AP 6 Science

AP 6th Class Science Notes Chapter 12 కదలిక – చలనం

AP 6th Class Science Notes Chapter 12 కదలిక – చలనం

AP Board 6th Class Science Notes 12th Lesson కదలిక – చలనం

→ జీవులు కదలిక మరియు స్థాన చలనం చూపిస్తాయి.

→ శరీరం లేదా దాని భాగాలను దాని అసలు స్థానం నుండి తాత్కాలికంగా గాని, శాశ్వతంగా గాని మారే ప్రక్రియను కదలిక అంటారు.

→ మొత్తం శరీరం ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి మారే ప్రక్రియను స్థాన చలనం అంటారు.

→ స్థాన చలనం రక్షణ మరియు ఆహార సేకరణకు సహాయపడుతుంది.

→ మన శరీరంలోని వివిధ కండరాలు వేర్వేరు విధులను నిర్వహిస్తాయి.

→ కండరాలు ఎముకలతో నేరుగా లేదా స్నాయువుల సహాయంతో అనుసంధానించబడతాయి. కండరాలు జతలుగా పనిచేస్తాయి. వాటిలో ఒకటి సంకోచించినప్పుడు, ఎముక ఆ దిశగా లాగబడుతుంది. అప్పుడు జతలోని ఇతర కండరాలు సడలించబడతాయి.

 

→ మన శరీరంలోని వివిధ ఎముకలు కలవటం వలన అస్థిపంజరం అనే నిర్మాణం ఏర్పడుతుంది.

→ రెండు ఎముకలు కలిసే ప్రదేశాన్ని కీలు అంటారు.

→ కీళ్ళు రెండు రకాలు. అవి కదిలే కీళ్ళు మరియు కదలని కీళ్ళు.

→ కదిలే కీళ్ళు నాలుగు రకాలు. అవి 1) బంతి గిన్నె కీలు, 2) మడత బందు కీలు, 3) జారెడు కీలు, 4) బొంగరపు కీలు.

→ స్నాయుబంధనాలు (టెండాన్లు) ఎముకలను కండరాలతో కలుపుతాయి.

→ సంధిబంధనం (లిగమెంట్) ఒక ఎముకను మరొక ఎముకతో కలుపుతుంది. మన వెన్నెముక ఒక స్ప్రింగ్ లా పనిచేస్తుంది.

→ పై దవడ మరియు పుర్రె మధ్య కదలని కీళ్ళు ఉంటాయి.

→ చేపలలో పడవ వంటి ఆకారం, వాజాలు; పక్షులలో రెక్కలు, కాళ్ళు; పాములలో పక్కటెముకలు; నత్తలలో కండర నిర్మిత పాదం చలనానికి తోడ్పడతాయి.

→ కదలిక : ఒక జీవి యొక్క శరీరం లేదా దాని భాగాలు యథాస్థానం నుండి శాశ్వతంగా గాని లేదా తాత్కాలికంగా గాని మారే ప్రక్రియను కదలిక అంటారు.

→ స్థాన చలనం : జీవి శరీరం మొత్తం ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి కదలటం.

→ ఎముకలు : ఎముక అనేది శరీరానికి ఆధారాన్ని అందించే అస్థిపంజరాన్ని ఏర్పరచే గట్టి కణజాలం.

 

→ కండరాలు : కండరాలు శరీరానికి ఆకారాన్ని ఇస్తూ కదలికకు సహాయపడే మృదు కణజాలం.

→ సంధిబంధనం (లిగమెంట్) : రెండు ఎముకలను కలిపే సంధాయక కణజాలం.

→ స్నాయుబంధనం (టెండాన్) : కండరాలను ఎముకతో కలిపే సంధాయక కణజాలం.

→ మృదులాస్థి : ముక్కు మరియు చెవి కొనలో మృదువైన ఎముక.

→ వెన్నెముక : శరీరానికి వెనుక మధ్య భాగంలో ప్రయాణించే పొడవైన నిర్మాణాన్ని వెన్నెముక అంటారు.

→ వెన్నుపూస : వెన్నెముకను తయారుచేసే చిన్న ఎముకలను వెన్నుపూసలు అంటారు.

→ వెన్నుపాము : వెన్నెముకలోని వెన్నుపూసల గుండా ప్రయాణించే నాడీ సంబంధ భాగం.

→ జత్రుక : దీనిని కాలర్ బోన్ అని కూడా పిలుస్తారు. ఇది మెడ మరియు భుజం ఫలకం మధ్య ఉండే పొడవైన ఎముక.

→ కీలు : రెండు ఎముకలు కలిసే ప్రాంతాన్ని కీలు అంటారు.

→ స్థిరమైన కీళ్ళు : పుర్రె ఎముకల మధ్య కీళ్ళు కలిసిపోతాయి. వాటిని స్థిర కీళ్ళు అని కూడా అంటారు. ఇక్కడ కదలిక ఉండదు.

→ పక్కటెముకలు : ఛాతీ ప్రాంతంలో ఉన్న 12 జతల ఎముకలు.

→ ఉరఃపంజరము : పక్కటెముకలు ముందుకు వంగి ఉంటాయి. ఇవి ముందు వైపు ఛాతీ ఎముకను మరియు వెనుక వెన్నెముకను కలిపి ఒక పెట్టె వంటి నిర్మాణాన్ని ఏర్పరుస్తాయి. దీనిని ఉరఃపంజరం అంటారు.

→ కటి వలయం : కాలి ఎముకలు కలిసిన నడుము వద్ద వృత్తాకార నిర్మాణం గల ఎముక ఉంటుంది. దీనికి కాలి ఎముకలు అతికి ఉంటాయి. ఈ గుండ్రటి ఎముకను కటి వలయం అంటారు.

→ బంతి గిన్నె కీలు : ఇది కదిలే కీలులో ఒక రకం. ఒక ఎముక యొక్క గుండ్రని కప్పు వంటి భాగంలో మరో ఎముక యొక్క గుండ్రని నిర్మాణం ఇమిడి ఉంటుంది. ఈ కీలు అన్ని దిశలలో కదలికను అనుమతిస్తుంది. ఇది భుజం మరియు కాలు ప్రారంభంలో ఉంటుంది.

 

→ మడత బందు కీలు : ఎముకలు ఒక దిశలో కదలడానికి సహాయపడే కీలుని మడత బందు కీలు అంటారు.
ఉదా : మోచేయి, మోకాలు దగ్గర ఉండే కీలు.

→ జారెడు కీలు : ఎముకలు ఒకదానిపై ఒకటి జారిపోయే కీళ్లను జారెడు కీళ్ళు అంటారు. ఇవి మణికట్టు, కాలి మడమ వద్ద ఉంటాయి.

→ బొంగరపు కీలు : పుర్రె, వెన్నెముకలో కలిసే ప్రాంతంలో ఏర్పడే కీలును బొంగరపు కీలు అంటారు.

The Complete Educational Website

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *