AP 6 Science

AP 6th Class Science Notes Chapter 11 విద్యుత్ వలయాలు

AP 6th Class Science Notes Chapter 11 విద్యుత్ వలయాలు

AP Board 6th Class Science Notes 11th Lesson నీడలు – ప్రతిబింబాలు

→ వస్తువులను చూడటానికి మనకు కాంతి అవసరం.

→ కాంతిని ఇచ్చే పదార్థాన్ని కాంతి జనకంగా పిలుస్తారు.

→ అపారదర్శక వస్తువులు కాంతి మార్గాన్ని అడ్డుకున్నప్పుడు నీడలు ఏర్పడతాయి.

→ కాంతి మరియు వస్తువుతో పాటు, అపారదర్శక వస్తువు యొక్క నీడను పొందటానికి మనకు తెర కూడా అవసరం.

→ వస్తువులను వాటి నీడలను చూడటం ద్వారా వస్తువుల రంగును నిర్ణయించలేము.

→ కాంతి సరళరేఖలో ప్రయాణిస్తుంది.

 

→ ఏదైనా వస్తువుపై కాంతి పడినప్పుడు కాంతి పరావర్తనం చెందుతుంది.

→ నీడల ఆకారాలు గమనించడం ద్వారా కాంతి సరళ రేఖలో ప్రయాణిస్తుందని ప్రజలు అర్థం చేసుకున్నారు.

→ ఒక వస్తువు ప్రతిబింబం నీడ నుండి భిన్నంగా ఉంటుంది.

→ కాంతి : కాంతి అనేది శక్తి వనరు, ఇది దృష్టి జ్ఞానాన్ని కలిగిస్తుంది.

→ కాంతి జనకం : కాంతిని ఇచ్చే పదార్థాన్ని కాంతి జనకం అంటారు.
ఉదా : సూర్యుడు.

→ నీడ : కాంతి నిరోధము వలన ఏర్పడే చీకటి ప్రాంతాన్ని నీడ అంటాము. అపారదర్శక పదార్థాన్ని కాంతి మార్గంలో ఉంచినపుడు నీడలు ఏర్పడతాయి.

→ పారదర్శక పదార్థాలు : గాజు మరియు గాలి వంటి పదార్థాలు వాటి ద్వారా కాంతిని అనుమతిస్తాయి. అందువల్ల వాటి నీడలు ఏర్పడవు. ఇటువంటి పదార్థాలను పారదర్శక పదార్థాలు అంటారు.

 

→ అపారదర్శక పదార్థాలు : కొన్ని పదార్థాలు వాటి గుండా కాంతిని అనుమతించవు. వీటిని అపారదర్శక పదార్థాలు అంటారు.

→ పాక్షిక పారదర్శక పదార్థాలు : పాలిథీన్ కవర్ మరియు నూనె పూసిన కాగితం వంటి పదార్థాలు పాక్షికంగా కాంతిని తమ గుండా వెళ్ళడానికి అనుమతిస్తాయి. వాటి నీడలు అస్పష్టంగా ఉంటాయి. వీటిని పాక్షిక పారదర్శక పదార్థాలు అంటారు.

→ పినహోల్ కెమెరా : పినల్ కేమెరా అనేది కటకం లేని సాధారణ కెమెరా. కాని దీనిలో చిన్న రంధ్రము కటకం వలె పనిచేస్తుంది.

→ ప్రతిబింబం : కాంతి వక్రీభవనం లేదా పరావర్తనం వలన ఏర్పడే దృశ్యం.

→ పరావర్తనం : ఉపరితలం తాకి కాంతి లేదా ధ్వని తరంగాలు తిరిగి అదే యానకంలోనికి ప్రయాణించటం.

The Complete Educational Website

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *