AP Board 6th Class Science Solutions Chapter 12 కదలిక – చలనం
AP Board 6th Class Science Solutions Chapter 12 కదలిక – చలనం
AP State Syllabus 6th Class Science 12th Lesson Questions and Answers కదలిక – చలనం
6th Class Science 12th Lesson కదలిక – చలనం Textbook Questions and Answers
Improve Your Learning (అభ్యసనాన్ని మెరుగుపరచుకుందాం)
I. ఖాళీలను పూరించండి.
1. ఎముకలతో ఉండే కీళ్ళు ……………… కు సహాయపడతాయి. (కదలికల)
2. కదలిక సమయంలో ………………. సంకోచించడం వల్ల ఎముక లాగబడుతుంది. (కండరాలు)
3. మణికట్టులో ఉండే ఎముకలు ………………. కీళ్ళ ద్వారా కలుపబడి ఉంటాయి. (మడత బందు)
II. సరైన సమాధానాన్ని గుర్తించండి.
1. కదలని కీళ్ళు ఉండే చోటు
A) మోకాలు
B) భుజం
C) మెడ
D) పుర్రె
జవాబు:
D) పుర్రె
2. బోలుగా ఉండే ఎముకలు గలది
A) ఆవు
B) పిచ్చుక
C) గేదె
D) పాము
జవాబు:
D) పాము
3. కండరాలను ఎముకలకు కలిపే దారాల వంటి నిర్మాణాలు
A) టెండాన్
B) లిగమెంట్లు
C) మృదులాస్థి
D) ఏవీకావు
జవాబు:
A) టెండాన్
4. మన తలను పైకి, కిందికి, పక్కలకు కదల్చడానికి ఉపయోగపడే కీలు
A) జారెడు కీలు
B) మడతబందు కీదు
C) బంతి గిన్నె కీలు
D) బొంగరపు కీలు
జవాబు:
D) బొంగరపు కీలు
III. ఈ క్రింది ప్రశ్నలకు జవాబులు రాయండి.
ప్రశ్న 1.
మానవ శరీరంలోని వివిధ రకాల కీళ్ళ గురించి ఒక లఘు వ్యాఖ్య రాయండి.
జవాబు:
- రెండు ఎముకలు కలిసే ప్రాంతాన్ని కీలు అంటారు.
- కీళ్ళు రెండు రకాలు. అవి కదిలే కీళ్ళు మరియు కదలని (స్థిర) కీళ్ళు.
- కదిలే కీళ్ళు నాలుగు రకాలు. అవి 1) బంతిగిన్నె కీలు 2) మడతబందు కీలు, 3) జారెడు కీలు, 4) బొంగరపు కీలు.
1) బంతి గిన్నె కీలు :
ఒక ఎముక యొక్క గుండ్రని చివరి భాగం మరొక ఎముక యొక్క గిన్నె వంటి భాగంలో అమరి ఉంటుంది. ఈ కీలులో ఎముక అన్ని వైపులకు సులభంగా తిరుగుతుంది. ఈ కీలును బంతి గిన్నె కీలు అంటారు. ఈ కీలు భుజం, తుంటి భాగాలలో ఉంటుంది.
2) మడత బందు కీలు :
ఒక తలుపు యొక్క మడత వలె ఎముకలు ఒక దిశలో కదలడానికి సహాయపడే కీళ్ళని మడత బందు కీళ్ళు అంటారు. మోచేయి మరియు మోకాలి వద్ద ఇవి ఉంటాయి.
3) జారెడు కీలు :
ఎముకలు ఒకదానిపై ఒకటి జారటానికి ఉపయోగపడే కీలును జారెడు కీలు అంటారు. ఇది వెన్నెముక, మణికట్టు మరియు చీలమండలలో ఉంటుంది.
4) బొంగరపు కీలు :
పుర్రెను వెన్నెముకకు కలిపే కీలుని బొంగరపు లేదా మెడ కీలు అంటారు. ఇది తల భారాన్ని భరిస్తుంది.
ప్రశ్న 2.
కండరాలు, ఎముకల వలన కలిగే ఉపయోగాలేవి?
జవాబు:
- కండరాలు స్థాన చలనం మరియు శరీర కదలికలకు సహాయపడతాయి. అవి శరీరానికి నిర్దిష్ట ఆకారాన్ని మరియు సౌష్టవాన్ని అందిస్తాయి.
- ఎముకలు కండరాలకు ఆధారాన్ని అందిస్తాయి. శరీర కదలికలు మరియు శరీర ఆకృతిలో కీలకపాత్ర వహిస్తాయి.
ప్రశ్న 3.
బంతి గిన్నె కీలు, మడతబందు కీళ్ళ మధ్య భేదాలేవి?
జవాబు:
బంతి గిన్నె కీలు | మడత బందు కీలు |
1) ఈ కీలులో ఒక ఎముక యొక్క గుండ్రటి చివరి భాగం మరొక ఎముక యొక్క గిన్నె వంటి భాగంలో అమరి ఉంటుంది. | 1) ఈ కీలు తలుపు యొక్క మడత వలె ఎముకలను ఒకే దిశలో కదిలించడానికి సహాయపడుతుంది. |
2) ఇది కదలికలో 360° భ్రమణాన్ని కలిగి ఉంది. | 2) ఇది దాదాపు 180° కదలికలను కలిగి ఉంది. |
3) భుజాలు మరియు తుంటి భాగాలలో ఉంటుంది. | 3) ఇది మోకాలు మరియు మోచేతుల వద్ద ఉంటుంది. |
ప్రశ్న 4.
చేప శరీరం ఈదడానికి ఎలా అనుకూలంగా రూపొందించబడింది?
జవాబు:
చేప శరీరం పడవ ఆకారంలో ఉండి, నీటిలో సులభంగా ఈదడానికి వీలుగా ఉంటుంది. చేప అస్థిపంజరం బలమైన కండరాలతో కప్పి ఉంటుంది. చేప ఈదేటపుడు శరీరంలో ముందు భాగంలోని కండరం ఒకవైపు కదిలితే తోక దానికి వ్యతిరేకదిశలో కదులుతుంది. దీని వలన ఏర్పడే కుదుపు చేప శరీరాన్ని ముందుకు తోస్తుంది. ఈ విధమైన క్రమబద్దమైన కుదుపుతో శరీరాన్ని ముందుకు తోస్తూ ఈదుతుంది. చేపతోక కూడ చలనంలో సహాయపడుతుంది.
ప్రశ్న 5.
నేను ఎవరినో ఊహించండి.
అ) నేను తలుపులు కిటికీలు కదిలినట్లుగానే అవయవాలను కదిలించడానికి పనికి వస్తాను.
ఆ) రెండు ఎముకలను కలపడానికి సహాయపడతాను.
ఇ) పుర్రెను, పైదవడను కలుపుతూ ఉంటాను.
ఈ) నేను చిన్న చిన్న ఎముకల గొలుసులా ఉంటాను.
ఉ) నేను ఎముకనూ, కండరాన్నీ కలుపుతూ ఉంటాను.
జవాబు:
అ) మడతబందు కీలు
ఆ) సంధిబంధనం (లిగమెంట్)
ఇ) కదలని కీలు
ఈ) వెన్నెముక
ఉ) స్నాయుబంధనం (టెండాన్)
ప్రశ్న 6.
ఒకవేళ మీ శరీరంలో ఎముకలు, కీళ్ళు లేనట్లయితే ఏమి జరుగుతుందో ఊహించి రాయండి.
జవాబు:
మన శరీరంలో ఎముకలు, కీళ్ళు లేకపోతే
- మన శరీరానికి ప్రత్యేకమైన ఆకారం ఉండదు.
- కదలికలు మరియు చలనము సాధ్యంకాదు.
- ఒక్కమాటలో చెప్పాలంటే మనం ఆకారం లేకుండా గుండ్రని బంతిలా ఉంటాము.
ప్రశ్న 7.
ఒకవేళ మీ వేళ్ళల్లో ఒకే ఎముక ఉన్నట్లయితే ఏమేమి సమస్యలు వస్తాయి?
జవాబు:
మనం నిత్యం చేసే అనేక పనులు చేతివేళ్ళలోని ఎముకల వలననే సాధ్యపడతాయి. మన వేళ్ళల్లో ఒకే ఎముక ఉంటే
- మనం వేళ్ళను మడవలేము.
- మనం ఏ వస్తువునూ పట్టుకోలేము లేదా వాడుకోలేము.
- దీని వలన ఆహారం తీసుకోవటం కష్టమవుతుంది.
- మనం ఏ వస్తువునూ ఉపయోగించలేము.
- జీవ పరిణామంలో మనం చాలా వెనుకబడిపోతాము.
ప్రశ్న 8.
బంతి గిన్నె కీలు చక్కని బొమ్మగీసి, భాగాలు గుర్తించండి. అది ఉండే చోటు, ఉపయోగాలు రాయండి.
జవాబు:
బంతి గిన్నె కీలు భుజము మరియు తుంటి భాగాలలో ఉంటుంది.
ఉపయోగాలు :
- చేతులు భుజానికి ఈ కీలు ద్వారా అతికి ఉండటం వల్ల చేతులను తిప్పడానికి వీలవుతుంది. తద్వారా మనం వివిధ రకాల పనులు చేయగలుగుతాం.
- తుంటి భాగాలలో తొడ ఎముక అమరి ఉండి కాళ్ళను కదపడానికి సహాయపడుతుంది. దీని వలన మనం నడవడం, పరుగెత్తడం వంటి పనులు చేయగలుగుతాం.
ప్రశ్న 9.
పక్షులలో చలనాన్ని మీరు ఎలా ప్రశంసిస్తారు?
జవాబు:
పక్షుల ఎగిరే లక్షణం గురించి నేను ఆశ్చర్యపోతాను.
వాటికి అద్భుతమైన రెక్కలు మరియు ఆకర్షణీయమైన ఈకలు ఉన్నాయి. వాటి శరీరం పడవ ఆకారంలో ఉంటుంది. ఎముకలు’ తేలికగా, బోలుగా ఉంటాయి. వాటి శరీరం గాలిలో ఎగరడానికి వీలుగా మార్పు చెంది ఉంటుంది.
ఈ ఎగిరే లక్షణం వలన దూరపు ప్రాంతాలు వెళ్ళడానికి పక్షులకు సాధ్యమౌతుంది. నాకు ఎగరడానికి రెక్కలు ఉంటే బాగా ఉంటుందని అనిపిస్తుంది.
కృత్యాలు
కృత్యం – 1
6th Class Science Textbook Page No. 133
ప్రశ్న 1.
ఈ క్రింది పనులు చేయండి :
• చేతిలో బంతి, ఎదురుగా వికెట్లు ఉన్నాయని ఊహించి, మీ చేతిలోని బంతిని వికెట్ల మీదికి విసరండి.
• కింద పడుకొని నడుము దగ్గర నుండి కాలిని గుండ్రంగా తిప్పడానికి ప్రయత్నించండి.
• మీ చేతిని మోచేయి దగ్గర, కాలిని మోకాలు దగ్గర వంచండి.
• చేతులను పక్కలకు చాచండి. కొన్ని ఆహార పదార్థాలను నమలండి, చేతులను వంచి భుజాలను తాకండి.
• అదే విధంగా ఇతర శరీర అవయవాలను కూడా కదిలించండి.
• మీ పరిశీలనను పట్టికలో నమోదు చేయండి.
జవాబు:
కృత్యం – 2
6th Class Science Textbook Page No. 134
ప్రశ్న 2.
ఎడమచేయి పిడికిలి బిగించండి. మోచేయివద్ద వంచి భుజాన్ని బొటనవేలితో తాకండి. పటంలో చూపిన విధంగా కుడిచేయితో ఎడమచేతి దండ చేయిని తాకండి.
• మీ మోచేయి పై భాగాన లోపల ఉబ్బెత్తుగా ఉన్న భాగాన్ని గుర్తించారా?
జవాబు:
అవును, ఈ ఉబ్బెత్తు నిర్మాణాన్ని కండరం అంటారు. ఇవి కదలికకు ఉపయోగపడతాయి.
కృత్యం – 3
6th Class Science Textbook Page No. 134
ప్రశ్న 3.
పటంలో చూపిన విధంగా అరచేయి నేలవైపు ఉండే విధంగా చేతిని ముందుకు చాపండి. ఈ చేతి వేళ్ళను ఒకదాని తర్వాత మరొకటి మడవండి. మళ్ళీ యథాస్థానానికి తీసుకురండి. చేతివేళ్ళు, మణికట్టు మధ్య మీ అరచేయి వెనుకభాగం పరిశీలించండి. కండరాల కదలిక గురించి అధ్యయనం చేయండి.
• వేళ్ళను మడిచి, యథాస్థానానికి తెచ్చినప్పుడు ఉపయోగపడే వివిధ రకాల కండరాలను గుర్తించగలిగారా?
జవాబు:
అవును, ఒక జత కండరాలు వేలు మడవటానికి, తెరవటానికి ఉపయోగపడుతున్నాయి.
ఇదే విధంగా కాలివేళ్లను కదిలించి కాలి కండరాల కదలికను గమనించండి.
పై కృత్యాలు చేసిన తరువాత కదిలే శరీర భాగాలకు, కండరాలకు ఏమైనా సంబంధం ఉందనిపిస్తోందా?
ఈ కింద సూచించిన పనులను చేయండి.
ఈ పనులు చేస్తున్నపుడు కండరాలలో ఏవైనా కదలికలున్నట్లు అనిపిస్తోందేమో గమనించండి.
• కనురెప్పలు టపటపలాడించడం
• బరువు ఎత్తడం
• నమలడం
• బొటనవేలు కదిలించడం
• ఉచ్ఛ్వాస, నిశ్వాసాలు
జవాబు:
పనులు | కండరాల కదలిక |
* కనురెప్పలు టపటపలాడించడం | నుదుటి కండరాలు |
* బరువు ఎత్తడం | శరీరంలోని వివిధ కండరాలు |
* నమలడం | ముఖ కండరాలు |
* బొటనవేలు కదిలించడం | ముంజేతి కండరాలు |
* ఉచ్ఛ్వాస, నిశ్వాసాలు | ఛాతీ కండరాలు |
కృత్యం – 4
6th Class Science Textbook Page No. 136
ప్రశ్న 4.
మీ స్నేహితుని నోరు తెరచి కింది దవడని కిందికి, పైకి, పక్కకు కదిలించమని అడగండి. అతని ముఖంలో కదలికలను జాగ్రత్తగా పరిశీలించండి.
– మీ స్నేహితుని చెవి దగ్గర ఎముకల్లో ఏదైనా కీలును గమనించారా?
జవాబు:
అవును, ఇక్కడ క్రింది దవడ పుర్రెతో కలుస్తుంది. ఈ క్రింది దవడ మాత్రమే పుర్రెలో కదిలే కీలు.
కృత్యం – 5
6th Class Science Textbook Page No. 136
ప్రశ్న 5.
ఒక చేతిని మడిచి నడుము దగ్గర ఉంచండి. ఇప్పుడు మెల్లగా భుజంతోపాటు చేతిని పైకి లేపండి. మరో చేతిలో వేలితో మెడనుండి భుజం వరకు జరపండి. అక్కడ ఉన్న ఎముకలను కనుక్కోవడానికి ప్రయత్నించండి. భుజం నుంచి మెడ వరకు రెండు ఎముకలు ఉంటాయి. పైకి కనిపించే ఎముకను గుర్తించడానికి ప్రయత్నించండి. దానిని జత్రుక అంటారు. దాని వెనుకవైపు ఉండే ఎముకను రెక్క ఎముక అంటారు. ఈ రెండింటిని కలిపి భుజాస్థులు. అంటారు. పటం గమనించినట్లైతే జత్రుక, రెక్కఎముక (Shoulder-blade) తో ఎక్కడ కలిసిందో చూడవచ్చు. ఇప్పుడు జత్రుక, రెక్కఎముకల మధ్య గల కీలును గుర్తించడానికి ప్రయత్నించండి.
జవాబు:
జత్రుక, రెక్క ఎముక’ మధ్య బంతి గిన్నె కీలు ఉంది.
కృత్యం – 6
6th Class Science Textbook Page No. 137
ప్రశ్న 6.
ఊపిరితిత్తుల నిండా గాలి పీల్చి, కొంతసేపు అలాగే ఉంచండి. ఛాతిలో ఉండే ఎముకలను మెల్లగా ఒత్తి చూడండి. ఎముకలు ఛాతి మధ్య నుండి వీపు వరకు ఉన్నట్లు గుర్తిస్తారు. ఇవి ఎన్ని ఉన్నాయో లెక్కించండి. వీటినే పక్కటెముకలు అంటారు. పక్కటెముకలు (ఆసక్తికరంగా) వంగి వుండి ఛాతి ఎముక, వెన్నెముకలను కలిపి ఒక పెట్టెలాంటి నిర్మాణాన్ని ఏర్పరుస్తాయి. దీనిని “ఉరఃపంజరం” అంటారు. మన శరీరంలోని కొన్ని ముఖ్యమైన అవయవాలు ఉరఃపంజరంలో ఉండి రక్షింపబడతాయి. అవి ఏమిటి?
జవాబు:
మన శరీరంలోని ముఖ్యభాగాలైన గుండె, ఊపిరితిత్తులు ఉరఃపంజరంలో రక్షించబడతాయి.
కృత్యం – 7
6th Class Science Textbook Page No. 137
ప్రశ్న 7.
మీ స్నేహితుడిని వంగి చేతులతో కాలివేళ్ళను పట్టుకోమని చెప్పండి. ఇప్పుడు అతని వీపు మధ్యభాగంలో మెడ కింది నుండి నడుము వరకు వేలితో తాకుతూ పరిశీలించండి. మీకు వీపు మధ్య భాగంలో పొడవైన ఎముకల నిర్మాణం ఉన్నట్లు తెలుస్తుంది. దీనినే ‘వెన్నెముక’ అంటారు. ఇది చిన్న ఎముకలతో ఏర్పడి ఉంటుంది. వీటిని ‘వెన్నుపూసలు’ అంటారు. వెన్నుపాము వెన్నుపూసల మధ్య నుండి ప్రయాణం చేస్తుంది.
కృత్యం – 8
6th Class Science Textbook Page No. 137
ప్రశ్న 8.
పటంలో చూపిన విధంగా రెండు చేతులతో నడుము కింది భాగంలో నొక్కండి. రెండువైపుల ఒకే విధమైన ఎముక ఉండడం గమనిస్తారు. ఈ ఎముక నిర్మాణాన్ని ‘ఉరోమేఖల’ అంటారు. ఇక్కడ కాలి ఎముకలు ఎముకల సమూహాల ద్వారా వెన్నెముక అడుగు భాగానికి అతుక్కొని ఉంటాయి. దీనినే “శ్రోణి మేఖల” అంటారు. ఇది కూర్చోవడానికి ఉపయోగపడుతుంది.
కృత్యం – 9
6th Class Science Textbook Page No. 138
ప్రశ్న 9.
ఎముకలు కదలడానికి కండరాలు ఉపయోగపడతాయని తెలుసుకున్నాం.
• ఒక ఎముకను మరొక ఎముక ఎలా కదిలిస్తుంది?
• ఎముకల మధ్య ఏమైనా అమరికలుంటాయా?
• అవయవం కదలికకు ఎముకల లిగమెంట్లు మాత్రమే సరిపోతాయా?
• మన శరీరంలోని అస్థిపంజరం పూర్తిగా ఒకే ఎముకతో తయారవుతుందా?
జవాబు:
- కీళ్ల వద్ద ఎముకలను కలుపుతూ తంతువులు ఉంటాయి. వీటి వలన రెండవ ఎముక కదులుతుంది.
- ఎముకల మధ్య ఉన్న ఈ తంతువులను లిగమెంట్లు లేదా సంధిబంధనాలు అంటారు.
- అవయవాల కదలికకు లిగమెంట్లు మాత్రమే సరిపోవు. వీటి కదలికకు కండరాలు తోడ్పడతాయి.
- లేదు. మన శరీరంలోని అస్థిపంజరం 306 ఎముకలతో ఏర్పడుతుంది.
కృత్యం – 10
6th Class Science Textbook Page No. 138
ప్రశ్న 10.
మీటరు పొడవున్న స్కేలు తీసుకోండి. మోచేయి మధ్యకు వచ్చేటట్లు చేతి కింద ఉంచండి. పటంలో చూపించినట్లు తాడుతో గట్టిగా కట్టమని మీ స్నేహితుడిని అడగండి. ఇప్పుడు మోచేయి దగ్గర వంచడానికి ప్రయత్నించండి. సాధ్యమైందా?ఎముకలు వంగవు అని మనకు తెలుసు కదా! మానవ అస్థిపంజరం అనేక ఎముకలతో ఏర్పడింది.
• ఎముకలు వంగకపోతే ఏమవుతుంది?
• మన శరీరంలోని ఎముకలు తమదైన రీతిలో కదులుతాయి. అదెలా సాధ్యమవుతుంది?
జవాబు:
- ఎముకలు వంగకపోతే జీవుల కదలిక సాధ్యం కాదు. మనం ఏ పనీ చేయలేము.
- మన శరీరంలోని ఎముకల కదలికకు కీళ్ళు, లిగమెంట్లు, కండరాలు తోడ్పడతాయి.
కృత్యం – 11
6th Class Science Textbook Page No. 139
ప్రశ్న 11.
మాడిపోయిన బల్బును, కొబ్బరి చిప్పను సేకరించండి. కొబ్బరి చిప్పను తీసుకొని దానిలో మాడిపోయిన బల్బును ఉంచండి. బల్బును అటుఇటు తిప్పండి. కొబ్బరిచిప్పలో బల్బు కావలసిన వైపుకు సులభంగా తిరుగుతుంది.
ఒక ఎముక యొక్క గుండ్రటి చివరి భాగం మరొక ఎముక యొక్క గిన్నె వంటి భాగంలో అమరి ఉంటుంది. ఈ కీలులో ఎముక అన్నివైపులా సులభంగా తిరుగుతుంది. ఈ కీలును “బంతిగిన్నె కీలు” అంటారు. ఈ కీలు భుజం తుంటి భాగాలలో ఉంటుంది.
కృత్యం – 12
6th Class Science Textbook Page No. 139
ప్రశ్న 12.
మీ చేతిని తిన్నగా చాపి, మోచేతిని మరో చేయి అరచేతితో పట్టుకోండి. మోచేతి కీలు వద్ద మీ చేతిని అన్ని దిక్కుల్లో తిప్పడానికి ప్రయత్నించండి.
• ఇది మోచేతి దగ్గర సాధ్యమేనా? లేదు. ఎందుకు?
జవాబు:
సాధ్యం కాదు. మోచేతి దగ్గర మడత బందు కీలు ఉంటుంది. ఇది చేతిని ఒక వైపుకు మాత్రమే కదలటానికి అనుమతినిస్తుంది.
• మీ ఇంట్లో ఇటువంటి మడతబందును ఎక్కడ గమనించవచ్చును?
జవాబు:
మన ఇంట్లో ఇటువంటి మడతబందును తలుపుల వద్ద గమనించవచ్చు.
కృత్యం – 13
6th Class Science Textbook Page No. 140
ప్రశ్న 13.
మీరు చక్కగా నిలబడి మోకాలు వంగకుండా అరచేతిని నేలకు ఆనించేలా వ్యాయామాలు చేస్తుంటారు. మీ శరీరంలోని ఏ భాగం ఈ కదలికలకు కారణమవుతుంది? జ. వెన్నెముక వలన ఈ కదలికలు సాధ్యమవుతాయి.
కృత్యం – 14
6th Class Science Textbook Page No. 140
ప్రశ్న 14.
మీ తలను పైకి, కిందికి, పక్కలకు కదల్చండి.
• తల కింద ఏదైనా కీలు ఉందని ఆలోచిస్తున్నారా?
జవాబు:
అవును. తల కింద కీలు ఉంటేనే కదలిక సాధ్యమౌతుంది.
• తలకు, మెడకు మధ్య కీలు లేకపోతే ఏమవుతుందో ఊహించండి.
జవాబు:
తల కింద కీలు లేకపోతే తలను పైకి, కిందకు కదిలించలేము.
కృత్యం – 15
6th Class Science Textbook Page No. 141
ప్రశ్న 15.
జంతువులు ఒకచోటు నుండి మరొక చోటుకు ఎలా కదులుతున్నాయో పరిశీలించండి. మీ పరిశీలనను పట్టికలో రాయండి.
జంతువు | చలనానికి ఉపయోగపడే శరీర భాగం | జంతువు చలించే విధానం |
ఆవు | కాళ్ళు | |
మనిషి | నడవడం, పరిగెత్తడం,…. | |
నత్త | ||
పక్షి | దుముకడం, ఎగరడం, | |
కీటకం | ||
చేప |
జవాబు:
జంతువు | చలనానికి ఉపయోగపడే శరీర భాగం | జంతువు చలించే విధానం |
ఆవు | కాళ్ళు | నడవటం, పరిగెత్తటం |
మనిషి | కాళ్ళు | నడవడం, పరిగెత్తడం,…. |
నత్త | పాదం | పాకటం |
పక్షి | కాళ్ళు, రెక్కలు | దుముకడం, ఎగరడం, |
కీటకం | కాళ్ళు, రెక్కలు | నడవటం, ఎగరటం |
చేప | వాజములు, తోక | ఈదటం, గెంతటం |
• చేపలు మానవుల లాగే ఈదుతాయా? తేడా ఏమిటి? ఏ లక్షణాలు ఈదడంలో చేపకు ఎలా సహాయపడతాయి?
జవాబు:
చేపలు ఈదే విధానానికి, మనిషి ఈదే విధానానికి తేడా ఉంటుంది. మానవుడు చేతులు, కాళ్ళను ఆడించడం ద్వారా ఈదుతాడు. చేపలు వాజాల సహాయంతో ఈదుతాయి. తోకలోని పుచ్చవాజము చేప శరీరాన్ని సమతాస్థితిలో ఉంచడానికి దోహదపడుతుంది. చేప శరీరం పడవ ఆకారంలో ఉండి నీటిలో సులభంగా ఈదడానికి వీలుగా ఉంటుంది. తోక దానికి వ్యతిరేక దిశలో కదులుతుంది. దీనివల్ల ఏర్పడే కుదుపు చేప శరీరాన్ని ముందుకు తోస్తుంది. ఈ విధంగా చేపలు నీటిలో చలిస్తాయి.
కృత్యం – 16
6th Class Science Textbook Page No. 141
ప్రశ్న 16.
పేపరుతో పడవను తయారు చేయండి. నీటిలో వదలండి. పటం (ఎ) లో చూపినట్లు కోసుగా ఉండేవైపు పట్టుకొని ముందుకు తోసి, గమనించండి. తరువాత పటం (బి)లో చూపిన విధంగా పక్కనుంచి తొయ్యండి. గమనించండి, ఏ పద్ధతిలో పడవ సులభంగా కదులుతుంది? ఎందుకో ఆలోచించండి.
జవాబు:
నీటిలో ముందుకు తోసినపుడు పడవ సులభంగా కదులుతుంది. ఎందుకంటే పటం పడవ ముందు భాగం మొనతేలి ఉంటుంది. అందువలన నీటిలో చొచ్చుకొని పోతుంది. మొనతేలిన భాగాలు ఘర్షణను సులభంగా అధిగమిస్తాయి.
ప్రాజెక్ట్ పనులు
6th Class Science Textbook Page No. 144
ప్రశ్న 1.
కీళ్ళ వ్యాధుల నిపుణుడు (ఆర్థోపెడిక్) గారిని సంప్రదించి కీళ్ళ నొప్పులకు సంబంధించిన సమాచారాన్ని సేకరించండి.
జవాబు:
మోకాలి నొప్పి అనేది కీళ్ల నొప్పుల యొక్క అత్యంత సాధారణ రూపం. ఇది ప్రపంచవ్యాప్తంగా చాలామంది ప్రజలలో కనిపిస్తుంది. మృదు కణజాల గాయాల నుండి మోకాలి నొప్పి తలెత్తుతుంది.
కీళ్ళ నొప్పుల అంశంపై వివరాలను సేకరించడానికి కీళ్ళ వ్యాధుల నిపుణుడిని (ఆర్థోపెడిక్) కలవడం జరిగింది. ఆయన అందించిన సమాచారం దిగువన ఇవ్వబడినది.
- కీళ్ళ నొప్పులు అధిక శారీరక శ్రమ, అధిక వ్యాయామం, ఎక్కువ సేపు ఆటలు ఆడటం వలన కలుగుతాయి.
- ఆర్డెటిస్ వలన కూడ కీళ్ళ నొప్పులు వస్తాయి. కీలులోని మృదులాస్థి అరిగిపోవడం వలన ఈ పరిస్థితి తలెత్తుతుంది.
- కీళ్ళ వద్ద వాపు వంటిది ఏర్పడిన సందర్భాలలోను కీళ్ళ నొప్పులు కలుగుతాయి.
- అలాగే ప్రమాదాలు జరిగినపుడు, ఏదైనా గాయం తగిలినప్పుడు కీళ్ళ నొప్పి వస్తుంది.
- వయసు పెరిగే కొద్దీ కీళ్ళ నొప్పులు కూడా పెరుగుతాయి.
- కీళ్ళ నొప్పులకు వైద్యుడు రోగ నిర్ధారణ చేసి యాంటి ఇన్‌ఫ్లమేటరీ లేదా ఇతర మందులను సూచిస్తారు.
- కీళ్ళ నొప్పులను తగ్గించడంలో ఫిజియోథెరపీ ఉపకరిస్తుంది. ఎలక్ట్రోథెరపీ, హాట్/కోల్డ్ థెరపీ, అల్ట్రాసౌండ్, ఇంటర్ ఫరెన్షియల్ కరెంట్ థెరపీ వంటి పలురకాలు ఫిజియోథెరపీ పద్ధతులు కీళ్ల నొప్పులను తగ్గించడానికి దోహదపడుతున్నాయి.
ప్రశ్న 2.
మీరు మీ ఇంటి దగ్గర నిర్వహించే వివిధ కార్యకలాపాలలో ఏయే కీళ్ళు పాల్గొంటాయో తెలిపే జాబితా పేర్కొనండి.
జవాబు:
కీళ్ళతో సంబంధం లేకుండా మనం ఎటువంటి కదలికను చేయలేము. మన రోజువారీ కార్యకలాపాలలో వాటికి కీలక పాత్ర ఉంది.
పనులు | పాల్గొనే కీళ్ళు |
1. నడవటం | మడత బందు కీళ్ళు |
2. రాయటం | జారెడు కీళ్ళు |
3. బంతి విసరటం | బంతి గిన్నె కీళ్ళు |
4. కారు నడపటం | బంతి గిన్నె కీళ్ళు మరియు మడత బందు కీళ్ళు |
5. ఆటలు ఆడటం | జారెడు కీళ్ళు, బంతి గిన్నె కీళ్ళు మరియు మడత బందు కీళ్ళు |
6. దుమకటం | బంతి గిన్నె కీళ్ళు మరియు మడత బందు కీళ్ళు |
ప్రశ్న 3.
అంతర్జాలం (ఇంటర్నెట్) నందు కోడి అస్థిపంజరం మొత్తాన్ని పరిశీలించి, వివిధ రకాల కీళ్ళు, ఎముకలు, కండరాలు, టెండాన్లు, లిగమెంట్ల జాబితా తయారుచేయండి.
జవాబు:
ప్రశ్న 4.
అంతర్జాలం (ఇంటర్నెట్) నందు మేక కీళ్ళను గుర్తించి, కీళ్ళ జాబితా తయారుచేయండి.
జవాబు:
ప్రశ్న 5.
ఎక్స్-రే ఫిల్ములను సేకరించి, అవి ఏ శరీర భాగాలకు సంబంధించినవో తెలియజేసే ఒక నివేదిక రాయండి.
జవాబు:
జారెడు కీళ్ళు :
కొద్ది కదలికను మాత్రమే అనుమతించే కీళ్ళు ఇవి. జారెడు కీళ్ళలో ఒక ఎముక మరొకదానిపైకి జారడానికి అనుమతిస్తుంది. మణికట్టులోని జారెడు కీళ్ళు వంచుటకు ఉపయోగపడతాయి. ఇవి చాలా చిన్న ప్రక్క ప్రక్క కదలికలను చేస్తాయి. చీలమండలు మరియు వెన్నెముకలలో జారెడు కీళ్ళు ఉన్నాయి.
బొంగరపు కీలు :
ఇది గుండ్రని కదలికను మాత్రమే అనుమతిస్తుంది. పుర్రెను వెన్నెముకకు కలిపే కీలుని బొంగరపు లేదా మెడ కీలు అంటారు.
బంతిగిన్నె కీలు :
ఒక ఎముక యొక్క బంతి ఆకారపు ఉపరితలం మరొకటి ఎముక గిన్నెలాంటి ఆకారంలో అమరిపోతుంది. బంతి మరియు గిన్నె కీళ్ళకు ఉదాహరణలు : తుంటి మరియు భుజం.
మడత బందు కీలు :
ఎముకల చివరలను ముందుకు మరియు వెనుకకు కదిలించడానికి ఈ కీలు ఉపయోగపడును. ఈ కీలులో కదలిక ఒకే దిశలో ఉండును.
ఉదాహరణలు :
మోకాలు మరియు మోచేతులు. పక్కటెముకలు వంగి ఉంటాయి. ఇవి ఛాతీ ఎముక మరియు వెన్నెముకలను కలిపి ఒక పెట్టెలాంటి నిర్మాణాన్ని ఏర్పరుస్తాయి. దీనిని ఉరః పంజరం అంటారు.