వాతావరణ పరిస్థితిని …. అంటారు.
A) సాంద్రీకరణం
B) బాష్పీభవనం
C) బాష్పోత్సేకము
D) అవపాతం
జవాబు:
D) అవపాతం

16. నీటి చక్రం కింది వేని మధ్య తిరుగుతుంది?
A) భూమి
B) మహాసముద్రాలు
C) వాతావరణం
D) పైవన్నీ
జవాబు:
D) పైవన్నీ

17. కిందివాటిలో ఏది నీటి చక్రానికి భంగం కలిగిస్తుంది?
A) అటవీ నిర్మూలన
B) కాలుష్యం
C) గ్లోబల్ వార్మింగ్
D) పైవన్నీ
జవాబు:
D) పైవన్నీ

18. అటవీ నిర్మూలన వలన ఏమి తగ్గుతుంది?
A) నేల కోత
B) కరవు
C) బాష్పోత్సేకము
D) అవపాతం
జవాబు:
C) బాష్పోత్సేకము

19. కింది వాటిలో ఏది నీటి సంబంధిత విపత్తు కాదు?
A) వరదలు
B) భూకంపం
C) సునామి
D) కరవు
జవాబు:
B) భూకంపం

20. నదులలో నీటి మట్టం పెరుగుదలకు కారణం
A) వరద
B) కరవు
C) నీటి కొరత
D) ఎండిన భూమి
జవాబు:
A) వరద

21. కింది వాటిలో కరవు పీడిత జిల్లా
A) గుంటూరు
B) కృష్ణ
C) ప్రకాశం
D) చిత్తూరు
జవాబు:
C) ప్రకాశం

 

22. కింది వాటిలో నీటి నిర్వహణ పద్దతులు ఏవి?
A) బిందు సేద్యం మరియు స్ప్రింక్లర్
B) నీటి కాలుష్యం
C) రసాయన ఎరువులు వాడటం
D) బోర్ బావులను తవ్వడం
జవాబు:
A) బిందు సేద్యం మరియు స్ప్రింక్లర్

II. ఖాళీలను పూరించుట

కింది ఖాళీలను పూరింపుము.

1. ఆహారం జీర్ణం కావడానికి మరియు శరీరం నుండి ……………………. తొలగించడానికి నీరు సహాయపడుతుంది. అంటారు.
2. నీరు మరియు ఇతర ద్రవాలను …………….. లో కొలుస్తారు.
3. ఎక్కువ నీరు ఉన్న పండ్లను …………… అంటారు.
4. …………… జ్యూసి కూరగాయలకు ఉదాహరణ.
5. భూమిపై లభించే నీటిలో, మంచినీరు ….. మాత్రమే.
6. మన దైనందిన ప్రయోజనాలకు ఉపయోగించే నీటిని …………… అంటారు.
7. నీటిని ఆవిరిగా మార్చే ప్రక్రియను …………….. అంటారు.
8. నీటి చక్రాన్ని ………… అని కూడా అంటారు.
9. ఎక్కువకాలం పాటు వర్షం లేకపోవటం ఆ ప్రాంతంలో ………. కు దారితీస్తుంది.
10. అధిక వర్షాలు …………… ను కలిగిస్తాయి.
11. …………… నీరు, నీటి ఆవిరిగా మారుతుంది.
12. నీరు ………… శోషించి బాష్పీభవనం ద్వారా వాతావరణాన్ని ప్రభావితం చేస్తుంది.
13. నీటి ఆవిరిని నీటిగా మార్చే ప్రక్రియను ………………. అంటారు.
14. ………….. వాతావరణం పైపొరలలో మేఘాలను చల్లబరుస్తుంది.
15. వర్షంతో పాటు పడే మంచు ముక్కలు ………….
16. నైరుతి రుతుపవనాల కాలం ……………..
17. ఈశాన్య రుతుపవనాల కాలం ……………
18. భూమి ఉపరితలం మరియు గాలి మధ్య నీటి
ప్రసరణను ……….. అంటారు.
19. NDRF ని విస్తరించండి …………..
20. SDRF ని విస్తరించండి …………..
21. వర్షపు నీటిని ప్రత్యక్షంగా సేకరించడం మరియు వాడటాన్ని …………… అంటారు.
22. ఇళ్ళు మరియు భవనాల పైకప్పు భాగాల నుండి నీటిని సేకరించడం ……………
23. వ్యవసాయంలో ఉపయోగించే ఉత్తమ నీటిపారుదల పద్దతి ……………..
24. నీటి కొరతను నివారించే ఏకైక పద్ధతి ……………
25. ఎక్కువ కాలం పాటు తక్కువ వర్షపాతం వలన …………… వస్తుంది.
జవాబు:

  1. విష పదార్థాలు (వ్యర్థ పదార్థాలు ).
  2. లీటర్లలో
  3. జ్యూసి పండ్లు
  4. దోసకాయ
  5. 3%
  6. మంచి నీరు
  7. బాష్పీభవనం
  8. హైడ్రోలాజికల్ చక్రం (జల చక్రం)
  9. కరవు
  10. వరదలు
  11. వేడి
  12. వేడిని
  13. సాంద్రీకరణ
  14. చల్లని గాలి
  15. వడగళ్ళు
  16. జూన్-సెప్టెంబర్
  17. నవంబర్ – డిసెంబర్
  18. నీటి చక్రం
  19. జాతీయ విపత్తు సహాయక దళం
  20. రాష్ట్ర విపత్తు సహాయక’ దళం
  21. వర్షపు నీటి సేకరణ
  22. పైకప్పు నీటి సేకరణ
  23. బిందు సేద్యం / స్ప్రింక్లర్ ఇరిగేషన్
  24. నీటి సంరక్షణ
  25. కరవు

III. జతపరుచుట

కింది వానిని జతపరుచుము.

1.

Group – A Group – B
ఎ) భూమిపై నీరు 1. 70%
బి) మంచినీరు 2. రుతుపవనాలు
సి) మన శరీరంలో నీరు 3. 75%
డి) వడగళ్ళు రాళ్ళు 4.3%
ఇ) వర్షాలు 5. అవపాతం

జవాబు:

Group – A Group – B
ఎ) భూమిపై నీరు 3. 75%
బి) మంచినీరు 4.3%
సి) మన శరీరంలో నీరు 1. 70%
డి) వడగళ్ళు రాళ్ళు 5. అవపాతం
ఇ) వర్షాలు 2. రుతుపవనాలు

2.

Group – A Group – B
ఎ) ఘన రూపం 1. నైరుతి ఋతుపవనాలు
బి) ద్రవ రూపం 2. మంచు
సి) వాయు రూపం 3. ఈశాన్య రుతుపవనాలు
డి) జూన్-సెప్టెంబర్ 4. నీరు
ఇ) నవంబర్-డిసెంబర్ 5. నీటి ఆవిరి

జవాబు:

Group – A Group – B
ఎ) ఘన రూపం 2. మంచు
బి) ద్రవ రూపం 4. నీరు
సి) వాయు రూపం 5. నీటి ఆవిరి
డి) జూన్-సెప్టెంబర్ 1. నైరుతి ఋతుపవనాలు
ఇ) నవంబర్-డిసెంబర్ 3. ఈశాన్య రుతుపవనాలు

3.

Group – A Group – B
ఎ) సాంద్రీకరణ 1. మొక్కల నుండి నీరు ఆవిరి కావటం
బి) బాష్పీభవనం 2. వాయువు ద్రవంగా మారుతుంది
సి) బాష్పోత్సేకం 3. ద్రవము వాయువుగా మారటం
డి) వర్షం 4. నీరు భూమిలోకి ఇంకటం
ఇ) భూగర్భజలం 5. నీరు భూమిపై పడటం

జవాబు:

Group – A Group – B
ఎ) సాంద్రీకరణ 2. వాయువు ద్రవంగా మారుతుంది
బి) బాష్పీభవనం 3. ద్రవము వాయువుగా మారటం
సి) బాష్పోత్సేకం 1. మొక్కల నుండి నీరు ఆవిరి కావటం
డి) వర్షం 5. నీరు భూమిపై పడటం
ఇ) భూగర్భజలం 4. నీరు భూమిలోకి ఇంకటం

మీకు తెలుసా?

→ ప్రపంచ వ్యాప్తంగా 783 మిలియన్ల మందికి పరిశుభ్రమైన నీరు అందుబాటులో లేదు.

→ మన శరీరం ఉష్ణోగ్రతను నియంత్రించడానికి, ఇతర శారీరక విధులు నిర్వహించడానికి నీటిని ఉపయోగించుకుంటుంది. సరైన శారీరక పనితీరు కోసం (ఆరోగ్యంగా ఉండటం కోసం) మానవ శరీరానికి రోజుకు 2-3 లీటర్ల నీరు అవసరం. ఆహారం జీర్ణం కావటానికి, శరీరం నుండి విష పదార్థాలను (వ్యర్థాలను) తొలగించడానికి నీరు ఎంతో సహాయపడుతుంది. మన పాఠశాలల్లో నీటి గంటలు (water bell) ప్రవేశపెట్టడానికి ఇదే కారణం.

→ మనకు కావలసిన నీరు నదులు, చెరువులు, కుంటల నుండే కాకుండా పండ్లు, కూరగాయల నుంచి కూడా లభిస్తుంది. పుచ్చకాయ, బత్తాయి వంటి పండ్లు, సొర, దోస వంటి కూరగాయలలో కూడా నీరు ఉంటుంది. ఇలాంటివే మరికొన్ని ఉదాహరణలు ఇవ్వండి. మన బరువులో 70% నీరే ఉంటుంది. వేసవికాలంలో రసాలనిచ్చే పండ్లను మనం ఎందుకు తీసుకుంటామో ఆలోచించండి.

→ ప్రతి సంవత్సరం కొన్ని నెలల్లో వర్షాలు కురవడం మనం సాధారణంగా చూస్తుంటాం. మన రాష్ట్రంలో జూన్ నుండి సెప్టెంబరు వరకు వర్షాలు కురుస్తుంటాయి. ఈ రోజుల్లో ఆకాశం మేఘాలతో నిండి ఉంటుంది. గాలులు కూడా వీస్తుంటాయి. నైరుతి మూల నుండి ఈ గాలులు వీస్తుంటాయి. కాబట్టి వీటిని ‘నైరుతి ఋతుపవనాలు’ అంటారు. అలాగే నవంబరు, డిసెంబరు నెలలో కూడా వర్షాలు కురుస్తాయి. ఈ సమయంలో ఈశాన్య మూలనుంచి గాలులు వీస్తుంటాయి. వీటిని “ఈశాన్య ఋతుపవనాలు” అంటారు. అయితే ఈ మధ్యకాలంలో ఋతువులకు తగినట్లు వర్షాలు కురవడం లేదని అందరు అనుకుంటుండడం మీరు వినే ఉంటారు. ఇలా ఎందుకు జరుగుతోందో ఆలోచించండి.

→ అవపాతంలో నాలుగు ప్రధాన రకాలు ఉంటాయి. అవి వర్షం, మంచు, మంచువర్షం, వడగళ్ళు. ప్రతి రకం మేఘాలలో నీటి బిందువులు లేదా మంచు స్ఫటికాలుగా ప్రారంభం అవుతుంది. వాతావరణం యొక్క దిగువ భాగంలోని ఉష్ణోగ్రత, అవపాతం ఏ రూపాన్ని తీసుకుంటుందో నిర్ణయిస్తుంది.

వర్షం :
గాలి యొక్క ఉష్ణోగ్రత నీటి ఘనీభవన స్థానం కంటే ఎక్కువగా ఉన్నప్పుడు వర్షం కురుస్తుంది.

మంచు :
నీటి ఆవిరి ఘనీభవించేంత చల్లగా ఉన్న గాలి గుండా వెళుతున్నప్పుడు నీటి ఆవిరి స్పటికీకరింపబడి, మంచుగా మారుతుంది.

మంచు వర్షం :
భూమి యొక్క ఉపరితలం దగ్గరగా ఉన్న ఘనీభవించే గాలి ద్వారా వర్షపు చినుకులు పడిపోయినపుడు మంచువర్షం సంభవిస్తుంది.

 

వడగళ్ళు :
ఉరుములతో కూడిన గాలులు నీటిని తిరిగి వాతావరణంలోకి నెట్టినప్పుడు వడగళ్ళు ఏర్పడతాయి. మారిన నీరు, ఎక్కువ నీటితో పూత పూయబడి, పడగలిగేంత భారీగా మారే వరకు ఈ ప్రక్రియ పునరావృత మవుతుంది. భారీగా మారిన తరువాత వడగళ్ళుగా పడతాయి.

→ జాతీయ విపత్తు సహాయక దళం (National Disaster Relief Force (NDRF), రాష్ట్ర విపత్తు సహాయక దళం, స్థానిక అగ్నిమాపక, ఆరోగ్య, పోలీసు, రెవిన్యూ విభాగాలు ప్రకృతి వైపరీత్యాల సమయంలో సమన్వయంతో పనిచేస్తున్నాయి. అవసరమైనప్పుడు సైన్యం కూడా సహాయక చర్యలలో పాల్గొంటుంది.

The Complete Educational Website

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *