AP 6th Class Social Notes Chapter 5 సంచార జీవనం నుండి స్థిర జీవనం
AP 6th Class Social Notes Chapter 5 సంచార జీవనం నుండి స్థిర జీవనం
AP Board 6th Class Social Notes 5th Lesson సంచార జీవనం నుండి స్థిర జీవనం
→ కొన్నివేల సం||రాలకు పూర్వం భారత ఉపఖండంలో నివసించే ప్రజలను ఆహార సేకరణ వేటగాళ్ళు అని పిలిచేవారు.
→ పురావస్తు తవ్వకాలలో లభించిన (దొరికిన) పనిముట్ల ద్వారా మనం ఆది మానవుల గురించి తెలుసుకోవచ్చు.
→ ఆది మానవులు నిప్పు కనుగొనడంతో ఆహారాన్ని వండుకొని తినే విధానానికి నాంది పలికింది.
→ ఆది మానవులు, సంచార జీవనం గడిపేవారు.
→ ఎముకలతో చేసిన పనిముట్ల బెలూమ్ గుహలలో తప్ప భారత ఉపఖండంలో ఎక్కడా దొరకలేదు.
→ గుహల గోడలపై, రాతిస్థావరాలపై ఆది మానవులు, రంగురాళ్ళను పిండి చేసి జంతువుల కొవ్వును కలిపి చిత్రాలు వేయడానికి అవసరమైన రంగులను తయారుచేసి అనేక చిత్రాలను చిత్రించారు.
→ వైయస్ఆర్ కడప జిల్లాలోని చింతకుంట గ్రామంలో 10 రాతి స్థావరాలున్నాయి.
→ ఈ రాతి స్థావరాలలో ఎరుపు, తెలుపు రంగులలో 200 పైగా చిత్రాలున్నాయి.
→ ఎరుపు రంగు చిత్రాలలో ఉన్న మూపురం ఎద్దు ఒకే ఒక గుహలో ఉంది.
→ దాదాపు 12,000 సం||రాల క్రితం ప్రపంచ వాతావరణంలో గొప్ప మార్పులు సంభవించాయి.
→ పాత రాతియుగం (పాలియోలిథిక్ యుగం) – BCE 2.6 మి|| సం||రాల నుండి BCE 10,000 సంవత్సరాల వరకు.
→ మధ్య రాతియుగం (మెసోలిథిక్ యుగం) – BCE 10,000 సం||రాల నుండి BCE 8,000 సంవత్సరాల వరకు.
→ కొత్త రాతియుగం (నియోలిథిక్ యుగం) – BCE 8,000 సం||రాల నుండి BCE 3,000 సంవత్సరాల వరకు.
→ ఆది మానవులు వ్యవసాయం ప్రారంభించటంతో స్థిర జీవనం మొదలయ్యింది.
→ ఆహార నిల్వల కొరకు మట్టి పాత్రలను, గంపలు బుట్టలు లేదా నేల మాళిగలను ఉపయోగించారు.
→ కొత్తరాతి పనిముట్లతో వ్యవసాయం చేసిన కాలాన్ని నవీన శిలాయుగం లేదా కొత్త రాతియుగం అంటారు.
→ నవీన రాతియుగ కాలంలో ప్రజలు సాంకేతికంగా ముందంజ వేసారు.
→ ప్రపంచ వ్యాప్తంగా నదీలోయ నాగరికతలు మెసపటోమియా, సింధులోయ (భారత్) మరియు చైనాలలో వర్ధిల్లాయి.
→ వరి, గోధుమ, బార్లీ, పప్పులు, పెసలు, సెనగ, మునగ పంటలను పండించారు.
→ మట్టితో, గడ్డితో చేసిన గుడిసెలలో, ఇండ్లలో నివసించేవారు.
→ గొర్రెలు, మేకలు, ఎద్దులు మొదలైన పశువులను మచ్చిక చేసుకున్నారు.
→ పురాతన సామాగ్రిని, ఎముకలు, పాత్రలు, భవనాలు, అవశేషాలను అధ్యయనం చేసేవారిని పురావస్తు శాస్త్రవేత్తలు అంటారు.
→ మన రాష్ట్రంలో (ఆం.ప్ర.)లో యానాదులు, చెంచులు తెగకు చెందిన వారు కొన్ని ప్రాంతాలలో వేటాడటం, ఆహార సేకరణ ద్వారా నేటికి జీవితాన్ని గడుపుతున్నారు.
→ వేట-ఆహార సేకరణ చేసేవారు : అడవుల నుండి ప్రకృతి సిద్ధంగా లభించే వస్తువులు, జంతువులు, పక్షులను వేటాడేవారు.
→ పశుకాపరులు : పశువులను పెంచేవారు. ఈ పురాతత్వ శాస్త్రజ్ఞుడు : తవ్వకాలలో దొరికిన పురాతన సామగ్రి, ఇతరాలను అధ్యయనం చేసేవారు.
→ స్థిర జీవనం : ఒకచోట నివసించడం. ఈ రాతి పరికరాలు : వివిధ అవసరాలకు రాతితో చేసిన పనిముట్లు.
→ రోలు – రోకలి : వ్యవసాయ ఉత్పత్తులను దంచడానికి ఉపయోగించేవి.
→ కంచు లోహం : రాగి, టిన్ లోహాల మిశ్రమం.
→ మచ్చిక చేసుకొనుట : కావలసిన మొక్కలను, జంతువులను పెంచుకోవడం.
→ సంచార జీవులు : ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి నిరంతరం సంచరించే వారిని సంచార జీవులు అంటారు.
→ పురావస్తు శాస్త్రవేత్త : ప్రాచీన కాలంలో ప్రజలు నివసించిన ప్రదేశాలలో నేలను త్రవ్వినపుడు దొరికిన పురాతన సామగ్రిని అధ్యయనం చేసేవారు.
→ పాత రాతియుగం : BCE 2.6 మిలియన్ సం||రాల నుండి BCE 10,000 సం||రాల వరకు
→ మధ్య రాతియుగం : BCE 10,000 మిలియన్ సం||రాల నుండి BCE 8,000 సం||రాల వరకు
→ కొత్త (నవీన) రాతియుగం : BCE 8,000 మిలియన్ సం||రాల నుండి BCE 3,000 సం||రాల వరకు
→ రాతి చిత్ర కళాస్థావరాలు : ప్రాచీన కాలం నాటి చిత్రకళ (ఆది మానవుల గీసిన చిత్రాలు)ను కనుగొన్న కొండ/గుహ ప్రాంతాలు.
