AP Board 7th Class Maths Solutions Chapter 10 త్రిభుజాల నిర్మాణం Review Exercise
AP State Syllabus 7th Class Maths Solutions 10th Lesson త్రిభుజాల నిర్మాణం Review Exercise
ప్రశ్న 1.
70°, 110° కోణాలను కోణమానిని ఉపయోగించి గీయండి.
సాధన.

నిర్మాణ సోపానక్రమం:
- OX కిరణాన్ని గీయాలి.
- OA వ్యాసార్ధంతో ‘O’ కేంద్రంగా OX కిరణంపై ఒక చాపరేఖ గీయాలి.
- ‘O’ somon OA వ్యాసార్ధంతో OX−→− భాగంలో ఒక చాపరేఖ గీయాలి.
- ‘A’ కేంద్రంగా OA వ్యాసార్ధంతో మునుపటి చాపరేఖను ఖండిస్తూ మరొక చాపరేఖను గీయాలి. ఖండన బిందువును ‘B’గా గుర్తించాలి.
- OB లను కలపాలి.
- కావలసిన కోణం ∠AOB = 60° ఏర్పడినది.
(ii) 120° నిర్మాణం:

- AC←→ గీచి దీనిపై ‘O’ బిందువును గుర్తించాలి.
∠AOC = 180° - పై 60° నిర్మాణం వలె ∠BOC = 60° లను ‘నిర్మించాలి.
- మనకు కావలసిన 120°ల కోణం ∠AOB కోణం ఏర్పడినది.
ప్రశ్న 3.
స్కేలు, వృత్తలేఖినిలను ఉపయోగించి PQ = 4.5 సెం.మీ. రేఖాఖండం గీచి, దానికి లంబసమద్వి ఖండన రేఖను గీయండి.
సాధన.

నిర్మాణ సోపానక్రమం:
- PQ = 4.5 సెం.మీ. రేఖాఖండాన్ని గీయాలి.
- PQ పొడవులో సగం కన్నా ఎక్కువ వ్యాసార్థంతో P కేంద్రంగా PQ¯¯¯¯¯¯¯ పైన, క్రింద చాపరేఖలు గీయాలి. మరియు
- అదే వ్యాసార్ధంతో Q కేంద్రంగా మునుపటి చాపరేఖలను ఖండించాలి.
- ఖండన బిందువులు X, Y లను కలపాలి.
- మనకు కావలసిన లంబ సమద్విఖండన రేఖ XY←→ ఏర్పడుతుంది.
ప్రశ్న 4.
స్కేలు, వృత్తలేఖినిలను ఉపయోగించి ∠DEF = 60° లను గీచి, దానికి కోణసమద్వి ఖండన రేఖను గీయండి.
సాధన.

∠DEF = 60°
∠DEC = ∠CEF = 30°
నిర్మాణ సోపానక్రమం:
- స్కేలు, వృత్తలేఖిని సహాయంతో 60° కోణాన్ని నిర్మించాలి. (2వ సమస్యలో వలె)
- ‘O’ కేంద్రంగా ED−→ మరియు EF−→ లపై సమాన దూరంలో రెండు చాపరేఖలను గీయాలి. ఖండన బిందువులను P, Q లుగా గుర్తించాలి.
- P కేంద్రంగా ∠DEF అంతరంగా ఒక చాపరేఖను గీచి, అదే వ్యాసార్ధంతో Q కేంద్రంగా ఈ చాపరేఖను ఖండించాలి. ఖండన బిందువును Cగా, గుర్తించాలి.
- E, C లను కలపాలి.
- మనకు కావలసిన కోణసమద్విఖండన రేఖ EC ‘ఏర్పడినది.
ప్రశ్న 5.
కోణమానిని ఉపయోగించకుండా 90° కోణంను గీయండి.
సాధన.

నిర్మాణ సోపానక్రమం:
- XY←→ గీచి దానిపై ‘O’ బిందువును గుర్తించాలి.
- ‘O’ కేంద్రంగా ‘O’ కు ఇరువైపులా సమాన దూరంలో రెండు చాపరేఖలు గీచి, ఖండన బిందువులను A, B లుగా గుర్తించాలి.
- A కేంద్రంగా కొంత వ్యాసార్ధంతో XY←→ కి పైన ఒక చాపరేఖ గీయాలి.
- B కేంద్రంగా అదే వ్యాసార్ధంతో మునుపటి చాపరేఖను ఖండించాలి. ఖండన బిందువును ‘C’ గా గుర్తించాలి.
- O, C లను కలపాలి. మనకు కావలసిన కోణం ∠XOC = 90° ఏర్పడినది.