AP Board 6th Class Science Solutions Chapter 5 పదార్థాలు – వేరుచేసే పద్ధతులు
AP Board 6th Class Science Solutions Chapter 5 పదార్థాలు – వేరుచేసే పద్ధతులు
AP State Syllabus 6th Class Science 5th Lesson Questions and Answers పదార్థాలు – వేరుచేసే పద్ధతులు
6th Class Science 5th Lesson పదార్థాలు – వేరుచేసే పద్ధతులు Textbook Questions and Answers
Improve Your Learning (అభ్యసనాన్ని మెరుగుపరచుకుందాం)
I. ఖాళీలను పూరించండి.
1. ఒకటి కంటే ఎక్కువ పదార్థాలు కలిసి ………… ను ఏర్పరుస్తాయి. (మిశ్రమం)
2. బియ్యం నుంచి రాళ్లను వేరు చేసే పద్ధతి ………. (చేతితో ఏరి వేయటం)
3. ఏదైనా పదార్థం నేరుగా ఘనరూపం నుంచి వాయు రూపంలోకి లేదా వాయురూపం నుండి ఘనరూపంలోకి మారే ప్రక్రియ ……….. (ఉత్పతనం)
II. సరియైన సమాధానాన్ని గుర్తించండి.
1. కిందివానిలో తన ఆకారాన్ని మార్చుకోలేనిది
A) ఘన పదార్థం
B) ద్రవ పదార్థం
C) వాయు పదార్థం
D) పైవేవికావు
జవాబు:
A) ఘన పదార్థం
2. ద్రవంలో కరిగిన పదార్థాలను వేరుచేయుటకు ఉపయోగించే పద్ధతి ……….
A) తేర్చడం
B) క్రొమటోగ్రఫీ
C) స్పటికీకరణం
D) వడపోత
జవాబు:
C) స్పటికీకరణం
3. ‘క్రొమటోగ్రఫి’ వీటిని వేరు చేయడానికి వాడే పద్ధతి
A) నీటి నుంచి మట్టిని
B) రంగులను
C) నీటి నుంచి మలినాలను
D) ధాన్యం నుంచి ఊకను
జవాబు:
B) రంగులను
III. ఈ క్రింది ప్రశ్నలకు జవాబులు రాయండి.
ప్రశ్న 1.
కింది పదార్థాలతో తయారయిన వస్తువులు ఒక్కోదానికి 5 చొప్పున రాయండి.
ఎ) గాజు బి) లోహం సి) ప్లాస్టిక్ డి) చెక్క
జవాబు:
ఎ) గాజు : గాజు గ్లాసు, చేపల తొట్టి, గాజు పాత్ర, అద్దము, టేబుల్ గ్లాస్
బి) లోహం : కుర్చీ, బకెట్, సైకిల్, కారు, గడ్డపార
సి) ప్లాస్టిక్ : . ప్లాస్టిక్ కుర్చీ, డ్బ న్, వాటర్ బాటిల్, ప్లాస్టిక్ స్పూన్, గిన్నెలు
డి) చెక్క : కిటికీ, తలుపు, చెక్క బల్ల , డైనింగ్ టేబుల్, మంచం
ప్రశ్న 2.
తూర్పారపట్టిన తర్వాత చేతితో వేరుచేయవలసిన అవసరం ఉంటుందా? ఎందుకు?
జవాబు:
తూర్పారపట్టిన తర్వాత రైతులు తిరిగి చేతితో ఏరుతూ ఉంటారు. తూర్పారపట్టడం వల్ల కేవలం తేలికగా ఉండే తాలు, చెత్త వంటి పదార్థాలు మాత్రమే తొలగించబడతాయి. రాళ్లు, మట్టిపెళ్లలు బరువుగా ఉండి ధాన్యంతో పాటు క్రింద పడిపోతాయి కావున వీటిని చేతితో ఏరవలసి ఉంటుంది.
ప్రశ్న 3.
కింది సందర్భాలలో మిశ్రమం నుండి ఒక అంశాన్ని వేరుచేయాలంటే ఏ పద్ధతి ఉపయోగించాలి?
అ) మరొక దాని కంటే బరువుగా ఉన్న వాటిని
ఆ) మరొక దాని కంటే పెద్దవిగా ఉన్న వాటిని
ఇ) రంగు, ఆకారంలో వేరుగా ఉన్న వాటిని
ఈ) ఒకటి నీటిలో కరిగేది, మరొకటి నీటిలో కరగనిది ఉన్నప్పుడు
ఉ) ఒకటి నీటిలో తేలేది, మరొకటి నీటిలో తేలనిది ఉన్నప్పుడు.
జవాబు:
అ) తూర్పారపట్టటం, ముంచటం, చేర్చటం
ఆ) చేతితో ఏరివేయడం, వడపోయడం
ఇ) జల్లించడం, వడపోయడం
ఈ) కరిగించడం, స్వేదనం
ఉ) వడపోత, ముంచటం, తేర్చటం
ప్రశ్న 4.
సముద్రంలో నీటిపై ప్రయాణిస్తున్న ఒక ఓడను సిరి చూసింది. ఒక ఇనుపమేకు నీటిలో మునుగుతుందన్న విషయం ఆమెకు తెలుసు. దీనిపై సిరికి అనేక సందేహాలు ఏర్పడ్డాయి. ఆ సందేహాలు ఏమై ఉండచ్చో ఊహించి రాయండి.
జవాబు:
- ఓడ నీటిపై ఎలా తేలుతుంది?
- ఓడ దేనితో తయారవుతుంది?
- ఓడ బరువు ఎంత ఉంటుంది?
- బరువైన వస్తువులు నీటిపై ఎలా తేలతాయి?
- ఓడ బరువుకు, దాని వైశాల్యానికి సంబంధం ఉంటుందా?
- ఒక వస్తువు నీటిపై తేలాలి అంటే ఏమి చేయాలి?
ప్రశ్న 5.
మనం చెక్కతో తయారైన అనేక వస్తువులను నిత్యం వాడుతూ ఉంటాం కదా ! ఇలా చెక్కను వాడడం సరియైనదేనా? కారణం ఏమిటి? దీనికేమైనా ప్రత్యామ్నాయాలున్నాయా?
జవాబు:
మన రోజువారీ జీవితంలో తలుపులు, కిటికీలు వంటి అనేక వస్తువులు చెక్కతో తయారుచేస్తూ ఉంటాము. ఇలా చెక్కతో తయారైన వస్తువులు వాడటం అంత మంచిది కాదు, ఎందుకంటే చెక్క కలప మొక్క నుండి లభిస్తుంది. కలప కోసం మొక్కలు నరకటం వల్ల అడవుల సంఖ్య తగ్గి అనేక సమస్యలు ఏర్పడుతున్నాయి. కావున కలప వాడకం తగ్గించి దాని స్థానంలో ఇతర పదార్థాలతో తయారైన వస్తువులు వాడుకోవాలి. కలపకు బదులుగా సిమెంట్, ప్లే వుడ్, కంప్రెసర్, కార్డ్ బోర్డ్ పదార్థాలను వాడుకోవచ్చు.
ప్రశ్న 6.
స్వేదన జలాన్ని పొందే ప్రయోగ విధానాన్ని తెలియజేయండి.
జవాబు:
ఉద్దేశం :
సాధారణ నీరు నుంచి స్వేదన జలంను తయారు చేయుట.
కావలసినవి :
నీరు, శాంకవ కుప్పెలు-2, ఒంటి రంధ్రపు రబ్బరు బిరడాలు-2, రబ్బరు గొట్టం, బుస్సెన్ బర్నర్, స్టాండు.
విధానం :
ఒక శాంకవ కుప్పెను నీటితో నింపి ఒంటి ఒంటిరంధ్రపు రంధ్రపు బిరడాతో మూసివేయండి. ఒంటి రంధ్రపు రబ్బరు రబ్బరుబిరడా బిరడాతో మూసి ఉంచిన ఇంకొక శాంకవ కుప్పెను శాంకవ తీసుకోండి. రెండింటినీ రబ్బరు గొట్టంతో కలపండి. నీరు ఉన్న కుప్పెను వేడి చేయండి.
పరిశీలన :
కొంత సేపు అయిన తర్వాత రబ్బరు గొట్టం ద్వారా నీటి ఆవిరి ఖాళీ శాంకవ కుప్పెలోనికి వెళుతుంది. ఆ నీటి ఆవిరి నెమ్మదిగా నీరుగా మారుతుంది. ఈ నీటిని బర్నర్ స్వేదన జలం అంటాం. ఇది మలిన రహితమైన నీరు.
ఫలితం :
స్వేదనం ద్వారా మలినాలను నీటి నుండి తొలగించవచ్చు.
ప్రశ్న 7.
‘ఉత్పతనం’ పద్ధతిని తెలియజేసే ప్రయోగ అమరిక పటం గీసి, భాగాలు గుర్తించండి.
జవాబు:
ప్రశ్న 8.
అనేక టన్నుల ఇనుముతో తయారు చేసినదైనప్పటికీ ఓడ నీటిపై తేలుతుంది కదా ! దీన్ని తయారుచేయుటకు కావలసిన శాస్త్రీయ జ్ఞానాన్ని అందించిన శాస్త్రజ్ఞుల గూర్చి నీవేమి అనుకుంటున్నావు?
జవాబు:
మన నిత్య జీవితంలో సౌలభ్యం కోసం శాస్త్రవేత్తలు చేస్తున్న కృషిని చూస్తే ఆశ్చర్యమేస్తుంది. వారు నిరంతరం ప్రకృతిని పరిశీలిస్తూ ప్రకృతి ధర్మాలు అర్థం చేసుకుంటూ మనకు విలువైన ఆవిష్కరణ అందిస్తున్నారు. అనేక టన్నుల ఇనుము కలిగి ఉన్నప్పటికీ వాటిని నీటిపై తేలే విధంగా నిర్మించి సముద్రం మీద మన ప్రయాణం సాధ్యం చేశారు. దీనికోసం వారు మేధస్సును ఉపయోగిస్తూ మన అభివృద్ధికి తోడ్పడుతున్నారు. కావున మనం శాస్త్ర జ్ఞానాన్ని కలిగి ఉండి శాస్త్రవేత్తల కృషిని అభినందించాలి.
కృత్యాలు
కృత్యం – 1
– వస్తువులు, వాటిని తయారు చేయడానికి ఉపయోగించిన పదార్థాలు
6th Class Science Textbook Page No. 46
ప్రశ్న 1.
మీ ఇంటిలో ఉపయోగించే వస్తువుల జాబితా క్రింది పట్టికలో ఇవ్వబడినది. ఏ వస్తువు ఏ పదార్థంతో తయారై ఉంటుందో రాయండి.
(ఏ వస్తువు ఏ పదార్థంతో తయారవుతుందో తెలియకపోతే స్నేహితులతో చర్చించి రాయండి.)
వస్తువు | పదార్థం / పదార్థాలు |
1. తలుపు | చెక్క, లోహం, రబ్బరు, పెయింటు, …. |
2. తువ్వాలు | |
3. రబ్బరు | |
4. కత్తి | |
5. అద్దం | |
6. బూట్లు | |
7. నీళ్ల సీసా | |
8. కుండ |
జవాబు:
వస్తువు | పదార్థం / పదార్థాలు |
1. తలుపు | చెక్క, లోహం, రబ్బరు, పెయింటు, …. |
2. తువ్వాలు | నూలు, దారాలు |
3. రబ్బరు | రబ్బరు |
4. కత్తి | ఇనుము, చెక్క |
5. అద్దం | గాజు, ఇనుము |
6. బూట్లు | చర్మం, రబ్బరు, దారము |
7. నీళ్ల సీసా | ప్లాస్టిక్ |
8. కుండ | మట్టి |
• ఒకే పదార్థంతో తయారైన వస్తువులను గుర్తించి, రాయండి.
జవాబు:
కుండ, నీళ్ల సీసా, రబ్బరు.
• ఒకటికన్నా ఎక్కువ పదార్థాలతో తయారైన వస్తువులను గుర్తించి, రాయండి.
జవాబు:
కత్తి, తలుపు, బూట్లు, తువ్వాలు, అద్దము.
• కుర్చీ తయారీలో ఎన్ని రకాల పదార్థాలను వాడవచ్చు?
జవాబు:
కుర్చీని చెక్క లేదా ఇనుము లేదా ప్లాస్టిక్ వంటి ఒకే రకమైన పదార్థంతో తయారు చేయవచ్చు. లేదా ఇనుము, ప్లాస్టిక్ వైరు ఉపయోగించి తయారు చేసుకోవచ్చు.
కృత్యం – 2
6th Class Science Textbook Page No. 47
వివిధ పదార్థాల నుంచి తయారైన వస్తువులను గుర్తించడం
ప్రశ్న 2.
క్రింది పట్టికలోని పదార్థాలలో ఒక్కొక్క పదార్థంతో ఎన్ని వస్తువులు తయారుచేయవచ్చో వీలైనన్ని రాయండి.
పదార్థం | వస్తువులు |
1. లోహం | పాత్రలు , ……………………… |
2. ప్లాస్టిక్ | సంచులు, ……………………… |
3. గాజు | అద్దం , ……………………… |
4. చెక్క | బల్ల, ……………………… |
5. పత్తి | బట్టలు , ……………………… |
6. తోలు | బూట్లు, ……………………… |
7. పింగాణీ | కప్పులు, ……………………… |
8. రాళ్ళు | విగ్రహాలు, ……………………… |
జవాబు:
పదార్థం | వస్తువులు |
1. లోహం | పాత్రలు, గొడ్డలి, కత్తి, వాహనాలు, యంత్రాలు |
2. ప్లాస్టిక్ | సంచులు, బకెట్, డస్ట్బన్, కుర్చీ, డబ్బాలు, దువ్వెన |
3. గాజు | అద్దం, గ్లాస్, కూజా, టేబుల్ గ్లాస్, వాహన అద్దాలు |
4. చెక్క | బల్ల, తలుపు, కిటికీ, కుర్చీ, టీపాయ్, బ్యాట్ |
5. పత్తి | బట్టలు, తువాలు, కర్టెన్స్, పరుపు, దిళ్ళు |
6. తోలు | బూట్లు, చెప్పులు, బ్యాగ్, బెల్ట్, టోపీ |
7. పింగాణీ | కప్పులు, జాడీ, గిన్నెలు, పాత్రలు, ప్లేట్లు |
8. రాళ్ళు | విగ్రహాలు, రోలు, స్తంభాలు |
కృత్యం -3 కొవ్వొత్తిని వెలిగిద్దాం
6th Class Science Textbook Page No. 48
ప్రశ్న 3.
అగ్గిపుల్ల సహాయంతో కొవ్వొత్తిని మీరు చాలాసార్లు వెలిగించి ఉంటారు కదా. వెలుగుతున్న అగ్గిపుల్లను కొవ్వొత్తి యొక్క వత్తిని తాకించినప్పుడు అది వెలుగుతుంది. వెలిగే అగ్గిపుల్ల సహాయంతో, కొవ్వొత్తిని దాని వత్తిని తాకకుండా వెలిగించగలమా? ప్రయత్నిద్దాం.
ఒక సురక్షిత ప్రదేశంలో కొవ్వొత్తిని వెలిగే అగ్గిపుల్లతో వెలిగించండి. మొదటిసారి, అగ్గిపుల్ల కొవ్వొత్తికి తాకించి వెలిగించండి. సుమారు 2 నిమిషాల పాటూ వెలగనివ్వండి. తరువాత కొవ్వొత్తిని ఆర్పివేయండి. ఏమి గమనించారు? తెల్లని పొగ కొవ్వొత్తి వత్తి నుండి పైకి రావడాన్ని గమనించారా?
ఇప్పుడు వెలుగుతున్న అగ్గిపుల్లను కొవ్వొత్తి వత్తికి దగ్గరగా తీసుకురండి. కాని వత్తిని తాకకుండా చూడండి. ఏమి జరుగుతుందో గమనించండి.
• ఆరిన కొవ్వొత్తి దూరం నుంచి మంటను అందుకోగలిగిందా?
జవాబు:
కొవ్వొత్తి దూరం నుండి మంటను అంటుకోగలిగింది. కొవ్వొత్తి కాలినపుడు అది ఆవిరిగా మారి పొగ రూపంలో ఉంది. కావున కొవ్వొత్తి ఆవిరి మండుకొని కొవ్వొత్తి వెలిగింది.
• కొవ్వొత్తిని ఆర్పినప్పుడు వచ్చిన పొగ కొవ్వొత్తి యొక్క వాయు రూపమేనా?
జవాబు:
అవును. కొవ్వొత్తిని ఆర్పినప్పుడు వచ్చిన పొగ కొవ్వొత్తి యొక్క వాయు రూపమే.
కృత్యం – 4. పదార్థాల వర్గీకరణ
6th Class Science Textbook Page No. 49
ప్రశ్న 4.
మీ చుట్టుపక్కల ఉన్న వస్తువులలో ఘన, ద్రవ, వాయు పదార్థాలను గుర్తించి, క్రింద ఇవ్వబడిన పట్టికలో నమోదు చేయండి.
జవాబు:
ఘన పదార్థాలు | ద్రవ పదార్థాలు | వాయు పదార్థాలు |
రాయి | పాలు | పొగ |
బల్ల | నూనె | నీటి ఆవిరి |
గోడ | నెయ్యి | హైడ్రోజన్ |
కుర్చీ | మజ్జిగ | ఆక్సిజన్ |
సీసా | పెట్రోల్ | గాలి |
పుస్తకం | డీజిల్ | క్లోరిన్ |
కలం | నీరు | బోరాన్ |
కృత్యం – 5 నీటిలో మునిగేవి – తేలేవి
6th Class Science Textbook Page No. 49
ప్రశ్న 5.
ఒక బీకరులో నీటిని తీసుకోండి. దానిలో ఒక టమాట, వంకాయ, ఆలుగడ్డ (బంగాళదుంప), ఇనుప మేకు, స్పాంజి ముక్క చెక్క ముక్క రాయి, ఆకు, సుద్ద ముక్క కాగితం వంటివి ఒకదాని తర్వాత మరొకటి వేసి పరిశీలించండి.
వీటిలో ఏవి మునుగుతాయి? ఏవి తేలుతాయో పరిశీలించండి. మీ పరిశీలనలను క్రింది పట్టికలో నమోదు చేయండి.
జవాబు:
పరిశీలన | వస్తువులు |
మునిగేవి | రాయి, ఇనుప మేకు, మట్టి, విత్తనాలు, సబ్బు, గింజలు |
తేలేవి | చెక్క, కాగితం, ప్లాస్టిక్ బాటిల్, ఆకు, కర్ర, చెత్త |
• కొన్ని వస్తువులు నీటిలో మునుగుతాయని, కొన్ని వస్తువులు నీటిలో తేలుతాయని మనం గమనిస్తాం. ఇప్పుడు బీకరులోని నీటికి కొంచెం ఎక్కువ మోతాదులో ఉప్పు కలపండి. ఈ ఉప్పు నీటితో పై కృత్యాన్ని మరొకసారి చేయండి.
జవాబు:2
వస్తువు | పరిశీలన | ఫలితం |
రాయి | మునుగుతుంది | మునిగింది |
ఇనుపమేకు | తేలుతుంది | మునిగింది |
సుద్దముక్క | మునుగుతుంది | మునిగింది |
టమాటా | తేలుతుంది | తేలింది |
వంకాయ | తేలుతుంది | తేలింది |
బంగాళదుంప | మునుగుతుంది | మునిగింది |
స్పాంజి ముక్క | తేలుతుంది | తేలింది |
చెక్క | తేలుతుంది | తేలింది |
ఆకు | తేలుతుంది | తేలింది |
కాగితం | తేలుతుంది | తేలింది |
• ఏమి గమనించారు?
జవాబు:
ఇంతకుమునుపు చేసిన కృత్యంలో మునిగిన వస్తువులు తేలటం ప్రారంభించాయి.
• రెండు కృత్యాలలోను ఒకే విధమైన ఫలితాలు కనబడ్డాయా? చర్చించండి.
జవాబు:
లేదు. మొదటి కృత్యంలో మునిగిన కొన్ని వస్తువులు రెండవ కృత్యంలో తేలాయి. ఉప్పునీటి సాంద్రత మంచినీటి సాంద్రత కన్నా ఎక్కువగా ఉండటం వల్ల ఆ వస్తువులు పైకి తేలాయి.
కృత్యం – 6
6th Class Science Textbook Page No. 50
ప్రశ్న 6.
వెడల్పాటి మూతిగల ఒక బీకరులో నీటిని తీసుకొని దానిలో ఒక ఇనుప మేకును వేయండి. ఏమి గమనించారు?
జవాబు:
ఇనుప మేకు నీటిలో మునుగుతుంది.
• ఆ మేకును తీసివేసి ఒక ఖాళీ ఇనుప డబ్బాను నీటిలో వేయండి. ఏమి గమనించారు?
జవాబు:
ఇనుప డబ్బా నీటిలో తేలుతుంది.
• ఇదే విధంగా ఒక చెక్కముక్క నీటిలో తేలుతుంది. మరి ఒక చెక్క డబ్బా నీటిలో తేలుతుందా?
జవాబు:
మునుగుతుంది.
పై కృత్యం ఆధారంగా కొన్ని వస్తువులు ఒక ఆకారంలో ఉన్నప్పుడు నీటిలో తేలుతాయి. కాని వాటి ఆకారం మారినప్పుడు నీటిలో మునుగుతాయని గమనించాం. నీటిలో మునిగే స్వభావమున్న వస్తువులను తేలేటట్లు చేయవచ్చు. కాని నీటిలో తేలే వస్తువులన్నింటిని మునిగేటట్లు చేయలేం.
కృత్యం – 7
6th Class Science Textbook Page No. 50
ప్రశ్న 7.
5 బీకర్లలో నీటిని తీసుకోండి. పంచదార, ఉప్పు, సుద్దపొడి, ఇసుక, రంపపు పొట్టు వంటి వాటిని తీసుకొని ఒక్కొక్క బీకరులో ఒక్కొక్క దానిని కొద్దిగా కలపండి. మీ పరిశీలనలను పట్టికలో నమోదు చేయండి.
నీటికి కలిపిన పదార్థం | కరుగుతుందా(అవును/ కాదు) |
1. పంచదార | |
2. ఉప్పు | |
3. ఇసుక | |
4. రంపపు పొట్టు | |
5. సుద్ద పొడి కాదు |
జవాబు:
నీటికి కలిపిన పదార్థం | కరుగుతుందా(అవును/ కాదు) |
1. పంచదార | అవును |
2. ఉప్పు | అవును |
3. ఇసుక | కాదు |
4. రంపపు పొట్టు | కాదు |
5. సుద్ద పొడి కాదు | కాదు |
వేర్వేరు మిశ్రమాల పేర్లు క్రింది పట్టికలో ఉన్నాయి. వాటిని తయారుచేయడానికి కావలసిన పదార్థాలు ఏమిటో తెలియజేయండి.
మిశ్రమం | పదార్థాలు |
టీ | పాలు |
లడ్డు | |
నిమ్మరసం | |
కాంక్రీట్ | |
మట్టి |
జవాబు:
మిశ్రమం | పదార్థాలు |
టీ | పాలు, నీరు, తేయాకు, పంచదార, యాలకులు |
లడ్డు | శనగపిండి, బెల్లం, నూనె, జీడిపప్పు, కిస్మిస్ |
నిమ్మరసం | నిమ్మకాయ, ఉప్పు, సోడా, నీరు |
కాంక్రీట్ | సిమెంట్, కంకర, ఇసుక, నీరు |
మట్టి | రాళ్ళు, లవణాలు, సేంద్రీయ పదార్థం |
మీకు తెలిసిన కొన్ని మిశ్రమాలను, వాటికి కావలసిన పదార్ధాలను క్రింది పట్టికలో పేర్కొనండి. అవి సహజమైనవో లేదా మనం తయారుచేసినవో కూడా తెలపండి.
మిశ్రమం | కావలసిన పదార్థాలు | సహజమైనది / మనం తయారు చేసినది |
షర్బత్ | నిమ్మరసం, పంచదార, నీరు | మనం తయారు చేసినది |
జవాబు:
మిశ్రమం | కావలసిన పదార్థాలు | సహజమైనది / మనం తయారు చేసినది |
షర్బత్ | నిమ్మరసం, పంచదార, నీరు | మనం తయారు చేసినది |
టీ | తేయాకు, నీరు, పంచదార | మనం తయారు చేసినది |
గాలి | ఆక్సిజన్, నత్రజని, ఇతర వాయువులు | సహజమైనది |
మట్టి | రాళ్ళు, లవణాలు, సేంద్రీయ పదార్థం | సహజమైనది |
లడ్డు | శనగపిండి, బెల్లం, నూనె, జీడిపప్పు, కిస్మిస్ | మనం తయారు చేసినది |
కృత్యం – 8
6th Class Science Textbook Page No. 52
తేర్చడం – తేరినదాన్ని వంపడం
ప్రశ్న 8.
మట్టి నీటి నుండి మట్టిని మరియు ఇసుకను ఎలా వేరు చేస్తారు? ‘తేర్చడం’ మరియు ‘తేరినదాన్ని వంపడం’ అంటే ఏమిటి?
జవాబు:
- ఒక గాజు గ్లాసులో సగం వరకు నీళ్ళు తీసుకోండి. దానిలో కొంచెం మట్టి వేయాలి. మట్టి నీళ్ళలో కలిసిపోయేలా బాగా కలపాలి.
- ఈ మిశ్రమాన్ని కొద్దిసేపు కదిలించకుండా అలాగే ఉంచాలి.
- గ్లాసు అడుగుభాగాన్ని పరిశీలించాలి.
- గాజు గ్లాసు అడుగుభాగంలో ఇసుక మట్టికణాలు నిలిచి ఉండడం గమనిస్తాము.
- వీటినే అడుగున చేరిన కరగని పదార్థం అంటాం. ఈ విధంగా మట్టి నుంచి నీటిని వేరుచేసే పద్ధతినే ‘తేర్చడం’ అంటారు.
- తేర్చిన తరువాత, గ్లాసును నెమ్మదిగా పైకెత్తి అడుగున కరగకుండా మిగిలిన పదార్థాన్ని కదపకుండా నెమ్మదిగా మరొక గ్లాసులో పోయాలి.
- నీరు మట్టి నుంచి వేరవుతుంది. ఈ పద్ధతినే ‘తేర్చిపోత’ అంటారు.
కృత్యం – 9
6th Class Science Textbook Page No. 54
ప్రశ్న 9.
ఒక బీకరులో నీటిని తీసుకోండి. కొంత ఉప్పును దానిలో కరిగించండి. దీన్ని వడపోత కాగితం ఉపయోగించి ఈ మిశ్రమాన్ని వడపోయండి. నీవు ఉప్పును ఉప్పు నీటి నుంచి వేరు చేయగలిగావా?
• ఉప్పును ఉప్పునీటి నుంచి ఎందువల్ల వడపోయలేకపోయావు?
జవాబు:
వేరు చేయలేకపోయాను. ఎందువలననగా వడపోత కాగితంలోని సూక్ష్మరంధ్రాలు మామూలు కంటికి కనిపించనంత చిన్నవిగా ఉంటాయి. వడపోసినప్పుడు ఆ రంధ్రాలనుంచి కూడా కిందికి జారిపోయిన ఉప్పు నీటిలో కరిగిన ఉప్పు కణాలు ఇంకా చాలా చిన్నవిగా ఉంటాయి.
కృత్యం – 10
6th Class Science Textbook Page No. 54
ప్రశ్న 10.
‘స్ఫటికీకరణం’ ప్రక్రియను వివరించుము.
జవాబు:
ఉద్దేశం : ఉప్పు నీరు నుండి ఉప్పును వేరు చేయుట.
కావలసినవి :
ఉప్పు నీరు, పాత్ర, గాజు కడ్డీ, ట్రైపాడ్ స్టాండ్ (త్రిపాది), బున్సెన్ బర్నర్, వైర్ గేజ్.
ఎలా చేయాలి :
ఒక పాత్రలో కొంచెం ఉప్పునీటిని తీసుకొని త్రిపాదిపై పెట్టి వేడి చేయండి. పాత్రలోని నీరు అంతా ఆవిరైపోయే వరకు గాజు కడ్డీతో (ద్రావణాన్ని) కలియతిప్పండి.
ఏమి గమనిస్తావు :
ఉప్పు స్ఫటికాలు పాత్ర అడుగున మిగిలి ఉంటాయి. ఏమి నేర్చుకుంటావు : ఉప్పు నీటి నుండి ఉప్పును వేడిచేయడం ద్వారా వేరు చేయవచ్చు. (స్ఫటికీకరణం)
కృత్యం – 11
6th Class Science Textbook Page No. 55
ప్రశ్న 11.
‘స్వేదనం’ ప్రక్రియను వివరింపుము.
జవాబు:
ఉద్దేశం : సాధారణ నీరు నుంచి స్వేదన జలంను తయారు చేయుట.
కావలసినవి :
నీరు, శాంకవ కుప్పెలు – 2, ఒంటి రంధ్రపు రబ్బరు బిరడాలు-2, రబ్బరు గొట్టం, బుస్సెన్ బర్నర్, స్టాండు.
ఎలా చేయాలి :
ఒక శాంకవ కుప్పెను నీటితో నింపి ఒంటి రంధ్రపు బిరడాతో మూసి వేయండి. ఒంటి రంధ్రపు రబ్బరు బిరడాతో మూసి ఉంచిన ఇంకొక శాంకవ కుప్పెను తీసుకోండి. రెండింటినీ రబ్బరు గొట్టంతో కలపండి. నీరు ఉన్న కుప్పెను వేడి చేయండి.
ఏమి గమనిస్తావు :
కొంత సేపు అయిన తర్వాత రబ్బరు గొట్టం ద్వారా నీటి ఆవిరి ఖాళీ శాంకవ కుప్పెలోనికి వెళు తుంది. ఆ నీటి ఆవిరి నెమ్మదిగా మారుతుంది. ఈ నీటిని స్వేదన జలం అంటాం. ఇది మలిన రహితమైన నీరు.
ఏమి నేర్చుకుంటావు :
స్వేదనం ద్వారా మలినాలను నీటి నుండి తొలగించవచ్చు.
కృత్యం – 12
6th Class Science Textbook Page No. 55
ప్రశ్న 12.
కర్పూరం ఉత్పతనం చెందే ప్రక్రియను వివరింపుము.
జవాబు:
ఉద్దేశం : ఉత్పతనం ప్రక్రియను అర్థం చేసుకోవడం.
కావలసినవి :
కర్పూరం, ఉప్పు మిశ్రమం, పింగాణి పాత్ర, దూది, స్టాండ్.
ఎలా చేయాలి :
ఒక పింగాణి పాత్రలో కర్పూరం, ఉప్పు మిశ్రమాన్ని తీసుకోండి. దాన్ని ఒక గరాటుతో మూయండి. గరాటు కాడను దూదితో మూయండి. పింగాణి పాత్రను స్టాండ్ పైన ఉంచి వేడి చేయండి.
ఏమి గమనిస్తావు :
కర్పూరం వేడి చేసినప్పుడు ద్రవరూపంలోకి మారకుండా వాయురూపంలోకి మారి పాత్రలో ఉప్పు నుండి వేరవుతుంది. గరాటుకాడలో ఉన్న దూది వలన చల్లబడి మళ్ళీ నేరుగా ఘనరూపంలో మారుతుంది.
ఏమి నేర్చుకుంటావు :
ఏదైనా పదార్థం నేరుగా ఘనరూపం నుండి వాయు రూపంలోకి లేదా వాయురూపం నుండి ఘనరూపంలోకి మారే ప్రక్రియను || ‘ఉత్పతనం’ అంటారు.
కృత్యం – 13
6th Class Science Textbook Page No. 56
ప్రశ్న 13.
క్రొమటోగ్రఫి ప్రక్రియను వివరింపుము.
జవాబు:
ఉద్దేశం : రంగుల మిశ్రమం నుండి రంగులను వేరు చేయుట (ఇంకు).
కావలసినవి :
తెల్లని పొడవైన సుద్దముక్క, నలుపురంగు సిరా, పళ్ళెం, నీరు.
ఎలా చేయాలి :
ఒక తెల్లని పొడవైన సుద్దముక్కను తీసుకోండి. దాని చుట్టూ నీలం లేదా నలుపురంగు సిరాతో గుర్తు పెట్టండి. ఒక పళ్ళెం తీసుకొని దానిలో కొద్దిగా నీరు పోయండి. మధ్యలో సుద్దముక్కను నిలబెట్టండి. పళ్ళెంలోని నీరు సుద్దముక్కలోని సిరా రంగు గుర్తును తాకకుండా జాగ్రత్త వహించండి. కొంత సేపటి తర్వాత సుద్దముక్కపై ఏర్పడే రంగుల వలయాలను పరిశీలించండి. నీరు సుద్దముక్క పైభాగానికి ఎగబాకేలోపుగానే సుద్దముక్కను పళ్ళెం నుండి తీసివేయండి.
ఏమి గమనిస్తావు :
దిగువ నుండి పైకి సుద్దముక్క చుట్టూ వివిధ రంగులు ఏర్పడతాయి.
ఏమి నేర్చుకుంటావు :
వాస్తవానికి సిరా ఒక్క రంగులోనే కన్పించినప్పటికీ, అది అనేక రంగులను తనలో ఇముడ్చుకుంటుంది. ఇలా రంగులను వేరు చేసే పద్ధతినే ‘క్రొమటోగ్రఫి’ అంటారు.
ప్రాజెక్ట్ పనులు
6th Class Science Textbook Page No. 59
ప్రశ్న 1.
ఒక బీకరులోని నీటిలో కోడిగుడ్డును వేయండి. మరొక బీకరులోని నీటికి కొంచెం ఎక్కువ మోతాదులో ఉప్పును కలిపి, ఇప్పుడు ఆ గుడ్డును ఈ నీటిలో వేయండి. మీ పరిశీలనలను నమోదు చేయండి.
జవాబు:
ఒక బీకరు తీసుకొని దానిలో నీరు పోసి కోడిగుడ్డుని వేశాను. కోడిగుడ్డు నీటిలో మునిగిపోయింది. మరొక బీకరు తీసుకొని దానిలో ఉప్పు నీటిని తీసుకొని కోడిగుడ్డు వేశాను. ఆశ్చర్యంగా అది నీటిలో తేలడం గమనించాను. గుడ్డు రెండు బీకర్లలో ఒకే బరువు కలిగి ఉన్నప్పటికీ ఒక దాంట్లో మునిగి, రెండో దాంట్లో తేలటం ఆశ్చర్యంగా ఉంది. గుడ్డు నీటిలో తేలడానికి, నీటిలో కలిపిన ఉప్పు కారణమని భావిస్తున్నాను.
ప్రశ్న 2.
కింది కృత్యాలను చేసి మీ పరిశీలనలను నమోదు చేయండి.
ఎ) సుద్దపొడిని నీటిలో కలపండి.
బ) ఒక చిన్న మైనపు ముక్కను నీటిలో వేయండి.
సి) బీకరులోని నీటిలో కొన్ని నూనె చుక్కలు వేయండి.
జవాబు:
ఎ) సుద్దపొడిని నీటిలో కలిపి, కాసేపు ఆగి పరిశీలించినట్లయితే సుద్దపొడి నీటి అడుగున చేరింది అంతేకానీ అది నీటిలో కరగలేదు, దీనిని బట్టి సుద్దపొడి నీటిలో కరగని పదార్థం అని నిర్ధారించబడినది.
బి) చిన్న మైనపు ముక్కను నీటిలో వేసాను, అది నీటిపై తేలటం గమనించాను. దీనిని బట్టి మైనపు ముక్క నీటి కంటే తేలిగ్గా ఉందని, కాబట్టి నీటిపై తేలినది అని నిర్ధారించవచ్చు.
సి) ఒక బీకరులోని నీటిలో కొన్ని నూనె చుక్కలు వేయగా అవి నీటిపై తేలాయి. అంతేగాక అవి నీటిలో ఏమాత్రం కరగకుండా పలుచని పొరలాగా విస్తరించాయి.
ప్రశ్న 3.
మీ వంటగదిలో ఉన్న పాత్రలు, ఆహారపు దినుసులు వంటి కొన్ని వస్తువుల జాబితాను రాసి, వాటిని కింది విధంగా వర్గీకరించండి.
ఎ) నీటిలో మునుగుతుందా? తేలుతుందా?
బి) నీటిలో కరుగుతుందా / కరుగదా?
జవాబు:
ఎ) నీటిలో మునిగేవి : గ్లాసులు, వంటపాత్రలు, పప్పు దినుసులు, బియ్యము
బి) నీటిలో మునగనివి : ఆకుకూరలు, కరివేపాకు, టమోటాలు
సి) నీటిలో కరిగేవి : బెల్లం, పంచదార, ఉప్పు
డి) నీటిలో కరగనివి : బియ్యం, కందిపప్పు, కూరగాయలు
ప్రశ్న 4.
గోధుమపిండిలో చక్కెర కలిసిపోయింది. దానిలో నుంచి చక్కెరను వేరుచేయడానికి వీలు కలుగుతుందా? నీవైతే ఎలా వేరుచేస్తావు? ఒకవేళ చక్కెర, గోధుమపిండి కలిసిపోతే ఎలా వేరు చేస్తావు?
జవాబు:
గోధుమపిండి, చక్కెర కలిసిపోతే వాటిని వేరు చేయడానికి వీలవుతుంది చక్కెరతో పోల్చుకున్నప్పుడు గోధుమపిండి పరిమాణంలో చిన్నదిగా ఉంటుంది కావున జల్లెడ ఉపయోగించి జల్లించడం ద్వారా గోధుమపిండి క్రిందకు వస్తుంది. జల్లెడలో పంచదార మిగిలిపోతుంది.