AP 6th Class Social Notes Chapter 3 పటములు
AP 6th Class Social Notes Chapter 3 పటములు
AP Board 6th Class Social Notes 3rd Lesson పటములు
→ చిత్తు చిత్రంలో స్కేల్, దిక్కులు చూపకుండ గీస్తారు.
→ ప్రధాన దిక్కులు నాలుగు, మూలలు నాలుగు.
→ పటాలలో కుడిచేతివైపు పైన ‘N’ అనే అక్షరం, బాణం గుర్తు ఉంటాయి.
→ భూమిపై కల వాస్తవ దూరానికి పటంలో చూపబడిన దూరానికి గల నిష్పత్తినే స్కేలు అని పిలుస్తాం.
→ పటాలను తయారు చేసేవారిని కార్టోగ్రాఫర్లు అని పిలుస్తారు.
→ పటాల సంకలనాన్ని అట్లాస్ అని పిలుస్తారు.
→ పటాలను రాజకీయ, భౌతిక, విషయ నిర్దేశిత పటాలు అని 3 రకాలుగా వర్గీకరించవచ్చు.
→ ఆసియా ప్రపంచంలో పెద్ద ఖండం కాగా భారతదేశం అందులో ఒక భాగం.
→ పర్వతాలు, పీఠభూములు, మైదానాలు, సముద్రాలు, నదులు, ఎడారులు వంటి భౌగోళిక స్వరూపాలను భౌతిక పటాలు వివరిస్తాయి.
→ విశాల భూభాగాలను ఖండాలు అని, జలభాగాలను మహా సముద్రాలు అని పిలుస్తారు.
→ ఖండాలు 7, మహాసముద్రాలు 5 కలవు.
→ GPS అనగా గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్.
→ గ్రామాలు, నగరాలు, పట్టణాలు, జిల్లాలు, రాష్ట్రాలు మరియు దేశాల సరిహద్దులు చూపేవి రాజకీయ పటాలు.
→ కొన్ని విషయ నిర్దేశిత పటాలలో రంగులకి బదులుగా చుక్కలు, గీతలు దిద్దడం వంటి నమూనాలను కూడా ఉపయోగిస్తారు.
→ పటం, మానచిత్రం : ప్రామాణిక కొలతలతో గీసిన పటం.
→ చిత్తు పటం : పరిశీలించిన స్థలాలు, సంకేతాలు గుర్తు ఉంచుకుని స్కేలు లేకుండా గీసిన పటం.
→ ప్రణాళిక : విస్తృతమైన స్కేలుపై చిత్రించిన చిన్న ప్రదేశాన్ని సూచించునది.
→ కొలబద్ద : నేలపై సహజమైన దూరానికి, పటంలో సూచించిన దూరానికి గల నిష్పత్తిని తెలుపునది.
→ దిక్కులు : తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణ దిశలు.
→ మూలలు : రెండు దిక్కుల మధ్యగల దిశ. (ఈశాన్యం, ఆగ్నేయం, నైరుతి, వాయువ్యం)
→ దిక్సూచి : రెండు బిందువుల మధ్య దూరాన్ని కొలుచుటకు వృత్తాలు, రేఖలు గీయుటకు ఉపయోగించే పరికరం.
→ కార్టోగ్రాఫర్లు : పటాలను తయారు చేసేవారిని కార్టోగ్రాఫర్లు అంటారు.
→ అట్లాస్ : పటాల సంకలనాన్ని అట్లాస్ అని పిలుస్తారు.
→ చిహ్నాలు : మాన చిత్రాల్లో వాడు వివిధ గుర్తులు. ఇవి ప్రపంచ ప్రామాణికమైనవి.
→ ప్రధాన దిక్కులు : నాలుగు ప్రధాన దిక్కులు :
- ఉత్తరం
- దక్షిణం
- తూర్పు
- పడమర
→ విషయ నిర్దేశిత పటాలు : ఒక నిర్ణీతమైన అంశాన్ని కాని, విషయాన్ని కాని తెలిపే పటాలు.
→ GPS : గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ (మ్)
→ ఖండాలు : భూమిపై గల విశాల భూభాగాలు.
→ మహాసముద్రాలు : భూ ఉపరితలంపై విశాలంగా ఆవరించియున్న జలభాగాలు.
→ పటాల్లో రకాలు : రాజకీయ, భౌతిక, విషయ నిర్దేశిత అను మూడు రకాల పటాలు.
→ రాజకీయ పటములు : వివిధ దేశముల రాజకీయ విభాగాలు, సరిహద్దులు, రాష్ట్రాలు జిల్లాలు, ముఖ్య పట్టణాలు మొదలైనవి సూచించే పటాలు.
→ భౌతిక పటములు : వివిధ భూస్వరూపములను (పర్వతాలు, పీఠభూములు, మైదానాలు, నదులు మొదలైనవి) నిర్దిష్ట రంగులు, ఎత్తు పల్లములతో సూచించే పటాలు.
