AP 6 SST

AP 6th Class Social Notes Chapter 1 సౌర కుటుంబంలో మన భూమి

AP 6th Class Social Notes Chapter 1 సౌర కుటుంబంలో మన భూమి

AP Board 6th Class Social Notes 1st Lesson సౌర కుటుంబంలో మన భూమి

→ సూర్యుడు, చంద్రుడు, రాత్రి ఆకాశంలో మెరుస్తున్న వస్తువులన్నింటినీ ఖగోళ వస్తువులు అంటారు.

→ సొంతంగా వేడి, కాంతిని కలిగి ఉండి” వాటిని పెద్ద మొత్తంలో విడుదల చేసే ఖగోళ వస్తువులను నక్షత్రాలు ” అంటారు.

→ భూమి ఒక గ్రహం. భూమికి దగ్గరగా ఉన్న నక్షత్రం సూర్యుడు.

→ భూమి వేడి, కాంతిని సూర్యుని నుండి పొందుతుంది.

→ మన సౌర కుటుంబంలో 8 గ్రహాలున్నాయి.

→ ఉత్తర దిక్కును సూచించే నక్షత్రం ధృవ నక్షత్రం.

→ సప్తర్షి నక్షత్రరాశి సహాయంతో ధృవ నక్షత్రాన్ని గుర్తించవచ్చు.

→ సూర్యుని ఉపరితలంపై దాదాపు 6000°C ఉష్ణోగ్రత ఉంటుంది.

 

→ భూమి నుండి సూర్యుడు సుమారు 15 కోట్ల కి.మీ. దూరంలో ఉంది.

→ సూర్యుడు భూమి కంటే 13లక్షల రెట్లు పెద్దగా ఉంటుంది.

→ గ్రహాలు సూర్యుని చుట్టూ తిరిగే స్థిర మార్గాలను కక్ష్య అంటారు.

→ సూర్యుడికి దగ్గరగా ఉన్న నాలుగు (బుధుడు, శుక్రుడు, భూమి, అంగారకుడు) గ్రహాలను అంతర గ్రహాలు అంటారు.

→ సూర్యునికి చివరిగా ఉన్న నాలుగు (గురుడు, శని, ఇంద్రుడు, వరుణుడు) గ్రహాలను బాహ్యగ్రహాలు అంటారు.

→ సూర్యునికి దగ్గరగా ఉన్న గ్రహం బుధుడు.

→ సూర్యునికి దూరంగా ఉన్న గ్రహం వరుణుడు.

→ శుక్రుడిని భూమికి కవల గ్రహం (ఎర్త్-ట్విన్)గా పరిగణిస్తారు.

→ గ్రహాలలో పెద్దది బృహస్పతి.

→ గ్రహాలలో చిన్నది బుధుడు.

→ భూమి సూర్యుని నుండి మూడవ గ్రహం, పరిమాణంలో ఐదవ పెద్ద గ్రహం.

→ భూమి జియోయిడ్ ఆకారం కల్గి ఉంది.

 

→ భూమి ఉపరితలం మూడింట రెండువంతుల నీటితో కప్పబడి ఉంది.

→ భూమిని నీలి గ్రహం అంటారు.

→ జీవులు జీవించడానికి అత్యంత అనుకూలమైన గ్రహం భూమి.

→ కాంతి సెకనుకు 3,00,000 కి.మీ. వేగంతో ప్రయాణిస్తుంది.

→ సూర్యుని కాంతి భూమిని చేరుకోవడానికి ఎనిమిది (8) నిమిషాలు పడుతుంది.

→ భూమి నాలుగు ప్రధాన ఆవరణలు శిలావరణం, జలావరణం, వాతావరణం, జీవావరణం కలిగి ఉంది.

→ వాతావరణంలో నత్రజని (78%) మరియు ఆక్సిజన్ (21%), కార్బన్ డయాక్సెడ్, హైడ్రోజన్, హీలియం, ఆర్గాన్, ఓజోన్ వంటి వాయువులు ఉన్నాయి.

→ గ్రహాల చుట్టూ తిరిగే ఖగోళ వస్తువులను ఉపగ్రహాలు అంటారు.

→ బుధుడు, శుక్రుడు గ్రహాలకు ఉపగ్రహాలు లేవు.

→ భూమికి కల ఏకైక ఉపగ్రహం చంద్రుడు.

→ చంద్రుడు భూమికి 3,84,000 కి.మీ. దూరంలో ఉంది.

→ చంద్రుడు భూమి చుట్టూ ఒకసారి తిరగడానికి 27 రోజులు పడుతుంది.

 

→ చంద్రుని ఉపరితలంపై అడుగు పెట్టిన మొదటి వ్యక్తి అమెరికాకు చెందిన నీల్ ఆర్న్ స్ట్రాంగ్. ఇతను జులై 21, 1969న చంద్రునిపై అడుగుపెట్టాడు.

→ అంతరిక్షంలో ఉన్న కొన్ని భారతీయ ఉపగ్రహాలు ఇన్సాట్, IRS, EDUSAT మొదలైనవి.

→ భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) శ్రీహరికోటలోని తన ప్రయోగ కేంద్రం నుండి ఉపగ్రహాలను అంతరిక్షంలోకి ప్రవేశపెడుతుంది.

→ మంగళయాన్ (మార్స్ ఆర్బిటర్ మిషన్ -MOM) అంగారక కక్ష్యకు సెప్టెంబర్ 24, 2014న చేరుకుంది.

→ అంగారక గ్రహం, బృహస్పతి కక్ష్యల మధ్య గ్రహశకలాలు కన్పిస్తాయి.

→ సూర్యుని చుట్టూ తిరిగే చిన్న చిన్న రాళ్ళను ఉల్కలు అంటారు.

→ హేలి తోకచుక్క ప్రతి 76 సం||రాలకు ఒకసారి భూమికి దగ్గరగా వస్తుంది.

→ హేలి తోకచుక్క చివరిసారిగా 1986లో కనిపించింది, మరలా ఇది 2061లో కన్పిస్తుంది.

→ కొన్ని కోట్ల నక్షత్రాల సమూహంను గెలాక్సీ అంటారు. దీనినే ‘పాలపుంత’ / ‘ఆకాశగంగ’ అనికూడా అంటారు.

→ గెలాక్సీ : కోట్లాది నక్షత్రాల సమూహం, దీనినే పాలపుంత, ఆకాశగంగా అని కూడా అంటారు.

→ గ్రహ శకలాలు : అంగారకుడు, బృహస్పతి మధ్యగల గ్రహ శిథిలాలు.

 

→ ఉల్కలు : సూర్యుని చుట్టూ తిరిగే చిన్న చిన్న రాళ్ళు.

→ ఉపగ్రహాలు : గ్రహాల చుట్టూ తిరిగే ఖగోళ వస్తువులు.

→ కక్ష్య : సూర్యుని చుట్టూ గ్రహాలు తిరిగే మార్గం.

→ జియోయిడ్ : భూమి వంటి ఆకారం.

→ శిలావరణం : రాళ్ళు, నేలలతో కూడిన భూమి యొక్క ఘన బాహ్య పొర.

→ జలావరణం : భూమిపై గల జల భాగాలు.

→ వాతావరణం : వాయువుల పొర.

→ జీవావరణం : భూమిపై గల మొక్కలు, జంతువులు, ఇతర జీవరాశి.

→ నక్షత్రరాశులు : వివిధ నక్షత్రాల సమూహాలతో ఏర్పడిన నమూనాలను నక్షత్రరాశులు అంటారు.

→ ఖగోళ వస్తువులు : సూర్యుడు, చంద్రుడు, రాత్రి ఆకాశంలో మెరుస్తున్న వస్తువులన్నింటినీ ఖగోళ వస్తువులు అంటారు.

→ నక్షత్రాలు : సొంతంగా వేడి, కాంతిని కలిగి ఉండి వాటిని పెద్ద మొత్తంలో విడుదల చేసే పెద్ద ఖగోళ వస్తువులను నక్షత్రాలు అంటారు.

→ ధృవ నక్షత్రం : ఉత్తర దిక్కును సూచించే ఉత్తర నక్షత్రంనే ధృవ నక్షత్రం అంటారు.

→ అంతర గ్రహాలు : సూర్యుడికి దగ్గరగా ఉన్న (బుధుడు, శుక్రుడు, భూమి, అంగారకుడు) నాలుగు గ్రహాలను అంతర గ్రహాలు అంటారు.

→ బాహ్య గ్రహాలు : సూర్యునికి దూరంగా ఉన్న (గురుడు, శని, ఇంద్రుడు, వరుణుడు) నాలుగు గ్రహాలను బాహ్య గ్రహాలు అంటారు.

 

→ గ్రహాలలో పెద్దది : బృహస్పతి (గురుడు)

→ గ్రహాలలో చిన్నది : బుధుడు

→ భూమికి కవల గ్రహం : శుక్రుడు

→ నీలి గ్రహం : భూమి

→ భూమికి గల ఏకైక సహజ ఉపగ్రహం : చంద్రుడు

→ తోకచుక్కలు : తల, తోకతో కనిపించే ఖగోళ వస్తువులను తోకచుక్కలు అంటారు.

→ కృత్రిమ ఉపగ్రహం : మానవులచే (శాస్త్రవేత్తలతో) కృత్రిమంగా నిర్మితమైన ఉపగ్రహం.

The Complete Educational Website

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *