AP 6th Class Social Notes Chapter 10 స్థానిక స్వపరిపాలన
AP 6th Class Social Notes Chapter 10 స్థానిక స్వపరిపాలన
AP Board 6th Class Social Notes 10th Lesson స్థానిక స్వపరిపాలన
→ భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ (40′ స్థానిక స్వపరిపాలనను సూచిస్తుంది.
→ 1992వ సం||లో చేయబడిన 73వ రాజ్యాంగ సవరణ గ్రామీణ ప్రాంతాల్లో స్థానిక స్వపరిపాలనను, 74వ రాజ్యాంగ సవరణ పట్టణ ప్రాంతాల్లో స్థానిక స్వపరిపాలనను ఏర్పాటు చేశాయి.
→ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1994 పంచాయితీ రాజ్ చట్టంను చేసింది.
→ 1959లో స్థానిక స్వపరిపాలనను అమలు చేసిన మొదటి రాష్ట్రం రాజస్థాన్. ఇది భారతదేశంలో మొదట పంచాయితీ రాజ్ విధానాన్ని అవలంబించింది.
→ గ్రామ స్థాయిలో సాధారణ సభ – గ్రామ సభ (ఇది ప్రత్యక్ష ప్రజాస్వామ్యానికి నిదర్శనం)
→ సర్పంచ్ & వార్డు సభ్యులతో గ్రామ పంచాయితీ ఏర్పడుతుంది.
→ BLO అంటే బూతు లెవెల్ అధికారి.
→ ప్రతి గ్రామ పంచాయితీకి జనాభాను బట్టి 5 నుంచి 21 మంది వరకు వార్డు సభ్యులుంటారు.
→ 21 సం||రాల నిండిన వారు గ్రామ పంచాయితీ ఎన్నికలలో పోటీ చేయవచ్చు.
→ పార్లమెంట్ స్త్రీలకు స్థానిక సంస్థలలో 1/3 వంతు స్థానాలను (రిజర్వ్) కేటాయించింది.
→ మన రాష్ట్రంలో స్త్రీలకు స్థానిక సంస్థలలో 50% వంతు స్థానాలను (రిజర్వ్) చేశారు.
→ సర్పంచ్ గ్రామ పంచాయితీకి పెద్ద, అధ్యక్షుడు, గ్రామ మొదటి పౌరుడు.
→ మన రాష్ట్రంలో అక్టోబర్ 2, 2019న గ్రామ సచివాలయ వ్యవస్థ ప్రారంభించబడింది.
→ ప్రతి 2000 మందికి ఒక గ్రామ సచివాలయం ఏర్పాటు చేయబడింది.
→ ప్రతి గ్రామ సచివాలయంలో 11 మంది గ్రామ నిర్వాహకులు (ఉద్యోగులు) ఉంటారు.
→ MPTC – మండల పరిషత్ ప్రాదేశిక నియోజక వర్గం.
→ ZPTC – జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజక వర్గం.
→ జనాభా పరిమాణాన్ని బట్టి మూడు రకాల పురపాలక సంస్థలు ఉన్నాయి.
→ నగర పంచాయితీ – 20,000 నుండి 40,000 జనాభా.
→ పురపాలక సంఘం – 40,000 నుండి 3,00,000 జనాభా.
→ మున్సిపల్ కార్పోరేషన్ – 3,00,000 పైగా జనాభా.
→ NAC – నోటిఫైడ్ ఏరియా కౌన్సిల్
→ పురపాలక సంఘం అధ్యక్షుడు – మున్సిపల్ ఛైర్మన్, సభ్యులు – కౌన్సిలర్లు.
→ మున్సిపల్ కార్పోరేషన్ అధ్యక్షుడు – మేయర్, సభ్యులు – కార్పోరేటర్లు.
→ ఆంధ్రప్రదేశ్ లోని మొదటి పురపాలక సంఘం – భీమునిపట్నం (భీమిలి)
→ భీమిలి పురపాలక సంఘం 1861లో స్థాపించారు.
→ పురపాలక సంఘం ఇంటిపన్ను, వీథి దీపాలపై పన్ను, దుకాణాలపై పన్ను, సినిమా టికెట్ల మీద పన్ను మొదలైన పన్నులు విధిస్తుంది.
→ స్థానిక స్వపరిపాలన : రాష్ట్ర స్థాయి కంటే దిగువన ఉన్న ప్రభుత్వ అధికార పరిధిని ఇది సూచిస్తుంది.
→ గ్రామసభ : గ్రామస్థాయిలో సాధారణ సభ.
→ గ్రామ / వార్డు సచివాలయం : ప్రజలకు వారు నివసిస్తున్న ప్రాంతంలోనే ప్రభుత్వ సేవలను అందించే వ్యవస్థ.
→ గ్రామ కార్యనిర్వాహకులు : గ్రామ సచివాలయంలోని ఉద్యోగులు.
→ ప్రజా సదుపాయాలు : ప్రభుత్వంచే కల్పించబడిన సౌకర్యాలు.
→ పురపాలక సంఘం 0: మున్సిపాలిటీ యొక్క పరిపాలన సంస్థ, 40,000 నుండి 3,00,000 జనాభా కలిగిన పట్టణం.
→ మున్సిపల్ కార్పోరేషన్ : మున్సిపల్ కార్పొరేషన్ యొక్క పరిపాలన సంస్థ, 3,00,000 జనాభా దాటిన నగరం.
→ కౌన్సిలర్ : పురపాలక సంఘంలో వార్డు ప్రతినిధి.
→ కార్పో రేటర్ : మున్సిపల్ కార్పొరేషన్లో వార్డు ప్రతినిధి.
→ గ్రామ పంచాయితీ : గ్రామ పరిపాలన చేసే సంస్థ, ఎన్నుకోబడిన సంస్థ.
→ సర్పంచ్ : పంచాయితీ అధ్యక్షుడు. గ్రామ ప్రథమ పౌరుడు.
→ మండల పరిషత్తు : కొన్ని గ్రామాలు కలిసి ఒక మండలమవుతుంది. ఈ మండల స్థాయిలోని స్థానిక సంస్థనే మండల పరిషత్తు అంటారు.
→ జిల్లా పరిషత్తు : జిల్లా స్థాయిలోని స్థానిక సంస్థను జిల్లా పరిషత్తు అంటారు.
→ B.L.O : బూత్ స్థాయి అధికారి
→ MPTC : మండల పరిషత్ ప్రాదేశిక నియోజక వర్గం
→ ZPTC : జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజక వర్గం.
→ వార్డులు : సాధారణంగా ప్రతి గ్రామాన్ని/పట్టణాన్ని కొన్ని వీధులు, కాలనీలుగా (వార్డులు) విభజిస్తారు. వీటిని జనాభా ప్రతిపాదికన ఏర్పాటు చేస్తారు.
→ నగర పంచాయితీ : నోటిఫైడ్ ఏరియా కౌన్సిల్ (NAC) 20,000 నుండి 40,000 జనాభా కల్గిన ప్రాంతం.
→ పంచాయితీ రాజ్ : స్థానిక (పట్టణేతర) స్వపరిపాలనను పంచాయితీరాజ్ అంటారు.
→ మేయర్ : మున్సిపల్ కార్పోరేషన్ అధ్యక్షుడిని మేయర్ అంటారు. ఇతనిని కార్పోరేటర్లు పరోక్ష పద్దతిలో ఎన్నుకుంటారు.
→ NAC : నోటిఫైడ్ ఏరియా కౌన్సిల్.
→ 73వ రాజ్యాంగ సవరణ : గ్రామీణ ప్రాంతాల్లో స్థానిక స్వపరిపాలనను ఏర్పాటు చేసిన రాజ్యాంగ సవరణ.
→ 74వ రాజ్యాంగ సవరణ : పట్టణ ప్రాంతాల్లో స్థానిక స్వపరిపాలనను ఏర్పాటు చేసిన రాజ్యాంగ సవరణ.

