AP 6th Class Social Important Questions Chapter 6 తొలి నాగరికతలు
AP 6th Class Social Important Questions Chapter 6 తొలి నాగరికతలు
AP Board 6th Class Social 6th Lesson Important Questions and Answers తొలి నాగరికతలు
ప్రశ్న 1.
సింధూలోయ నాగరికత ఏ ప్రాంతాల మధ్య, ఎప్పుడు వికసించింది?
జవాబు:
సింధూనది మరియు ఘగ్గర్ – హక్రా నదీ ప్రాంతంలో సింధూలోయ నాగరికత వికసించింది. ఈ నదులు ప్రవహించిన గుర్తులను ఉపగృహ దృశ్యాలు మరియు ఇతర ఆధారాల ద్వారా కనుగొనడం జరిగింది. పంజాబ్ హరియానా, గుజరాత్, రాజస్థాన్ మరియు మహారాష్ట్రలోని సుమారు 1500 ప్రదేశాలలో బయటపడినది. అంతేగాక ఆఘనిస్థాన్, పంజాబ్, సింధూ బెలూచిస్తాన్ (పాకిస్తాన్) ప్రాంతాల్లో కూడా ఈ నాగరికత బయటపడింది. హరప్పా నాగరికత క్రీ.పూ. 2500 – 1700 సంవత్సరాల మధ్య వికసించింది.
ప్రశ్న 2.
సింధూ నాగరికత నాటి పట్టణ ప్రణాళిక సౌకర్యాలను గురించి వివరిస్తూ మహాస్నానవాటిక గూర్చి ప్రాధాన్యత ఇవ్వండి.
జవాబు:

హరప్పా నాగరికత కాలం నాటి నగరాలన్నియు ప్రణాళికాబద్ధంగా నిర్మించబడినవి. నగరాలకు రక్షణగా కోటలు ఉండేవి. పట్టణాలలో విశాలమైన రహదారులు కలవు మరియు ప్రజలందరికీ మంచినీటి కొరకు బావులు ఉండేవి. మొహంజోదారోలో గొప్ప స్నానవాటిక (ప్రజలు అందరూ స్నానాలు చేయడానికి విశాలమైన కొలను) కలదు, దీనికి నాలుగు వైపుల గదులు కలవు. పవిత్రమైన మత సమ్మేళనాలు జరిగే రోజులలో ప్రజలందరూ ఒక చోటకు చేరినప్పుడు ఈ స్నానవాటికను ఉపయోగిస్తారు. హరప్పా నగరంలో ఆరు పెద్ద ధాన్యాగారాలు మరియు కార్మికులకు నివాస సముదాయాలు కలవు. లోథాల్ నగరంలో అతిపెద్ద నౌకాశ్రయం కలదు.
ప్రశ్న 3.
సింధూ ప్రజల సాంఘిక జీవనం గురించి వివరించండి.
జవాబు:
సాంఘిక జీవనం :
స్త్రీలు, పురుషులు కూడా అలంకరణ పట్ల శ్రద్ధ చూపేవారు. స్త్రీలు కంఠాభరణాలు, మోచేతి ఆభరణాలు, చేతి వేళ్ళకు రింగులు, గాజులు, చెవి రింగులు, ముక్కు పుడకలు ధరించేవారు. స్త్రీలకు అలంకరణ సామగ్రి గురించి, పరిమళద్రవ్యాల గురించి తెలుసు.
వినోదాలు :
నాట్యం, చదరంగం ఆడటం, సంగీతం, గోళీలు, పాచికలు ఆడటం సింధూ ప్రజల వినోదాలు. ఎద్దుల పోటీలు వీరి యొక్క ప్రధాన వినోదం. పిల్లలు బొమ్మలు మరియు ఎద్దుల బండ్ల బొమ్మలతో ఆడుకొనేవారు.
నైపుణ్యాలు :
చిన్న చిన్న అమ్మతల్లి విగ్రహాలను మట్టితో అందంగా తయారుచేసేవారు. నాట్యకత్తె విగ్రహం మరియు బాగా గడ్డం (పూజారి) పెంచిన వ్యక్తి యొక్క రాతి విగ్రహం వంటివి ఈ కాలంలో కనిపించేవి.
ప్రశ్న 4.
ఆర్యుల జన్మస్థానము గురించి పండితులు వెలిబుచ్చిన అభిప్రాయాలను తెల్పుము.
జవాబు:
ఆర్యుల పుట్టు పూర్వోత్తరాల గురించి అనేక సిద్ధాంతాలు కలవు. ఆర్యులు మధ్య ఆసియా, ఆర్కిటిక్ ప్రాంతం మరియు ఆర్ట్స్ పర్వతాలలోని తూర్పు భాగం నుంచి వచ్చారని కొంతమంది చరిత్రకారుల అభిప్రాయం. ఆర్యులు ఇండో యూరోపియన్ సమూహాలకు చెందినవారేనని ఒక అభిప్రాయమూ కలదు. కొంతమంది చరిత్రకారులలో ఆర్యుల స్వస్థలం భారతదేశమే అనే అభిప్రాయము కలదు.
ప్రశ్న 5.
వైదిక వాజ్మయము (వేద సాహిత్యము) గురించి నీకేమి తెలియును?
జవాబు:
1. ఋగ్వేదము :
ఋషులు సంకలనం చేసిన శ్లోకాల సముదాయం
2. యజుర్వేదము :
యజ్ఞయాగాది క్రతువులలో పాటించవలసిన నియమాల గురించి తెలియ జేయును.
3. సామవేదము :
ఇది పాటల రూపంలో ఉన్న ప్రార్థనల యొక్క సంకలనం, భారతీయ సంగీతము యొక్క మూలాలు ఇందులో కలవు.
4. అధర్వణ వేదము :
ఇది శ్లోకాలు మరియు పాటల సంకలనం. వేదాలే కాక బ్రాహ్మణాలు, ఉపనిషత్తులు, అరణ్యకాలు మరియు రామాయణ మహాభారతాలు కలవు.
5. బ్రాహ్మణాలు : వేదాలలోని శ్లోకాలు, క్రతువులు మరియు తత్వాల గురించి గద్య రూపములో కలదు.
6. అరణ్యకాలు :
విద్యావాదము, క్రతువులు, సంస్కారాల గురించి తెలియజేయును.
7. ఉపనిషత్తులు :
ఆత్మ, ప్రకృతి యొక్క రహస్యాల గురించి తెలియజేసే మాతృక గ్రంథాలు.
ప్రశ్న 6.
వేదకాలం నాటి మత విశ్వాసాల గురించి వివరించండి.
జవాబు:
తొలివేదకాలం :
ఆర్యులు దేవుడు ఒక్కడే అని నమ్మేవారు. దేవుడిని అనేక విధాలుగా ఆరాధించి చేరుకోవచ్చని నమ్మేవారు. ప్రపంచమంతా ఒకే చైతన్యం (ఆత్మ) వ్యాపించి ఉంటుందని నమ్మేవారు. ప్రతి వ్యక్తి దేవుని అంశతో జన్మించాడని వీరి నమ్మకం. వీరు యజ్ఞాలు చేసేవారు.
మలి వేదకాలం :
మతపరమైన కార్యక్రమాలు సంక్లిష్టమయ్యాయి. యజ్ఞాలు, యాగాలు తరచుగా చేసేవారు. విష్ణువు, శివుడు, స్కంధుడు మొదలైన దేవతలను పూజించేవారు. లక్ష్మి, సరస్వతి, పార్వతి మొ||న ఇతర దేవతలు ప్రాముఖ్యత పొందారు.
ప్రశ్న 7.
తొలి, మలి వేదకాలం నాటి రాజకీయ జీవనం గూర్చి తెలుపుము.
జవాబు:
తొలి వేదకాలం నాటి రాజకీయ జీవనం : ఆర్యులు తెగలుగా నివసించేవారు. తెగల నాయకుడిని ‘రాజన్’ అంటారు. రాజు నియంతలాగా పరిపాలించేవాడు కాదు. రాజుకు పరిపాలనా విషయములో సలహాలు ఇచ్చేందుకు ‘సభ’ మరియు ‘సమితి’ అను రెండు సభలు ఉండేవి. రాజు ప్రజల యొక్క సంక్షేమాన్ని చూసేవాడు.
మలి వేదకాలం నాటి రాజకీయ జీవనం :
మలి వేద కాలంలో రాజు మరింత శక్తిమంతుడైనాడు. ‘సభ’ మరియు సమితులు తమ ప్రాధాన్యతను కోల్పోయాయి. రాజరికం వారసత్వంగా మారింది. రాజులు తన రాజ్యాన్ని విస్తరించడానికి అశ్వమేథ, రాజసూయ యాగాలు చేసేవారు.
ప్రశ్న 8.
ఆర్యుల గురించి తెలుసుకోవడానికి ఆధారాలు
ఆర్యుల గురించి తెలుసుకోవడానికి ప్రధాన ఆధారం వేద సాహిత్యం
పైన ఇవ్వబడిన సమాచారం ఆధారంగా క్రింది ప్రశ్నలకు సరియైన సమాధానములు రాయండి.
1) వేదాలు ఎన్ని? అవి ఏవి?
జవాబు:
వేదాలు నాలుగు, అవి ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణవేదం
2) ఇతిహాసాలు ఎన్ని? అవి ఏవి?
జవాబు:
ఇతిహాసాలు రెండు అవి రామాయణం, మహాభారతం.
3) పై సమాచారం ఆధారంగా ఏమి తెలుసుకోవచ్చు?
జవాబు:
ఆర్యుల గురించి తెలుసుకోవచ్చు.
4) ఆది కావ్యం అని దేనినంటారు?
జవాబు:
రామాయణం.
5) మహాభారతాన్ని ఎవరు రచించారు?
జవాబు:
వేద వ్యాసుడు.