AP 6th Class Science Important Questions Chapter 9 జీవులు – ఆవాసం
AP 6th Class Science Important Questions Chapter 9 జీవులు – ఆవాసం
AP Board 6th Class Science 9th Lesson Important Questions and Answers జీవులు – ఆవాసం
6th Class Science 9th Lesson 2 Marks Important Questions and Answers
ప్రశ్న 1.
జీవులు మరియు నిర్జీవులు అంటే ఏమిటి?
జవాబు:
పెరుగుదల, కదలిక, ఆహారం తీసుకోవడం, శ్వాస తీసుకోవడం, వ్యర్థాలను విసర్జించడం మరియు కొత్త జీవులకు జన్మనివ్వడం వంటి లక్షణాలు కలిగిన వాటిని జీవులు అంటారు. ఉదా : మొక్కలు, జంతువులు. ఈ లక్షణాలు కలిగి లేని వాటిని నిర్జీవులు అని పిలుస్తారు.
ఉదా : రాయి, నీరు; నేల.
ప్రశ్న 2.
అండోత్పాదక జీవులు అంటే ఏమిటి? ఉదాహరణలు ఇవ్వండి.
జవాబు:
గుడ్లు పెట్టే జీవులను అండోత్పాదక జీవులు అంటారు.
ఉదా : కోడి, కాకి, బల్లి, పాము.
ప్రశ్న 3.
శిశోత్పాదక జీవులు అంటే ఏమిటి? ఉదాహరణలు ఇవ్వండి.
జవాబు:
పిల్లలకు జన్మనిచ్చే జీవులను శిశోత్పాదక జీవులు అంటారు.
ఉదా : మనిషి, పిల్లి, కుక్క ఏనుగు.
ప్రశ్న 4.
సూక్ష్మదర్శిని అంటే ఏమిటి?
జవాబు:
మైక్రోస్కోప్ అనేది మనం కంటితో చూడలేని జీవులను పరిశీలించడానికి ఉపయోగించే ఒక పరికరం.
ప్రశ్న 5.
టచ్ మీ నాట్ మొక్కను తాకినప్పుడు ఏమి జరుగుతుంది?
జవాబు:
టచ్ మీ నాట్ మొక్క (మైమోసా పుడికా)ను ఆకులను తాకినప్పుడు, ఆకులు ముడుచుకుపోతాయి. ఇక్కడ తాకటం మొక్కకు ఉద్దీపన, ఆకులు ముడుచుకోవటం మొక్క యొక్క ప్రతిస్పందన.
ప్రశ్న 6.
జీవులన్నీ జీవితాంతం పెరుగుతాయా?
జవాబు:
లేదు. అన్ని జీవులు జీవితాంతం పెరగవు. మొక్కలు జీవితాంతం పెరుగుతాయి. కాని జంతువులు కొంత వయస్సు వరకు మాత్రమే పెరుగుతాయి.
ప్రశ్న 7.
చనిపోయిన మొక్కలు లేదా జంతువులు నిర్జీవులా?
జవాబు:
లేదు. చనిపోయిన మొక్క కానీ జంతువులు కానీ లేదా మరే ఇతర సజీవి కానీ చనిపోయిన తరువాత కుళ్ళిపోయి నిర్జీవ కారకాలుగా మారతాయి. అందువల్ల చనిపోయిన జీవులను నిర్జీవులుగా భావించలేము. ఇవి సజీవులకు, నిర్జీవులకు నడుమ ఏర్పడు మధ్యస్థ అంశాలు.
ప్రశ్న 8.
సూక్ష్మజీవులు అంటే ఏమిటి?
జవాబు:
కంటికి కనపడని చిన్న జీవులను సూక్ష్మజీవులు అంటారు. మనం వీటిని సూక్ష్మదర్శిని క్రింద మాత్రమే చూడగలము.
ప్రశ్న 9.
ఉద్దీపన అంటే ఏమిటి?
జవాబు:
జీవులలో ప్రతిస్పందనకు కారణమైన మార్పును ఉద్దీపన అంటారు.
ప్రశ్న 10.
కొల్లేరు సరస్సులో ఏ నెలల్లో పెలికాన్లు కనిపిస్తాయి?
జవాబు:
అక్టోబర్ నుండి మార్చి వరకు.
ప్రశ్న 11.
భౌమ ఆవాసము అంటే ఏమిటి? భౌమ ఆవాసాల యొక్క కొన్ని మొక్కలు మరియు జంతువులకు పేరు పెట్టండి.
జవాబు:
భూమిపై వేర్వేరు ప్రదేశాల్లో మొక్కలు మరియు జంతువులు నివసించే ప్రదేశాలను భౌమ ఆవాసాలు అంటారు.
ఉదా : మామిడి, జామ, సపోటా, పక్షులు, మనిషి, పాములు, చీమలు మొదలైనవి.
ప్రశ్న 12.
జంతువుల చర్మం కొన్ని జీవులకు ఆవాసంగా ఎలా ఉంటుంది?
జవాబు:
మనం తరుచుగా గేదెల చర్మంపై కొన్ని కీటకాలను చూస్తుంటాము. కాబట్టి ఆ కీటకానికి గేదె చర్మం ఆవాసము.
ప్రశ్న 13.
సాధారణంగా జీవులు ఎక్కడ ఉంటాయి?
జవాబు:
జీవులకు వేర్వేరు అవసరాలు ఉన్నాయి. అవి సాధారణంగా వారి అవసరాలను తీర్చగలిగిన ప్రదేశాలలో ఉంటాయి. అంటే ఆవాసాలలో వాటికి తగినంత ఆహారం, ఆశ్రయం మరియు జీవించటానికి అవసరమైన ఇతర పరిస్థితులు లభిస్తాయి.
ప్రశ్న 14.
కొలను యొక్క ఉపరితలంపై ఏ జంతువులు మరియు మొక్కలు నివసిస్తాయి?
జవాబు:
నత్త, మే ఫ్లై, కింగ్ ఫిషర్ మరియు పాండ్ స్కేటర్లు వంటి జీవులు నీటి ఉపరితలంపై నివసిస్తాయి.
ప్రశ్న 15.
కొలనులోని వివిధ ప్రదేశాలను ఆవాసముగా కూడా పిలవవచ్చా? ఎందుకు? లేదా ఎందుకు కాదు?
జవాబు:
కొలనులోని వివిధ ప్రదేశాలలో వివిధ జీవులు నివసిస్తాయి. కావున వీటిని ఆవాసముగా భావించవచ్చు.
ప్రశ్న 16.
చెట్టుపై మీకు కనిపించే వివిధ జీవుల పేర్లు చెప్పండి.
జవాబు:
పక్షులు, కోతులు, ఉడుతలు, పాములు, చీమలు, సాలెపురుగులు, గొంగళి పురుగులు, చిమటలు, తేనెటీగలు, కందిరీగలు, చిన్న మొక్కలు (నాచులు) దోమలు మొ||నవి.
ప్రశ్న 17.
పండ్ల తోటలో పెరిగే మొక్కలన్నీ అడవిలోని మొక్కల మాదిరిగానే ఉన్నాయా? ఎందుకు?
జవాబు:
ఒక పండ్ల తోటలో పండ్ల మొక్కలు మాత్రమే పండిస్తారు. చింతపండు, మామిడి, ఉసిరి, అడవులలో పెరిగే మొక్కలకు ఉదాహరణలు.
ప్రశ్న 18.
ఎడారి మొక్కలకు ఉదాహరణలు ఇవ్వండి.
జవాబు:
బ్రహ్మజెముడు, నాగజెముడు, కలబంద, కిత్తనార ఎడారి మొక్కలకు ఉదాహరణలు.
ప్రశ్న 19.
కొలను మధ్యభాగంలో ఏ జంతువులు, మొక్కలు నివసిస్తాయని మీరు అనుకుంటున్నారు?
జవాబు:
బొద్దింకలు, దోమ లార్వా, చేపలు మరియు పీతలు కొలను మధ్యభాగంలో ఉంటాయి.
6th Class Science 9th Lesson 4 Marks Important Questions and Answers
ప్రశ్న 1.
జీవులు మరియు నిర్జీవులు రెండింటిలో ఏ లక్షణాలు ఒకేలా ఉంటాయి?
జవాబు:
- అన్ని జీవులు మరియు నిర్జీవులు పదార్థంతో తయారవుతాయి.
- అన్ని జీవులు మరియు నిర్జీవులు ద్రవ్యరాశిని కలిగి వుంటాయి. మరియు స్థలాన్ని ఆక్రమిస్తాయి.
- రెండూ నిర్మాణాత్మక పరిమాణం కలిగి ఉంటాయి.
- కణం అనేది జీవుల మరియు నిర్జీవుల నిర్మాణాత్మక ప్రమాణం.
ప్రశ్న 2.
మన పర్యావరణమునకు జీవులు మరియు నిర్జీవులు రెండూ అవసరమని మీరు అనుకుంటున్నారా?
జవాబు:
అవును. మన పర్యావరణానికి జీవులు మరియు నిర్జీవులు రెండూ అవసరం.
- ఉదాహరణకు మొక్క ఒక జీవి. దాని మనుగడ కోసం నేల నుండి నీరు మరియు ఖనిజాలను తీసుకుంటుంది.
- దీని అర్థం జీవులు నిర్జీవుల పై ఆధారపడి ఉంటాయి. ఇది మన పర్యావరణాన్ని స్థిరంగా ఉంచుతుంది.
ప్రశ్న 3.
విత్తనం జీవిస్తున్నట్లు వంశీ తన స్నేహితుడు రాముతో వాదించాడు. రాము ఏ ప్రశ్నలు అడుగుతాడో ఆలోచించండి.
జవాబు:
- విత్తనం పెరుగుతుందా?
- విత్తనంలో కదలిక ఉందా?
- విత్తనం ఆహారాన్ని తీసుకుంటుందా?
- విత్తనం శ్వాస తీసుకోగలదా?
- విత్తనం దానిలోని వ్యర్థాలను ఎలా తొలగిస్తుంది?
ప్రశ్న 4.
కొలను నీటిలో సూక్ష్మజీవులను పరిశీలించడానికి మీరు ప్రయోగశాలలో చేసిన ప్రయోగ దశలను రాయండి.
జవాబు:
- నీటి నమూనాలను కొలను నుండి మరియు బోరు బావి నుండి సేకరించండి.
- వాటిని విడివిడిగా ఉంచండి.
- స్లెడ్ పై వాటర్ డ్రాప్ ఉంచండి. దానిపై కవర్ స్లిప్ ఉంచండి.
- సూక్ష్మదర్శిని క్రింద గమనించండి. అనేక సూక్ష్మజీవులు కనిపిస్తాయి.
ప్రశ్న 5.
మన చుట్టూ ఉన్న వివిధ ఆవాసాలు ఏమిటి?
జవాబు:
చెట్లపై, మన ఇళ్లలో, కొలనులోని వివిధ ప్రాంతాలలో మరియు అనేక ఇతర ప్రదేశాలలో ఒక చిన్న నీటి కొలనులో అనేక జీవులను మనం చూస్తాము. ఇవన్నీ ఆవాసాలే.
- విస్తీర్ణం పెరిగే కొద్దీ, అక్కడ నివసించే జీవుల రకం మరియు సంఖ్య కూడా పెరుగుతుంది.
- మన ఇంటి కంటే ఇంటి పరిసరాలు, పరిసరాల కంటే కొలను, కొలను కంటే సరస్సులో ఎక్కువ రకాల జీవులు ఉంటాయి.
- పెద్ద ప్రాంతాలు ఎక్కువ జీవులు జీవించటానికి అనుకూలంగా ఉంటాయి.
ప్రశ్న 6.
జల ఆవాసాలు అంటే ఏమిటి?
జవాబు:
నీరు ప్రధాన వనరుగా ఉన్న ఆవాసాలను జల ఆవాసాలు అంటారు.
- అన్ని సరస్సులలో మనం మొక్కలను మరియు జంతువులను చూడవచ్చు.
- నీటిలో నివసించే మొక్కలను నీటి మొక్కలు అంటారు. జంతువులను నీటి జంతువులు అంటారు.
ప్రశ్న 7.
మీ ఇల్లు కూడా ఒక ఆవాసమేనా? దీనిపై వ్యా ఖ్యానించండి.
జవాబు:
మనతో పాటు మన ఇంట్లో అనేక జీవులు ఉంటాయి. కావున మన ఇల్లు కూడా ఒక ఆవాసము.
- కుక్కలు, పిల్లులు, మేకలు, ఆవులు, పక్షులు, సాలెపురుగులు, చీమలు మరియు బొద్దింకలు వంటి అనేక జీవులు మాతో పాటు నివసిస్తాయి.
- మనీ ప్లాంట్ మరియు కొన్ని క్రోటన్ మొక్కలు, పూల మొక్కలు మరియు కొన్ని కూరగాయల మొక్కలు మా ఇంటిలో పెంచుతాము.
- కావున మా ఇల్లు కూడా ఒక ఆవాసము.
ప్రశ్న 8.
ఎడారి మొక్కల గురించి తెలపండి.
జవాబు:
- ఎడారులలో అధిక ఉష్ణోగ్రత మరియు నీటి లభ్యత తక్కువగా ఉంటుంది.
- ఇటువంటి పరిసరాలలో పెరిగే మొక్కలను ఎడారి మొక్కలు అంటారు.
- బ్రహ్మ జెముడు, నాగజెముడు, కలబంద మొక్కలకు మిరప లేదా మల్లె మొక్కల వలె నీరు అవసరం లేదు.
- ఎడారి మొక్కలు మరియు జంతువులు పొడి పరిస్థితులకు మరియు విస్తారమైన ఉష్ణోగ్రత వ్యత్యాసాలను తట్టుకొంటాయి.
ప్రశ్న 9.
తన ఇంటి వద్ద ఉన్న జామ చెట్టు మీద పండ్లు తినే ఉడుతలను భంగపరచడానికి రాజేష్ ఇష్టపడడు. అతను ఎందుకు అలా చేస్తాడు?
జవాబు:
- మన వలె జంతువులు కూడా ఆవాసంలో ఒక భాగము. అవి జీవించటానికి ఆహారం అవసరం.
- తినేటప్పుడు వాటిని బెదరకొడితే అవి భయపడతాయి. కావున మనం చెడుగా ప్రవర్తించకూడదు.
ప్రశ్న 10.
మన పెంపుడు జంతువుల పట్ల మనం ఎందుకు బాధ్యతాయుతంగా మెలగాలి?
జవాబు:
- మన పెంపుడు జంతువుల మంచి చెడ్డలను మనమే చూసుకోవాలి.
- వాటి షెడ్లను శుభ్రంగా ఉంచడం, వాటికి పశుగ్రాసం మరియు నీరు సరఫరా చేయడం మన బాధ్యత.
- మనం జంతువుల పట్ల శ్రద్ధ చూపిస్తే అవి మన పట్ల ప్రేమగా ఉంటాయి.
6th Class Science 9th Lesson 8 Marks Important Questions and Answers
ప్రశ్న 1.
సూక్ష్మదర్శిని యొక్క నిర్మాణాన్ని వివరించండి.
జవాబు:
- సూక్ష్మదర్శిని మనం కంటితో చూడలేనంత చిన్న వస్తువులను, జీవులను చూడటానికి ఉపయోగించే పరికరం.
- ఇది భూతద్దం వలె పనిచేస్తుంది. అయితే భూతద్దం కన్నా చాలా శక్తివంతమైనది.
- ప్రాథమికంగా సూక్ష్మదర్శిని నందు రెండు – విభాగాలు కలవు. అవి నిర్మాణాత్మక విభాగం మరియు దృశ్య విభాగం.
- నిర్మాణాత్మక విభాగంలో పీఠం, ఆధారం, చేతి వంపు ఉంటాయి.
- దృశ్య విభాగంలో అక్షి కటకం, వస్తు కటకం స్థూల సవరణి, సూక్ష్మ సవరణి, పీఠం, రంధ్రం మొదలైన భాగాలుంటాయి.
ప్రశ్న 2.
ఆవాసాలను పాడుచేస్తే ఏమి జరుగుతుంది?
జవాబు:
- కొలనులు, సరస్సులు, నదులు మరియు మైదానాలలో వ్యర్థాలను వేయడం ద్వారా మనం ఆవాసానికి భంగం కలిగిస్తున్నాము.
- ఆవాసాలు అనేక జీవులకు నివాస స్థావరాలు. ఆవాసాలు పాడుచేయటం వలన ఈ జీవులన్నీ నివాసాలను కోల్పోతాయి.
- జంతువులు మన ఆవాసాలలో భాగస్వాములు. వాటికి జీవించే హక్కు ఉంది.
- ఆవాసములో జరిగే ప్రతి మార్పు అన్నీ జీవులను ప్రభావితం చేస్తుంది.
- అది మానవుని జీవితంపై తీవ్ర ప్రభావం చూపుతుంది.
- కావున ఆవాసాలను మనం పరిరక్షించుకోవాలి.
ప్రశ్న 3.
పక్షులు ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి ఎందుకు వలసపోతున్నాయి?
జవాబు:
- పక్షులు ప్రధానంగా ఆహారం కోసం, అనుకూల పరిసరాల కోసం, ప్రత్యుత్పత్తి కోసం ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి వలస వెళతాయి.
- మన రాష్ట్రంలోని కొల్లేరు మరియు పులికాట్ సరస్సులకు వివిధ రకాల పక్షులు చాలాదూరం నుండి వలస వస్తాయి.
- సాధారణంగా పునరుత్పత్తికి అనువైన పరిస్థితుల కోసం పక్షులు చాలాదూరం ప్రయాణిస్తాయి.
- తాబేళ్లు వంటి జంతువులు పశ్చిమబెంగాల్ మరియు ఒడిశా తీరాల నుండి విశాఖపట్నం తీరాలకు వెళతాయి.
- పులస వంటి కొన్ని చేపలు సముద్రపు నీటి నుండి నది నీటికి వలసపోతాయి.
ప్రశ్న 4.
మనం జంతువుల ఆవాసాలను ఆక్రమిస్తే ఏమి జరుగుతుంది?
జవాబు:
- జంతువులు మన ఆవాసంలో ఒక భాగము.
- మనలాగే వాటికి భూమి మీద జీవించే హక్కు ఉంది.
- మనం మన అవసరాల కోసం వాటి ఆవాసాలను ఆక్రమిస్తున్నాము.
- మనం చెట్లను నరికినపుడు వాటిపై నివసించే పక్షులు వాటి గూళ్ళు పోగొట్టుకుంటాయి మరియు ప్రమాదంలో పడతాయి.
- కుక్కలు, కాకులు, కోతులు మొ|| జంతువులు ఆహారం మరియు ఆశ్రయం లేకపోతే బాధపడటం మనం తరచుగా చూస్తాము.
- కావున మనం ఆవాసాలను పాడు చేయరాదు.
- జంతువుల హక్కులు మరియు రక్షణ కోసం పనిచేసే పెటా వంటి కొన్ని స్వచ్ఛంద సంస్థలు ఉన్నాయి.
AP Board 6th Class Science 9th Lesson 1 Mark Bits Questions and Answers జీవులు – ఆవాసం
I. బహుళైచ్ఛిక ప్రశ్నలు
కింది వాటికి సరియైన జవాబులు గుర్తించండి.
1. కిందివాటిలో అండోత్పాదక జీవి
A) కుందేలు
B) కుక్క
C) కోడి
D) ఎలుక
జవాబు:
C) కోడి
2. శిశోత్పాదక జంతువులు
A) గుడ్లు పెడతాయి.
B) చిన్న పిల్లలకు జన్మనిస్తాయి.
C) గుడ్లు పెట్టి, చిన్న పిల్లలకు జన్మనిస్తాయి.
D) ఏదీకాదు
జవాబు:
B) చిన్న పిల్లలకు జన్మనిస్తాయి.
3. సూక్ష్మజీవులను చూడటానికి మనం ఏమి ఉపయోగిస్తాము?
A) టెలిస్కోపు
B) పెరిస్కోపు
C) కెలిడియోస్కోపు
D) మైక్రోస్కోపు
జవాబు:
D) మైక్రోస్కోపు
4. కింది వాటిలో ఏది జీవి?
A) బాక్టీరియా
B) టేబుల్
C) కుర్చీ
D) రాయి
జవాబు:
A) బాక్టీరియా
5. సూక్ష్మదర్శినిలో అక్షి కటకం దేని భాగం?
A) నిర్మాణాత్మక విభాగం
B) దృశ్య విభాగం
C) రెండూ
D) ఏదీకాదు
జవాబు:
B) దృశ్య విభాగం
6. విత్తనం ………
A) జీవి
B) నిర్జీవి
C) రెండూ
D) ఏదీకాదు
జవాబు:
A) జీవి
7. జీవుల యొక్క లక్షణం
A) పునరుత్పత్తి
B) శ్వాసక్రియ
C) విసర్జన
D) పైవన్నీ
జవాబు:
D) పైవన్నీ
8. ఏ మొక్కను మనం తాకినప్పుడు ప్రతిస్పందనను చూపుతుంది?
A) వేప
B) జామ
C) అత్తిపత్తి
D) మామిడి
జవాబు:
C) అత్తిపత్తి
9. చనిపోయిన పదార్థాలు కుళ్ళిపోయి వేటిని ఏర్పరుస్తాయి?
A) జీవులు
B) మొక్కలు
C) జంతువులు
D) నిర్జీవ అంశాలు
జవాబు:
D) నిర్జీవ అంశాలు
10. నీటి మొక్కలు ఎక్కడ నివసిస్తాయి?
A) నీటిలో
B) భూమిపై
C) ఇసుకపై
D) బురద నేలలో
జవాబు:
A) నీటిలో
11. కింది వాటిలో ఎడారి మొక్క ఏది?
A) జామ
B) కలబంద
C) వేప
D) మామిడి
జవాబు:
B) కలబంద
12. పానపాములు మొక్కల ఏ భాగంకు దగ్గరగా ఉంటాయి?
A) వేర్లు
B) కాండం
C) ఆకులు
D) కొమ్మలు
జవాబు:
A) వేర్లు
13. ఏ జంతువు ఎడారిలో కనిపిస్తుంది?
A) గుర్రం
B) ఎలుక
C) ఒంటె
D) ఏనుగు
జవాబు:
C) ఒంటె
14. పాండ్ స్కేటర్ (నీటిపై తిరిగే కీటకం) కొలను ఏ ప్రాంతంలో నివసిస్తుంది?
A) కొలను అంచు
B) కొలను యొక్క ఉపరితలం
C) కొలను దిగువన
D) ఏదీకాదు
జవాబు:
B) కొలను యొక్క ఉపరితలం
15. జీవులు ఏ అవసరాలకు వాటి పరిసరాలపై ఆధారపడి ఉంటాయి?
A) ఆహారం
B) నీరు
C) ఆశ్రయం
D) పైవన్నీ
జవాబు:
D) పైవన్నీ
16. కొండపల్లి రిజర్వ్ ఫారెస్ట్ ఏ జిల్లాలో ఉంది?
A) గుంటూరు
B) కృష్ణా
C) నెల్లూరు
D) ప్రకాశం
జవాబు:
B) కృష్ణా
17. పులికాట్ సరస్సు ఏ జిల్లాలో ఉంది?
A) నెల్లూరు
B) కృష్ణా
C) పశ్చిమ గోదావరి
D) కర్నూలు
జవాబు:
A) నెల్లూరు
18. మన ఇంటి ఆవాసాలలో కనిపించని జీవులు
A) పక్షులు
B) కుక్కలు
C) పీతలు
D) ఎలుకలు
జవాబు:
C) పీతలు
19. ఒక పండ్ల తోటలో రైతులు ఏమి పెంచుతారు?
A) అన్ని రకాల పండ్లు
B) అన్ని రకాల పువ్వులు
C) అన్ని రకాల పండ్ల మొక్కలు
D) ఒకే రకమైన పండ్ల మొక్కలు
జవాబు:
D) ఒకే రకమైన పండ్ల మొక్కలు
20. కొన్ని, పక్షులు దేని కోసం తమ ఆవాసాలను మార్చుకుంటాయి?
A) ప్రత్యుత్పత్తి
B) శ్వాసక్రియ
C) జీర్ణక్రియ
D) విసర్జన
జవాబు:
A) ప్రత్యుత్పత్తి
II. ఖాళీలను పూరించుట కింది ఖాళీలను పూరింపుము.
1. మొక్కలు మరియు జంతువుల నుండి వచ్చే వ్యర్థ పదార్థాలు బయటకు పంపటాన్ని ………. అంటారు.
2. పరిసర వాతావరణంలో మార్పు …………………
3. ………………… ఆవాసంలోని నిర్జీవ కారకం.
4. శరీరం, ఆధారము మరియు చేతివంపు సూక్ష్మదర్శిని యొక్క ………………… భాగాలు.
5. ……………… సజీవులు మరియు నిర్జీవుల మధ్య మధ్యంతర విషయాలు.
6. ఒక జీవి యొక్క అవసరాలను తీర్చగల పరిసరాలను …………. అంటారు.
7. దోమ లార్వా ఒక కొలను యొక్క …………… స్థానంలో కనిపిస్తుంది.
8. ……………. మన ఆవాస భాగస్వాములు.
9. విశాఖపట్నం మరియు తూర్పు గోదావరి జిల్లాల మధ్య ఉన్న మడ అడవులు …………..
10. డ్రాగన్ ఫై కొలను యొక్క భాగంలో నివసిస్తుంది.
11. ………………… మొక్కలు మరియు జంతువులకు నివాస స్థలం (ఆవాసము).
జవాబు:
- విసర్జన
- ఉద్దీపన
- మట్టి
- నిర్మాణాత్మక
- చనిపోయిన జీవులు
- ఆవాసం
- మధ్య నీటి
- జంతువులు
- కొరింగ
- ఉపరితలంపైన
- మృత్తిక
III. జతపరుచుట
కింది వానిని జతపరుచుము.
1.
Group – A | Group – B |
ఎ) జీవులు | 1) గుర్రం |
బి) అండోత్పాదకాలు | 2) రాయి |
సి) నిర్జీవి | 3) మైక్రోస్కోపు |
డి) శిశోత్పాదకాలు | 4) కాకి |
ఇ) బాక్టీరియా | 5) మొక్కలు |
జవాబు:
Group – A | Group – B |
ఎ) జీవులు | 5) మొక్కలు |
బి) అండోత్పాదకాలు | 4) కాకి |
సి) నిర్జీవి | 2) రాయి |
డి) శిశోత్పాదకాలు | 1) గుర్రం |
ఇ) బాక్టీరియా | 3) మైక్రోస్కోపు |
2.
Group – A | Group – B |
ఎ) హైడ్రిల్లా | 1) కొలను అంచు |
బి) బ్రహ్మ జెముడు | 2) ఎడారి మొక్క |
సి) మామిడి | 3) శాఖల మధ్య |
డి) కప్ప | 4) కొలను దిగువ |
ఇ) కోతి | 5) ఎడారి మొక్క |
జవాబు:
Group – A | Group – B |
ఎ) హైడ్రిల్లా | 4) కొలను దిగువ |
బి) బ్రహ్మ జెముడు | 5) ఎడారి మొక్క |
సి) మామిడి | 2) ఎడారి మొక్క |
డి) కప్ప | 1) కొలను అంచు |
ఇ) కోతి | 3) శాఖల మధ్య |
3.
Group – A | Group – B |
ఎ) విత్తనాలు | 1) మొక్కలు |
బి) పెరుగుదల | 2) నిర్జీవి |
సి) ఉద్దీపన | 3) జీవుల లక్షణం |
డి) విసర్జన | 4) బాహ్య శక్తికి ప్రతిస్పందించడం |
ఇ) రాయి | 5) వ్యర్థాలను విసర్జించటం |
జవాబు:
Group – A | Group – B |
ఎ) విత్తనాలు | 3) జీవుల లక్షణం |
బి) పెరుగుదల | 1) మొక్కలు |
సి) ఉద్దీపన | 4) బాహ్య శక్తికి ప్రతిస్పందించడం |
డి) విసర్జన | 5) వ్యర్థాలను విసర్జించటం |
ఇ) రాయి | 2) నిర్జీవి |
మీకు తెలుసా?
“జీవించు -జీవించనివ్వు”
→ జంతువులూ మన ఆవాసంలో భాగమే. వాటికి కూడా జీవించే హక్కు ఉంది. మనం వాటి ఆవాసాలనే ఆక్రమించేస్తున్నాం. ఒక చెట్టును కాని మనం నరికేస్తే ఆ చెట్టుపై గూడు కట్టుకుని జీవిస్తున్న అనేక పక్షులు ప్రమాదంలో పడినట్లే. మనం ఒక్కోసారి కుక్కలు, పిల్లులు, కోతులు ఆహారం, నివాసం.లేక బాధపడుతూ తిరగడం చూస్తుంటాం. కొన్ని స్వచ్ఛంద సంస్థలు జంతువుల హక్కులు, వాటి సంరక్షణ కోసం పనిచేస్తున్నాయి. వాటికి మనం కూడా ఆహారాన్ని అందించి సంరక్షించాలి. దీనిని మన బాధ్యతగా మనం భావించాలి.
→ బ్రహ్మజెముడు, తుమ్మ, కలబంద మొక్కలకు ఎక్కువ నీరు అవసరం లేదు. వీటిని ఎడారి మొక్కలు అంటారు. మనం ఎడారిలో ఒంటెలను చూస్తూ ఉంటాం. ఎడారి మొక్కలు, జంతువులు పొడి పరిస్థితులకు, విస్తారమైన ఉష్ణోగ్రత వ్యత్యాసాలకు అనుకూలంగా ఉంటాయి. ఎడారిలోని విభిన్న లక్షణాలు ఎడారిని ఆవాసంగా మారుస్తాయి.
→ ఎక్కడో సుదూర ప్రదేశాల నుండి పక్షులు మన రాష్ట్రంలోని కొల్లేరు, పులికాట్ సరస్సులకు ప్రతి సంవత్సరం వస్తుంటాయి. అక్టోబర్ నుండి మార్చి వరకు ఈ సరస్సులకు పెలికాన్ పక్షులు వస్తాయి. సాధారణంగా పక్షులు ప్రత్యుత్పత్తి జరుపుకోవడం కోసం దూర ప్రాంతాలకు ఎగిరి వెళుతుంటాయి. తాబేళ్లు, చేపలు వంటి జంతువులు కూడా గుడ్లు పెట్టటం కోసం ఒకచోటి నుండి మరొకచోటికి వెళుతుంటాయి. కొన్ని సముద్ర తాబేళ్ళు పశ్చిమ బంగ, ఒడిశా తీరప్రాంతాల నుండి విశాఖపట్నం తీరానికి ప్రయాణించి వస్తుంటాయి.
పులస చేపను గురించి ఎపుడైనా విన్నారా? వీటి గురించిన సమాచారాన్ని సేకరించండి. పులస చేపలు ఏ విధంగా మరియు ఎందుకని ఋతువుల ఆధారంగా తమ ఆవాసాన్ని మార్చుకుంటున్నాయి?