AP Board 6th Class Social Solutions Chapter 8 రాజ్యాలు మరియు సామ్రాజ్యాలు
AP Board 6th Class Social Solutions Chapter 8 రాజ్యాలు మరియు సామ్రాజ్యాలు
AP State Syllabus 6th Class Social Solutions 8th Lesson రాజ్యాలు మరియు సామ్రాజ్యాలు
6th Class Social 8th Lesson రాజ్యాలు మరియు సామ్రాజ్యాలు Textbook Questions and Answers
Improve your learning (మీ అభ్యసనాన్ని మెరుగుపడుచుకోండి)
ప్రశ్న 1.
కళింగ యుద్ధం తర్వాత అశోకుడు యుద్ధాలు చేయకూడదని నిర్ణయించుకున్నాడు. ఇలాంటి నిర్ణయాలు ప్రపంచ శాంతిని పెంపొందిస్తాయని అనుకుంటున్నావా? ఎలా?
జవాబు:
అవును. భావిస్తున్నాను. ఎందుకనగా ……..
- ప్రజలకు మరియు ఇతర రాజులకు యుద్ధ భయం ఉండదు.
- యుద్దాలు లేనపుడు ఆయుధాల కొరకు ఎక్కువ మొత్తంలో సంపదను వెచ్చించనవసరం లేదు.
- యుద్ధ భయం లేకపోతే ప్రజలందరు మనశ్శాంతితో, ప్రశాంతంగా, సంతోషంగా జీవిస్తారు.
- యుద్దాల అవసరం లేనపుడు రాజు తన దృష్టిని ప్రజా సంక్షేమం వైపు మళ్లించవచ్చు.
ప్రశ్న 2.
నేటికాలంలో అశోకధర్మం యొక్క ప్రాముఖ్యతను వివరింపుము. అశోకధర్మం యొక్క గొప్పతనాన్ని వర్ణింపుము.
జవాబు:
నేటి కాలంలో అశోకధర్మం యొక్క ప్రాముఖ్యత ఎంతైనా ఉంది.
అశోకధర్మం యొక్క ప్రధాన సూత్రాలు :
- జంతువుల పట్ల దయ కలిగి ఉండాలి.
- తల్లిదండ్రుల పట్ల విధేయత కలిగి ఉండాలి.
- పేదల పట్ల సానుభూమి కలిగి ఉండాలి.
- పెద్దలను గౌరవించవలెను.
- ఇతర మతాలను విస్మరించరాదు.
- మానవజాతి సంక్షేమానికి కృషి చేయాలి.
- అశోకుని ధర్మం ప్రజలకు అనుకూలము ఆచరణీయము అయిన నైతిక సూత్రాలను కల్గి ఉంది.
- ఉన్నతమైన జీవన విధానాన్ని అందించటమే అశోకుని ధమ్మ ఉద్దేశము.
- ధర్మాపేక్ష, శ్రద్ధ, విధేయత, పాపభీతి, సామర్థ్యము లేకపోతే ఇహపరలోక సుఖాలను పొందలేరని బోధించాడు.
- నేటి సమాజంలో వివిధ రూపాలలో జరుగుతున్న ‘హింసకు’ అశోకుని (అహింస) ధర్మము చక్కని పరిష్కారం.
- అలాగే ‘పరమత సహనం’ అనే సూత్రం నేడు ఎంతో అవసరం. అనేక అల్లర్లకు, హింసకు, యుద్ధాలకు మత మౌఢ్యమే కారణం.
- ఈ విధంగా అశోకుని క్క గొప్ప ధర్మం నేటికాలంలో ప్రాముఖ్యత కలిగి ఉంది.
ప్రశ్న 3.
అశోకుని యొక్క ప్రజాపనులకు నేటికాలంలో ప్రజాప్రభుత్వాలు చేస్తున్న ప్రజా పనులకు పోలికలు మరియు భేదాలు తెలుపుము?
జవాబు:
అశోకుని యొక్క ప్రజాపనులకు నేటికాలంలో ప్రజాప్రభుత్వాలు చేస్తున్న ప్రజా పనులకు పోలికలు :
- అశోకుడు, నేటి ప్రభుత్వాలు ప్రజాక్షేమమే తమ ప్రధాన ఆశయంగా భావించి వారి సంక్షేమము కొరకు అనేక చర్యలు చేపడుతున్నారు.
నీరు, ఆహారం తమ ప్రజలందరికీ అందాలని అశోకుడు సంకల్పించాడు, నేటి ప్రభుత్వాలు కూడా సాగు, త్రాగు నీరు మరియు ఆహారం (రేషన్ షాపుల ద్వారా) ప్రజలందరికీ అందిస్తున్నాయి. - అశోకుడు దేశ వ్యాప్తముగా అనేక రహదారులను నిర్మించి, వాటి కిరువైపులా చెట్లు నాటించెను. నేటి ప్రభుత్వాలు కూడా దేశాభివృద్ధికై జాతీయ, రాష్ట్ర మొ||న రహదారులను నిర్మిస్తున్నాయి. అలాగే పర్యావరణ పరిరక్షణకు పెద్ద ఎత్తున చెట్లను (వన సంరక్షణ) నాటుట, సంరక్షించుట మొ||న చర్యలు చేపడుతున్నాయి.
- అశోకుడు మానవులకే కాక జంతువుల కొరకై ప్రత్యేక వైద్య శాలలను నెలకొల్పను. నేటి ప్రభుత్వాలు కూడా దేశ ప్రజలకు నాణ్యమైన వైద్యాన్ని ఉచితంగా అందించే ఏర్పాట్లు చేసినాయి.
భేదాలు :
- అశోకుని కాలంకంటే నేటి (ప్రభుత్వాల) కాలంలో శాస్త్ర, సాంకేతిక రంగాలు అభివృద్ధి చెందటం వలన ప్రజలకు ఎన్నో సౌకర్యాలు ప్రభుత్వం ప్రజలకు అందిస్తుంది. ఉదా : డిజిటల్ సేవలు, రవాణా రంగంలోని సేవలు (రైలు విమానం మొ||నవి.)
- నేటి కాలంలో ప్రజా పనులు చాలా విస్తృతంగా, ఖర్చుతో కూడుకుని ఉన్నాయి.
ప్రశ్న 4.
అశోకుడు తన సైన్యాన్ని యుద్ధం కోసం కాకుండా ప్రజాసేవకు వినియోగించాడు. ప్రస్తుత కాలంలో భారత సైన్యం యుద్ధాలలోనే కాకుండా పాల్గొనే ఇతర సహాయ కార్యక్రమాలేవి?
జవాబు:
భారత సైన్యం చేపడుతున్న సహాయ కార్యక్రమాలు :
- ప్రకృతి విలయాల సందర్భంలో, తుఫానులు, భూకంపాలు, వరదలు మొ||న ప్రకృతి భీభత్సాలలో సాధారణ పౌరులను ఆదుకోవటానికి సైన్యం ఎంతో సహాయం చేస్తుంది.
- పర్వతలోయల్లో, కొండల్లో ఎవరైనా అపాయంలో ఉన్నా, ప్రమాదాలు జరిగిన సైన్యం వారికి సహాయం అందిస్తుంది.
- NCC (National Cadet Corps) లాంటి వానిద్వారా విద్యార్థులలో దేశభక్తిని, సైనిక శిక్షణను అందిస్తుంది.
- ‘ఆపరేషన్ సద్భావన’ కార్యక్రమం ద్వారా భరత సైన్యం పౌరులకు అనేక రకాలుగా సేవలు అందిస్తుంది.
- అంతర్గత కలహాలు, బాంబు ప్రేలుళ్ళు, హైజాకింగ్ మొ||న సందర్భాలలో సైన్యం ఎంతో ముఖ్య పాత్ర పోషిస్తుంది.
ప్రశ్న 5.
గుప్తుల కాలంలో కళలు, సాహిత్యం మరియు వాస్తు నిర్మాణ రంగాలలో సాధించిన విజయాలేవి?
జవాబు:
గుప్తుల కాలంలో వివిధ రంగాలలో సాధించిన విజయాలు :
గుప్తుల కాలంలో సారస్వతం, గణితం, వైద్య శాస్త్రం మరియు ఖగోళశాస్త్రాలలో అనేక గొప్ప గ్రంథాలు రాయబడినవి. అనేక కొత్త విషయాలు ఆవిష్కరించబడినవి. అందులో చెప్పబడిన జ్ఞానాన్ని ప్రపంచంలో ప్రస్తుతం ఆధునిక పరిజ్ఞానం పేరుతో విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. రెండవ చంద్రగుప్తుని కొలువులో తొమ్మిది మంది గొప్ప పండితులు కలరు. వీరినే ‘నవరత్నాలు’ అంటారు. నవరత్నాలలో కాళిదాసు ప్రసిద్ధ కవి.

NAVARATNAS నవరత్నాలు | |
కాళిదాసు | సంస్కృత కవి, రచయిత |
అమరసింహుడు | నిఘంటుకర్త |
శంకు | భవన నిర్మాణ ఇంజనీరు |
ధన్వంతరి | ఫిజీషియన్, ఆయుర్వేద వైద్యుడు |
క్షేపకుడు | జ్యోతిష్య శాస్త్రవేత్త |
ఘటకర్షకుడు | సంస్కృత కవి, రచయిత, కవి |
భేతాళబట్టు | మంత్రశాస్త్ర కోవిదుడు |
వరరుచీ | గణిత శాస్త్రవేత్త మరియు భాషా కోవిదుడు |
వరాహమిహురుడు | ఖగోళ శాస్త్రవేత్త |
అద్భుతమైన రాతి గుహలకు గుప్తుల కాలం ప్రసిద్ధి. వారి కాలంలో పెయింటింగ్ కు, వాస్తుశిల్ప కళా నైపుణ్యానికి అజంతా, ఎల్లోరా గుహలు గొప్ప ఉదాహరణలు.
ప్రశ్న 6.
భారతదేశంలో గుప్తుల కాలాన్ని “స్వర్ణయుగమని” ఎందుకు అంటారు?
జవాబు:
భారతదేశ చరిత్రలో గుప్తుల పాలనా కాలము ఒక మహోజ్వలమైన అధ్యాయము. శాస్త్ర విజ్ఞానం, జోతిష్య శాస్త్రం, గణితం మరియు సాహిత్య రంగాలలో గుప్తుల కాలంలో అనేక కొత్త విషయాలు కనుగొనుట జరిగినది. అందువలన గుప్తకాలాన్ని భారతదేశ చరిత్రలో స్వర్ణయుగం అంటారు.
సాహిత్యరంగంలో అభివృద్ధి :
గుప్తుల కాలంలో సారస్వతం, గణితం, వైద్యశాస్త్రం మరియు ఖగోళ శాస్త్రాలలో అనేక గొప్ప గ్రంథాలు రాయబడినవి. రెండవ చంద్రగుప్తుని కొలువులో తొమ్మిది మంది గొప్ప పండితులు కలరు. వీరినే నవరత్నాలు అంటారు. నవరత్నాలలో కాళిదాసు ప్రసిద్ధ కవి.
గణితశాస్త్రంలో ఆవిష్కరణలు :
ఆర్యభట్టు ప్రముఖ ఖగోళశాస్త్రవేత్త, గణితశాస్త్రవేత్త. బీజగణితాన్ని వీరి కాలంలో ఉపయోగించారు. భారతీయ శాస్త్రవేత్తలు ‘సున్న’ భావనను అభివృద్ధి చేశారు. ‘సున్న’ కు గుర్తును కూడా తయారు చేశారు. 1-9 సంఖ్యలకు గుర్తులను గుప్తుల కాలంలోనే కనుగొన్నారు. వీరు కనుగొన్న ‘ఆల్గారిథమ్స్’ను నేడు కంప్యూటర్ ప్రోగ్రామ్స్ లో ఉపయోగిస్తున్నారు. బ్రహ్మగుప్తుడు గుప్తుల కాలంలో ప్రముఖ ఖగోళ శాస్త్రవేత్త మరియు గణిత శాస్త్రవేత్త. ఇతను పౌర సంవత్సరాన్ని దాదాపు కచ్చితంగా లెక్కించగల్గినాడు.
వైద్యశాస్త్ర ప్రగతి :
చరకుడు, సుశ్రుతుడు గుప్తుల కాలంలో గొప్ప వైద్య పరిజ్ఞానం గల నిపుణులు. ప్లాస్టిక్ సర్జరీ, ‘ విరిగిన ఎముకలను సరిచేసి ఆపరేషన్ కూడా ఆనాటి వైద్యులు చేసినారు. వ్యాధి కంటే వ్యాధికి గల మూల కారణాన్ని నిర్మూలించాలని వైద్యులు భావించారు.
ఖగోళశాస్త్రంలో అన్వేషణలు :
ఖగోళశాస్త్రం మరియు శాస్త్ర విజ్ఞానాలలో భారతీయ శాస్త్రవేత్తలు అనేక విషయాలు కనుగొన్నారు. నక్షత్రాలు మరియు గ్రహాల కదలికలను గమనించారు. భూమి గుండ్రంగా ఉంటుందని మరియు సూర్యుని చుట్టూ తిరుగుతుందని తెలుసుకున్నారు. భూమికి సూర్యునికీ మధ్య చంద్రుడు అడ్డు వచ్చినప్పుడు గ్రహణాలు ఏర్పడతాయని వారు భావించేవారు. గురుత్వాకర్షణ శక్తి గురించి కూడా వీరికి తెలుసు.
భారతీయ శాస్త్రవేత్తలు ఎలాంటి ప్రయోగశాలలు మరియు ప్రయోగాలు లేకుండానే పై విషయాలన్నియు కనుగొన్నారు. పై విషయాలన్నింటికి కేవలం ఊహించుట ద్వారానే చెప్పగలిగారు. ఆధునిక శాస్త్రవేత్తల పరిశోధనలు ద్వారా పై విషయాలన్నీ ఖచ్చితమైనవని నిరూపించబడినవి.
కళలు, వాస్తు శిల్పకళ :
అద్భుతమైన రాతి గుహలకు గుప్తుల కాలం ప్రసిద్ధి. వారికాలంలో పెయింటింగ్లు, వాస్తుశిల్ప కళా నైపుణ్యానికి అజంతా, ఎల్లోరా గుహలు గొప్ప ఉదాహరణలు.
లోహ విజ్ఞానం :
గుప్తుల కాలంలో శాస్త్రవేత్తలు, లోహశాస్త్ర పరిజ్ఞానంలో నిపుణులు. ఇనుము మరియు ఉక్కుతో ఆయుధాలు తయారు చేసేవారు. ఆధునిక బంగారు నాణెలను పోలి ఉండే వాటిని కూడా వీరికాలంలో ముద్రించుట జరిగినది.
ప్రశ్న 7.
వైద్య మరియు లోహ విజ్ఞానశాస్త్ర రంగాలలో గుప్తుల కాలంలో సాధించిన విజయాలేవి?
జవాబు:
వైద్యశాస్త్రం :
చరకుడు మరియు సుశ్రుతుడు గుప్తుల కాలంలో గొప్ప వైద్య పరిజ్ఞానం గల నిపుణులు. గాయపడిన ముక్కులకు ప్లాస్టిక్ సర్జరీ చేసిన మొట్టమొదటి భారతీయ శస్త్రచికిత్స నిపుణుడు సుశ్రుతుడు. గుప్తుల కాలంలోని వైద్యులు విరిగిపోయిన ఎముకలను సరిచేసి ఆపరేషన్లు కూడా చేసేవారు. ఔషధంతో కూడిన మొక్కలను వ్యాధులను నయం చేయడంలో ఉపయోగించేవారు. వ్యాధి కంటే వ్యాధికి గల మూల కారణాన్ని నిర్మూలించాలని వైద్యులు భావించేవారు.
లోహ విజ్ఞాన శాస్త్రం :
గుప్తుల కాలంలో శాస్త్రవేత్తలు లోహశాస్త్ర పరిజ్ఞానంలో నిపుణులు. ఇనుము మరియు ఉక్కుతో ఆయుధాలు తయారు చేసేవారు. ఆధునిక బంగారు నాణేలను పోలి ఉండే వాటిని కూడా వీరి కాలంలో ముద్రించుట జరిగినది.
ప్రశ్న 8.
పల్లవులు వాస్తు శిల్పకళకు చేసిన సేవను వివరింపుము.
జవాబు:
దక్షిణ భారతదేశంలోని వాస్తు శిల్పకళా నైపుణ్యానికి పల్లవ రాజులు ఎంతో సేవ చేశారు. వారి కాలంలో వాస్తు శిల్పకళ రాతిని తొలిచి నిర్మించే ఆలయాల నుంచి రాతితో నిర్మించే ఆలయాల స్థాయికి మారినది. తొలి పల్లవ రాజులలో మొదటి మహేంద్రవర్మ ప్రసిద్ధి చెందిన రాజు, అతడు గొప్ప వాస్తు శిల్పకళాభిమాని అతను ప్రవేశ పెట్టిన నూతన ద్రవిడ వాస్తు శిల్పకళను ‘మహేంద్రుని రీతి’ శిల్పకళ అంటారు. గుహాలయాల యొక్క ప్రభావం శిల్పకళపై ప్రస్ఫుటంగా కనిపిస్తుంది.
మొదటి నరసింహ వర్మ తదుపరి ముఖ్యమైన పల్లవరాజు. ఇతను మహేంద్రవర్మ యొక్క కుమారుడు. ఇతనిని ‘మహామల్లుడు’ అని కూడా పిలుస్తారు. మహాబలిపురం రేవు పట్టణాన్ని ఇతను మంచి వాస్తు శిల్పకళా నైపుణ్యంతో అందంగా నిర్మించాడు. ఇతని కాలంలో అభివృద్ధి చేయబడిన వాస్తుశిల్పకళ ‘మహామల్లుని వాస్తు శిల్పకళారీతి’గా ప్రసిద్ధి చెందినది. మహాబలిపురంలో అయిదు రథాలు నిర్మించారు. ఇవి పంచపాండవ రథాలుగా పేరొందాయి. ఒక్కో రథాన్ని ఒక్కో పెద్ద బండరాయిని తొలిచి నిర్మించారు. కావున వీటిని ‘ఏకశిలా రథాలు’ అంటారు.
రెండవ నరసింహ వర్మ దేవాలయాలు నిర్మించుటపై ప్రత్యేక శ్రద్ధ కనపరిచారు. అతను ‘రాజసింహుడు’ అను పేరుతో కూడా ప్రసిద్ధి చెందాడు. అతని కాలంలో నూతన వాస్తుశిల్ప కళారీతి అభివృద్ధి చెందినది. దేవాలయాలు మెత్తని మట్టి, రాయితో నిర్మించుట జరిగినది. దీనిని ‘రాజసింహుని వాస్తు శిల్పకళారీతి’ అంటారు. కాంచీపురంలోని ప్రసిద్ధ కైలాసనాథ దేవాలయం రాజసింహుని వాస్తు శిల్పకళారీతికి చక్కటి ఉదాహరణ.
ప్రశ్న 9.
భారతదేశపటంలో క్రింది వానిని గుర్తింపుము.
1. పాటలీపుత్రం
2. ఉజ్జయిని
3. నర్మదానది
4. కాంచీపురం
5. మహాబలిపురం
6. ధాన్య కటకం
జవాబు:
ప్రశ్న 10.
నేను ఎవరు? (కనుక్కోండి చూద్దాం)
అ. ‘నేను అశోకుని నాలుగు సింహాల గుర్తులో ఉన్నాను. నేను జాతీయ పతాకం మధ్యలో కూడా ఉన్నాను. నేను ఎవరిని?
జవాబు:
అశోక ధర్మ చక్రము.
ఆ. నేను గుప్తుల వంశానికి చెందిన రాజును. దేశంలో ఉన్న అందరి రాజులను ఓడించాను. నా పేరేమి?
జవాబు:
సముద్రగుప్తుడు.
ఇ. నేను శాతవాహనుల రాజధానిని, కృష్ణానది ఒడ్డున ఉన్నాను. నా ‘పేరేమి?
జవాబు:
ధాన్య కటకం.
ఈ. మహాబలిపురంలోని రాతిని తొలిచి నిర్మించిన గుహాలయాలను పూర్తి చేశాను. నేను మొదటి మహేంద్రవర్మ, కుమారుడిని నా పేరు ఏమిటి?
జవాబు:
మొదటి నరసింహ వర్మ
6th Class Social Studies 8th Lesson రాజ్యాలు మరియు సామ్రాజ్యాలు InText Questions and Answers
6th Class Social Textbook Page No.88
ప్రశ్న 1.
అశోకుడు కళింగ రాజ్యాన్ని ఎందుకు ఆక్రమించాలనుకున్నాడు?
జవాబు:
అశోకుడు మరింత విశాలమైన రాజ్యాన్ని స్థాపించాలని సంకల్పించాడు. అందుకోసం చాలా యుద్ధాలు చేశాడు. అందులో కళింగ యుద్ధము ప్రముఖమైనది. కళింగ రాజ్యం భారతదేశానికి తూర్పు తీరంలో గల స్వతంత్రమైన విశాలమైన రాజ్యం. మౌర్యవంశానికి చెందిన చంద్రగుప్త మౌర్యుడు కళింగ రాజ్యాన్ని జయించడానికి ప్రయత్నించి విఫలమవుతాడు. అందుకని అశోకుడు కళింగ రాజ్యాన్ని ఆక్రమించాలనుకున్నాడు.
ప్రశ్న 2.
కళింగ యుద్ధంలో విజయం తర్వాత అశోకుడు ఎందుకు సంతోషంగా లేడు?
జవాబు:
అశోకుడు కళింగ రాజ్యంపై యుద్ధం ప్రకటిస్తాడు. ఈ కళింగ యుద్ధం అత్యంత భయంకరమైనది మరియు రక్తసిక్తమైనది. అశోక చక్రవర్తి కళింగ యుద్ధభూమిలోకి స్వయంగా నడచి వెళ్ళాడు. అనేకమంది గాయపడిన మరియు చనిపోయిన సైనికులను స్వయంగా చూస్తాడు. యుద్ధంలో గెలిచినప్పటికీ అశోకచక్రవర్తి ఏ మాత్రం సంతోషంగా లేడు. భవిష్యత్తులో అతని జీవితకాలంలో ఎలాంటి యుద్ధాలు చేయకూడదని గట్టిగా నిర్ణ యించుకుంటాడు. ధర్మాన్ని వ్యాప్తి చేయడమే నిజమైన విజయముగా భావిస్తాడు. తన శేష జీవితంలో అహింసకు ప్రాధాన్యత ఇస్తాడు. అహింసను ప్రబోధించే బౌద్ధమతం పట్ల ఆకర్షితుడవుతాడు.
6th Class Social Textbook Page No.89
ప్రశ్న 3.
ప్రస్తుత భారతదేశపటంలో అప్పటి కళింగ రాజ్య ప్రాంతాన్ని మీ ఉపాధ్యాయుని సహాయంతో గుర్తించుము.
జవాబు:
ప్రశ్న 4.
కళింగ రాజ్యాన్ని ప్రస్తుత భారతదేశంలో ఏ పేరుతో పిలుస్తారు?
జవాబు:
ఒడిషాగా పిలుస్తున్నారు.
6th Class Social Textbook Page No.90
ప్రశ్న 5.
అశోకుని శిలాశాసనాలు నిరక్షరాస్యులు కూడా అర్థం చేసుకోగలుగుతున్నారు. ఇది ఎలా సాధ్యమని నీవు అనుకుంటున్నావు?
జవాబు:
అశోకుని శిలాశాసనాలు నిరక్షరాస్యులు కూడా ఎలా అర్థం చేసుకోగలిగినారంటే :
- ‘అశోకుడు’ ధర్మమహామాత్రులు’ అనే అధికారులను నియమించాడు. వారు రాజ్యంలోని వివిధ ప్రాంతాలకు వెళ్ళి ప్రజలకు ధర్మప్రచారం చేసేవారు.
- అశోకుడు తన సందేశాలను శాసనాల రూపంలో రాళ్లపైన, స్తంభాలపైన చెక్కించాడు.
- చదువు రానివారికి వాటి పైనున్న సందేశాలను చదివి వినిపించాలని అధికారులను ఆదేశించాడు.
- అశోకుడు తన ధర్మాన్ని సుదూర ప్రదేశాలైన సిరియా, ఈజిప్టు, గ్రీస్, శ్రీలంకలకు వ్యాప్తి చేయటానికి రాయబారులను పంపించాడు.
ప్రశ్న 6.
ప్రస్తుత రోజులలో ప్రభుత్వం యొక్క సందేశం ప్రజలకు ఎలా చేరుతున్నది?
జవాబు:
ప్రస్తుత రోజులలో ప్రభుత్వం యొక్క సందేశం ప్రజలకు ఎలా చేరుతుందంటే :
- పత్రికల ద్వారా
- దూరదర్శన్ (టి.వి.) ద్వారా
- సోషల్ మీడియా ద్వారా
- ప్రభుత్వ శాఖల ప్రకటనల ద్వారా
- ప్రజాప్రతినిధులు, అధికారులు, సామాజిక కార్యకర్తల ద్వారా
- వివిధ గ్రంథాలు,
- ప్రముఖుల ఉపన్యాసాల ద్వారా
ప్రశ్న 7.
మౌర్య చక్రవర్తుల కాలక్రమ చార్టును తయారు చేయండి.
జవాబు:
విద్యార్థులు స్వయంగా చేయగలరు, ఉదాహరణకు
ప్రశ్న 8.
అశోక చక్రవర్తి యొక్క వ్యక్తిత్వాన్ని తరగతిగదిలో చర్చించుము.
జవాబు:
మౌర్యులలో ప్రసిద్ధి చెందిన పాలకుడు అశోకుడు. అనేక శాసనాలను వ్రాయించాడు. ఆనాటి పరిస్థితులను నేటికి తెలిసేలా చేశాడు. ప్రపంచ చలత్రలో యుద్ధంలో విజయాన్ని పొంది, యుద్ధాలకు స్వస్తి పలికిన ఒకే ఒక రాజు అశోకుడు. కళింగ యుద్ధం తరువాత ధర్మ ప్రచారం చేశాడు. అంతేకాక రోడ్లను నిర్మించాడు. బావులను త్రవ్వించాడు. సత్రాలను కట్టించాడు. మనుష్యులకే కాక జంతువులకు కూడా వైద్యాలయాలను కట్టించాడు. ఈ కారణాల వలన అశోకుడు విశిష్ట పాలకుడని నేననుకుంటున్నాను.
ప్రశ్న 9.
జాతీయ చిహ్నం యొక్క ప్రాధాన్యతను తరగతి గదిలో చర్చించుము.
జవాబు:
సారనాథ్ లోని అశోకుని శిలా స్తంభంలోని నాలుగు సింహాల గుర్తును భారత ప్రభుత్వం అధికార జాతీయ, చిహ్నంగా స్వీకరించింది.
జాతీయ చిహ్నం అనేది ఒక దేశం యొక్క అధికారిక చిహ్నం. ఇది ఒక దేశం యొక్క సార్వభౌమాధికారాన్ని తెలియజేస్తుంది. 1950 జనవరి 26 నుంచి దీనిని అధికారికంగా జాతీయచిహ్నంగా గుర్తించారు. ఇందులో మూడు సింహాలు పైకి కనపడతాయి. నాల్గవసింహం మాత్రం అదృశ్యంగా దాగి ఉంటుంది. మూడు సింహాలు అధికారం, ధైర్యము మరియు ఆత్మవిశ్వాసం అనే మూడు లక్షణాలకు ప్రతీకలు నాల్గవ సింహం భారతజాతి యొక్క గౌరవానికి ప్రతీక. ఎబాకు మధ్యలో చక్రం ఉంటుంది. అందులో కుడివైపున ఎద్దు మరియు ఎడమవైపున గెంతుతూ ఉన్న గుర్రం ఉంటుంది. ఎద్దు కష్టపడే మనస్తత్వాన్ని తెలియజేస్తుంది. అశ్వము వేగాన్ని మరియు శక్తిని తెలియజేస్తుంది. ఎబాక్కు దిగువవైపున ‘సత్యం జయిస్తుంది’ అని లిఖించబడి ఉంటుంది. ఇది మండూకోపనిషత్ నుంచి గ్రహింపబడింది.
6th Class Social Textbook Page No.91
ప్రశ్న 10.
రవాణా మరియు వాణిజ్యాల మధ్య సంబంధం ఉందని మీరు భావిస్తున్నారా? నీ సమాధానాన్ని సమర్థింపుము.
జవాబు:
రవాణా మరియు వాణిజ్యాల మధ్య సంబంధం ఖచ్చితంగా ఉందని నేను భావిస్తున్నాను.
- వ్యాపారులకు, చేతి వృత్తుల వారికి రవాణా మార్గాలు చాలా ముఖ్యమైనవి. ఈ రవాణా మార్గాలు పెద్ద పట్టణాలను, ఓడరేవులను మరియు ఇతర దేశాలను కలుపుతాయి.
- అభివృద్ధి చెందిన రవాణా మార్గాల వల్లనే (విదేశీ) వాణిజ్యం అభివృద్ధి చెందుతుంది.
- రవాణా సౌకర్యాలు ఎంత ఎక్కువగా అందుబాటులో ఉంటే వ్యవసాయ, వివిధ పరిశ్రమల ఉత్పత్తులను అంత ఎక్కువగా ప్రజలకు చేరువ చేయవచ్చు (వాణిజ్యం ద్వారా) ఉదా : విదేశాలలో తయారైన ఎలక్ట్రానిక్స్ మొబైల్ ఫోన్లు స్థానిక మార్కెట్లో లభ్యమవ్వడం.
6th Class Social Textbook Page No.92
ప్రశ్న 11.
పై భారతదేశ పటంలో గుప్త సామ్రాజ్యంలోని నాలుగు ముఖ్యమైన నగరాల పేర్లను రాయుము.
జవాబు:
- పాటలీపుత్ర
- ఉజ్జయిని
- సాంచి
- బరుకచ్చా
6th Class Social Textbook Page No.93
ప్రశ్న 12.
సముద్రగుప్తుడు గొప్ప విజేత అని నీవు భావిస్తున్నావా? సమాధానాన్ని సమర్ధింపుము.
జవాబు:
సముద్రగుప్తుడు గొప్ప విజేత అని నేను భావిస్తున్నాను.
- మొదటి చంద్ర గుప్తుని తర్వాత సముద్రగుప్తుడు రాజైనాడు.
- ఇతని కాలంలో సామ్రాజ్యము ఉత్తర భారతదేశం అంతటా విస్తరించినది. సముద్రగుప్తుడు అపజయమే ఎరుగనటువంటి గొప్ప విజేత.
- ఇతని తర్వాత రెండవ చంద్రగుప్తుడు పరిపాలకుడయ్యాడు. పశ్చిమ భారతదేశంలోని శకరాజులను కూడా ఇతను జయించగలిగినాడు.
- సముద్రగుప్తుడు ఉత్తర భారతదేశంలోని తొమ్మిది మంది ప్రముఖ రాజులను ఓడించి వారి రాజ్యాలను తమ రాజ్యంలో కలుపుకున్నాడు.
- దక్షిణాదిన 12 మంది రాజులను ఓడించి తన ఆధీనంలోకి తెచ్చుకున్నాడు.
- తమిళనాడులోని కంచి వరకు తన జైత్రయాత్రను కొనసాగించాడు.
6th Class Social Textbook Page No.95
ప్రశ్న 13.
శాతవాహనులలో గౌతమీపుత్ర శాతకర్ణి గొప్పవాడని ఎట్లు చెప్పగలవు ? అలా అయితే ఎందువలన?
జవాబు:
- శాతవాహన రాజులలో ముఖ్యమైన రాజులు గౌతమీపుత్ర శాతకర్ణి, వాశిష్ట పుత్ర పులోమాని మరియు యజ్ఞశ్రీ శాతకర్ణి. శాతవాహనులు 300 సంవత్సరాలు పరిపాలించారు.
- గౌతమీపుత్ర శాతకర్ణి శాతవాహన రాజులందరిలో గొప్పవాడు.
- అతను శకులను, యవ్వనులను, పహ్లావులను ఓడించాడు.
- దక్షిణ భారతదేశంలో మూడు సముద్రాల మధ్య ప్రాంతాన్ని జయించాడు.
- అందువలన అతనికి త్రిసముద్రాధీశ్వర’ అనే బిరుదు వచ్చింది.
6th Class Social Textbook Page No.96
ప్రశ్న 14.
ఇక్ష్వాకులు అన్ని తెగల వారిని ఏకం చేయగలిగారు. నీవు దీనిని అంగీకరిస్తావా లేదా విభేదిస్తావా ? అవును అయితే వారు ఏయే పద్ధతులను ఉపయోగించారు?
జవాబు:
ఇక్ష్వాకులు అన్ని తెగల వారిని ఏకం చేయగలిగారు, నేను దీనికి అంగీకరిస్తున్నాను. ఏ పద్దతులు ఉపయోగించారు అంటే,
- ఇతర తెగల వారితో వివాహ సంబంధాలు ఏర్పాటు చేసుకొనుట ద్వారా
- యజ్ఞ, యాగాదులు (అశ్వమేథ యాగం మొ||) చేయటం ద్వారా
- రామాయణంలోని శ్రీరాముని వారసులుగా చెప్పుకొనుట ద్వారా