AP 6th Class Social Important Questions Chapter 2 గ్లోబు – భూమికి నమూనా
AP 6th Class Social Important Questions Chapter 2 గ్లోబు – భూమికి నమూనా
AP Board 6th Class Social 2nd Lesson Important Questions and Answers గ్లోబు – భూమికి నమూనా
ప్రశ్న 1.
భూ అక్షం అనగా నేమిటి?
జవాబు:
భూమి తన చుట్టూ తాను తిరగటానికి ఉత్తర దక్షిణ ధృవాల గుండా పోయే ఊహారేఖను భూమియొక్క అక్షం అని పిలుస్తారు.
ప్రశ్న 2.
గ్లోబు యొక్క ఆవిర్భావ చరిత్రను వివరించండి, గ్లోబు యొక్క ఉపయోగాలు తెల్పండి.
జవాబు:
- పురాతన ఖగోళ గోబును 1492లో మార్టిన్ బెహెమ్ రూపొందించాడు. మరొక ఆధునిక ఖగోళ గోబును కానిస్టాంట్ నోపిల్ అబ్జర్వేటరీ నందు 1570 సంవత్సరంలో “టకి-ఆల్-దిన్” రూపొందించాడు.
- ప్రపంచంలో మొట్టమొదటి అతుకులు లేని ఖగోళ గ్లోబును జహంగీర్ సామ్రాజ్యంలో మొఘల్ శాస్త్రవేత్తలు రూపొందించారు.
- గ్లోబల్ అనే పదం ‘గ్లోబస్’ అనే లాటిన్ పదం నుండి వచ్చింది. గోళం అని దాని అర్థం.
ఉపయోగాలు:
- భూమి ఆకారాన్ని చక్కగా చూపుతుంది. ఖండాలు, మహాసముద్రాలను చూపుతుంది.
- భూభ్రమణాన్ని చూపిస్తుంది. ప్రపంచంలోని దేశాలను చూపిస్తుంది.
ప్రశ్న 3.
ఉత్తర మరియు దక్షిణార్ధగోళాలు అంటే ఏవి? చిత్రం ద్వారా చూపించండి.
జవాబు:

గ్లోబుకు మధ్యభాగంలో అడ్డంగా గ్లోబును రెండు సమభాగాలు చేస్తూ ఒక ఊహారేఖ పోతుంది. దీనిని భూమధ్యరేఖ (0° అక్షాంశం) అంటారు. భూమధ్యరేఖకు ఉత్తరంగా ఉన్న అర్ధభాగాన్ని ఉత్తరార్ధ గోళమని, భూమధ్యరేఖకు దక్షిణంగా ఉన్న అర్ధభాగాన్ని దక్షిణార్ధ గోళమని అంటారు.
ప్రశ్న 4.
అక్షాంశాలు అనగానేమి? ముఖ్యమైన అక్షాంశాలను గూర్చి వివరించండి.
జవాబు:
భూమధ్యరేఖకు సమాంతరంగా ఉన్న ఊహారేఖలను అక్షాంశాలు అంటారు. అక్షాంశం (Latitude) అను పదం లాటిట్యూడో (Latitudo) అనే లాటిన్ పదానికి చెందినది. దీని అర్థం వెడల్పు, మందం, పరిధి, పరిమాణం.
మీరు గ్లోబును నిశితంగా పరిశీలించినట్లయితే భూమధ్యరేఖకు సమాంతరంగా గీసిన కొన్ని రేఖలను చూడవచ్చును. ఇవే అక్షాంశాలు. ఇవి ఒకదానికొకటి సమాంతరంగా ఉంటూ ఒకదానికొకటి ఎప్పటికీ కలవవు. అక్షాంశాలు భూమధ్యరేఖకు (0″ నుండి 90° వరకు, దక్షిణంగా (0°నుండి 90 వరకు విస్తరించి ఉంటాయి. భూమధ్యరేఖకు ఉత్తరంగా 90° అక్షాంశాలు, దక్షిణంగా 90° అక్షాంశాలు ఉన్నాయి. ధృవాలు తప్ప అన్ని అక్షాంశాలు వృత్తాలు.
ఉత్తర ధృవం, ఆర్కిటిక్ వలయం, కర్కటరేఖలు ఉత్తరార్ధ గోళంలోని ముఖ్యమైన అక్షాంశాలు. రెండవ వైపున దక్షిణ ధృవం, అంటార్కిటిక్ వలయం, మకర రేఖలు దక్షిణార్ధ గోళంలోని ముఖ్యమైన అక్షాంశాలు. భూమి యొక్క వాతావరణ విభజనను అక్షాంశాల సహాయంతో అధ్యయనం చేయవచ్చు.
ప్రశ్న 5.
రేఖాంశాలు అంటే ఏమిటి ? ముఖ్యమైన రేఖాంశాలను గూర్చి వివరించండి. తూర్పు, పశ్చిమార్ధగోళాలు అని వేటినంటారు?
జవాబు:
ఉత్తర, దక్షిణ ధృవాలను కలిపే అర్ధవృత్తాలను రేఖాంశాలంటారు. లాంగిట్యూడ్ (Longitude) అనే పదం Longitudo అనే లాటిన్ పదానికి సంబంధించినది. నిడివి, వ్యవధి పొడవు అని దీని అర్థం.
గ్లోబు మీద అక్షాంశాలకు లంబంగా గీసినట్లు ఉన్న కొన్ని రేఖలను మనం చూస్తాం. ఈ రేఖలు ఉత్తర, దక్షిణ ధృవాలను అనుసంధానిస్తాయి. వీటిని రేఖాంశాలు అని అంటారు. ఈ
రేఖాంశాలను మధ్యాహ్న రేఖలు అంటారు. (0° రేఖాంశాన్ని ముఖ్య రేఖాంశం / ప్రామాణిక రేఖాంశం (Prime – Meridian) లేదా గ్రీనిచ్ రేఖాంశం అని అంటారు. ఈ రేఖాంశానికి వ్యతిరేక దిశలో 180° రేఖాంశం ఉంటుంది. దీనిని అంతర్జాతీయ దినరేఖ (International Date Line) అంటారు. ఈ రెండు రేఖల ఆధారంగా భూమిని రెండు అర్ధగోళాలుగా విభజించారు. గ్రీనిచ్ (Greenwich) రేఖాంశానికి తూర్పుగా ఉన్న అర్ధగోళాన్ని తూర్పు అర్ధగోళమని, పశ్చిమంగా ఉన్న అర్ధగోళాన్ని పశ్చిమార్ధ గోళమని అంటారు.
ప్రశ్న 6.
రాత్రి, పగలులు, ఎలా ఏర్పడతాయి వివరించండి.?
జవాబు:
భూభ్రమణం వలన రాత్రి పగలు ఏర్పడతాయి. భూభ్రమణ సమయంలో అంటే భూమి తన అక్షంపై తాను తిరిగేటప్పుడు సూర్యునికి ఎదురుగా ఉన్న అర్ధగోళంపై వెలుతురుపడి కాంతివంతంగాను, మిగిలిన అర్ధభాగం చీకటిలోనూ ఉంటుంది. సూర్యకాంతిపడిన అర్ధభాగమే పగలు, మిగిలిన అర్ధభాగం రాత్రి. భూమి తన చుట్టూ తాను తిరుగుతున్నప్పుడు కాంతిలో ఉన్న భాగం కొద్దికొద్దిగా చీకటిలోనికి, చీకటిలో ఉన్న భాగం క్రమేపి వెలుతురులోనికి జరుగుతుంది. అందుచేతనే రాత్రి పగలు ఒకదాని తరువాత ఒకటి సంభవిస్తాయి. భూమి ఒకసారి తన చుట్టూ తాను తిరిగిరావటానికి 23 గంటల 56 నిమిషాల 4.09 సెకండ్లు (సుమారు 24 గంటలు) సమయం అనగా ఒక రోజు పడుతుంది.
ప్రశ్న 7.
ఋతువులు ఎలా ఏర్పడతాయి? చిత్రం ద్వారా వివరించండి.
జవాబు:
పై చిత్రం ననుసరించి భూమి సూర్యుని చుట్టూ దీర్ఘ వృత్తాకార కక్ష్యలో తిరుగుతున్నట్లు స్పష్టమవుతుంది. కక్ష్య అంతటా భూమి ఒకేదిశలో వంగి ఉంటుంది. ఒక సంవత్సరం సాధారణంగా వేసవికాలం, శీతాకాలం, వసంతకాలం మరియు శరదృతువులుగా విభజించబడుతుంది. సూర్యుని చుట్టూ భూమి తిరిగే స్థితులలో మార్పురావటం వలన ఋతువులు ఏర్పడతాయి.
పై చిత్రంలో జూన్ 21వ తేదీన ఉత్తరార్ధగోళం సూర్యునివైపు వంగి ఉన్నట్లు మీరు చూస్తారు. కర్కటరేఖ మీద సూర్యకిరణాలు నిట్టనిలువుగా పడటం వలన ఈ ప్రాంతాలు ఎక్కువ వేడిని గ్రహిస్తాయి. ఇదే సమయంలో సూర్య కిరణాలు ఏటవాలుగా ధృవప్రాంతాలపై పడటం వలన తక్కువ వేడిని గ్రహిస్తాయి.
ఉత్తరధృవం సూర్యునివైపు వంగి ఉండటం వలన ఆర్కిటిక్ వలయం నుండి ఉత్తరధృవం వరకు పగటికాలం నిరంతరంగా 6 నెలలు ఉంటుంది. దీనివలన ఉత్తరార్ధగోళంలో ఎక్కువ ప్రాంతం సూర్యుని నుండి కాంతిని పొందుతుంది. అందువలన భూమధ్యరేఖకు ఉత్తరంగా ఉన్న ప్రాంతంలో వేసవికాలం ఏర్పడుతుంది. ఇక్కడ జూన్ 21వ తేదీ పగటికాలం అత్యధికంగాను, రాత్రి నిడివి అతి తక్కువగానూ ఉంటుంది. ఇదే సమయంలో దక్షిణార్ధగోళంలో పరిస్థితులు ఇందుకు భిన్నంగా ఉంటాయి. ఇక్కడ చలికాలం ఉంటుంది. పగటి సమయం కంటే రాత్రి సమయం ఎక్కువగా ఉంటుంది. భూమి యొక్క స్థితి ఇలా ఉండటాన్ని వేసవి అయనాంతం (Summer Solstice) అంటారు.
దక్షిణ ధృవం సూర్యునివైపు వాలి ఉండటం వలన డిసెంబరు 22వ తేదీన సూర్యకిరణాలు మకరరేఖ మీద నిట్టనిలువుగా పడతాయి. మకరరేఖపై సూర్యకిరణాలు నిట్టనిలువుగా పడటం వలన దక్షిణార్ధగోళంలో ఎక్కువ భాగం కాంతిని పొందుతుంది. అందువలన దక్షిణార్ధగోళంలో వేసవికాలం (Summer) తీవ్రంగా ఉండి పగటికాలం — ఎక్కువగానూ, రాత్రి సమయం తక్కువగాను ఉంటుంది. ఇందుకు భిన్నంగా ఉత్తరార్ధగోళంలో ఉంటుంది. భూమి యొక్క స్థితి ఇలా ఉండటాన్ని శీతాకాల అయానంతం (Winter Solstice) అంటారు.
ప్రశ్న 8.
గ్రహణాలు అనగానేమి? గ్రహణాలు ఎన్ని రకాలు?
జవాబు:
సూర్యుని చుట్టూ భూమి, భూమి చుట్టూ చంద్రుడు తిరుగుతున్నాయని మనం చదువుకున్నాం. అవి ఇలా తిరిగేటప్పుడు ఒకే సరళరేఖ పైకి అవి వచ్చినప్పుడు సూర్యగ్రహణం లేక చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఈ గ్రహణాల సమయంలో సూర్యునిపైన లేదా చంద్రునిపైన నీడపడినట్లు కనబడుతుంది. గ్రహణాలు రెండు రకాలు.
ప్రశ్న 9.
సూర్యగ్రహణం ఎప్పుడు సంభవిస్తుంది?
జవాబు:
భూమికి మరియు సూర్యునికి మధ్యలో చంద్రుడు వస్తే సూర్యగ్రహణం సంభవిస్తుంది. సూర్యుని కాంతి భూమి మీద పడకుండా అడ్డుకోవటంతో పాటు చంద్రుని నీడ భూమి యొక్క ఉపరితలంపై ప్రయాణిస్తుంది. సూర్యగ్రహణం అమావాస్య రోజున మాత్రమే సంభవిస్తుంది. అయితే అన్ని అమావాస్య రోజులలో అది సంభవించదు.
ప్రశ్న 10.
చంద్రగ్రహణం ఎప్పుడు సంభవిస్తుంది?
జవాబు:
ఏ సమయంలోనైనా భూమి సగభాగం మాత్రమే సూర్యునికి ఎదురుగా ఉంటుంది. మిగిలిన సగభాగం నీడలో అనగా చీకటిలో ఉంటుంది. చంద్రుడు భూమి యొక్క వెనుకభాగంలో లేదా భూమి నీడలోనికి వెళ్ళినప్పుడు చంద్రగ్రహణం సంభవిస్తుంది. సూర్యుడు, భూమి, చంద్రుడు చాలా దగ్గరగా మరియు సూర్యునికి చంద్రునికి మధ్య భూమి ఖచ్చితంగా వచ్చినప్పుడే చంద్రగ్రహణం సంభవిస్తుంది. పౌర్ణమి రోజులలో మాత్రమే చంద్రగ్రహణం సంభవిస్తుంది. అయితే అన్ని పౌర్ణమి రోజులలో చంద్రగ్రహణం సంభవించదు.
ప్రశ్న 11.
క్రింది పటం దేనిని తెలియజేస్తుంది?
జవాబు:
1) భూమి యొక్క చలనమును.
2) రాత్రి, పగలు ఏర్పడుటను తెలియజేస్తుంది.
ప్రశ్న 12.
భూ పరిభ్రమణం అనగానేమి? భూమి కక్ష్య అంటే ఏమిటి? దీనిని గురించి సవివరంగా చర్చించండి.
జవాబు:
భూమి తన అక్షంపై తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరిగి రావడాన్ని “భూపరిభ్రమణం” అంటారు. భూమి సూర్యుని చుట్టూ తిరిగే నిర్ణీత మార్గాన్ని “క్య” అంటారు. ఈ “క్ష్య” దీర్ఘవృత్తాకారంలో ఉంటుంది. ఈ కక్ష్య పొడవు 965 మిలియన్ కిలోమీటర్లు. భూపరిభ్రమణానికి ఒక సంవత్సరకాలం పడుతుంది. ఖచ్చితంగా చెప్పాలంటే 365 4 రోజుల సమయం పడుతుంది. సాధారణ సంవత్సరంలో 365 రోజులు ఉంటాయి. మిగిలిన ఆ రోజును నాలుగు సంవత్సరాలకొకసారి కలిపి ఆ సంవత్సరాన్ని “లీపు సంవత్సరం” అంటారు. అందువలన లీపు సంవత్సరంలో 366 రోజులు ఉంటాయి. లీపు సంవత్సరంలో ఫిబ్రవరి నెలకు 29 రోజులు, సాధారణ సంవత్సరంలో ఫిబ్రవరి నెలలో 28 రోజులు మాత్రమే ఉంటాయి.
ప్రశ్న 13.
అంతర్జాతీయ దినరేఖ అనగానేమి?
జవాబు:
గ్రీనిచ్ రేఖాంశం నుండి ‘అంతర్జాతీయ దినరేఖ’ వరకు తూర్పుకు ఉండే రేఖాంశాలను (0 నుండి 180°తూ) తూర్పు రేఖాంశాలుగానూ, గ్రీనిచ్ రేఖాంశం నుండి అంతర్జాతీయ దినరేఖ వరకు (0°నుండి 180 పశ్చిమ) – పశ్చిమానికి ఉండే రేఖాంశాలను పశ్చిమ రేఖాంశాలుగాను పరిగణిస్తారు. వాస్తవానికి 180° తూర్పు రేఖాంశం, 180° పశ్చిమ రేఖాంశం ఒకటే. దానినే 180° అంతర్జాతీయ దినరేఖ అంటారు. 180 తూర్పు రేఖాంశాలు, 180 పశ్చిమ రేఖాంశాలు అంతర్జాతీయ దినరేఖను కలుపుకొని మొత్తం 360 రేఖాంశాలు ఉన్నాయి.
ప్రశ్న 14.
క్రింది ఫ్లోచార్టను పరిశీలించి ఇచ్చిన ప్రశ్నలకు సరియైన సమాధానములు రాయండి.
i) భూమికి నమూనా ఏది?
జవాబు:
గ్లోబు
ii) గ్రహణాలు ఏర్పడటానికి భూమి యొక్క ఏ చలనము కారణము?
జవాబు:
భూ పరిభ్రమణము
iii) పశ్చిమార్ధగోళంలో ఎన్ని అక్షాంశాలు కలవు?
జవాబు:
పశ్చిమార్ధగోళంలో అక్షాంశాలు ఉండవు. రేఖాంశాలు మాత్రమే ఉంటాయి.
iv) 180°W, E రేఖాంశాన్ని ఏమంటారు?
జవాబు:
అంతర్జాతీయ దినరేఖ.